76 మందితో టీడీపీ తొలి జాబితా రెడీ?!

Publish Date:Sep 4, 2023

Advertisement

ఒకవైపేమో దేశమంతా ఒకేసారి ఎన్నికలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. దీనిని బట్టి చూస్తే ఈ ఏడాదిలోనే ఏపీలో కూడా ఎన్నికలు జరిగినా ఆశ్చర్యమే లేదనిపిస్తుంది. ఒకవేళ జమిలి ఎన్నికల ప్రతిపాదన అమల్లోకి రాకపోయినా ఏపీలో  ఎన్నికలకు   ఏడెనిమిది నెలలే  సమయం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ  అభ్యర్థుల పనితీరు, సర్వేల ఫలితాల మీద దృష్టి పెట్టాయి. అధికార వైసీపీని తీసుకుంటే ఒకవైపు ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ బృందం, మరోవైపు ప్రభుత్వ వర్గాలతో రహస్య సర్వే, మరో రెండు ప్రైవేట్ సంస్థలతో చేయించిన సర్వేల ఫలితాల ఆధారంగా లెక్కలేసుకుంటుంది. త్వరలో రాబోతున్న సర్వేల తుది ఫలితాల ఆధారంగా వైసీపీ తొలి జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.

ఇక, ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇప్పటికే దూకుడుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలలో స్పష్టంగా కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత, వైసీపీ నేతలలో బయటపడుతున్న అసంతృప్తి, టీడీపీ నేతలు ఎక్కడకి వెళ్లినా క్లియర్ కట్ గా ప్రజలు కోరుకుంటున్న మార్పు టీడీపీకి ఎక్కడ లేని జోష్ తీసుకొస్తున్నాయి. నో డౌట్ గెలుపు మనదే అన్నట్లు ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రజలు మెచ్చే అభ్యర్థులు, గెలుపు తెచ్చే అభ్యర్థుల కోసం ముమ్మర వేట ప్రారంభించారు. టీడీపీ కూడా రెండు మూడు రకాల సర్వేలు చేయిస్తున్నది. ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ బృందం చేపట్టిన సర్వేతో పాటు చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులైన వారితో మరో సర్వే చేయించుకుంటున్నారు. ఇవి రెండూ కాకుండా మరో ప్రైవేట్ సంస్థ కూడా టీడీపీ కోసం సర్వే చేపడుతున్నది. 

ఈ సర్వేల ఫలితాలన్నీటితో కలిపి ఇప్పటికే తొలి విడత జాబితా సిద్ధంకాగా త్వరలోనే ఈ తొలి జాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.   టీడీపీ తొలి జాబితాలో 76 మంది పేర్లు ఉంటాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఏపీలో ఉన్న ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి జిల్లాకు అయిదారుగురు వంతున ఈ తొలి జాబితాలో చోటు దక్కనుందని అంటున్నారు. వైసీపీలోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలను పక్కన పెడితే మిగిలిన పందొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు ఈ జాబితాలో ఉంటాయని.. అలాగే ఎలాంటి గ్రూపులూ లేకుండా, బలంగా ఉంటూ ప్రలలతో మమేకం అవుతున్న అభ్యర్థులను కూడా ఈ జాబితాలో ప్రకటించే అవకాశం ఉందనీ  పార్టీ వర్గాల సమాచారం. అంటే ఈ తొలి జాబితాలో ఎలాంటి వివాదాస్పద వ్యవహారాలు లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు ఉండనున్నారు.

కాగా, చాలా కాలంగా ఏపీలో పొత్తులు ఉంటాయన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కుదిరితే టీడీపీ-జనసేన-బీజేపీ.. లేకపోతే టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని రాజకీయ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ తొలి జాబితా విడుదల సమయానికి ఈ పొత్తుల వ్యవహారం తేలుతుందా అన్న చర్చ తెరపైకి వస్తున్నది. అయితే, పొత్తులు ఉన్నా సరే టీడీపీ అత్యధిక స్థానాలలో పోటీ చేస్తుందని చెప్పడానికే తొలి జాబితాలో టీడీపీ బిగ్ నంబర్ తో వస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ తమకు పాతిక స్థానాలు ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నది. మరోవైపు జనసేన కూడా భారీగానే ఆశిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే టీడీపీ 76 మందితో తొలి జాబితా ప్రకటించి పొత్తులలో అప్పర్ హ్యాండ్ సాధించాలని   భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. అదే నిజమై పొత్తులతో సంబంధం లేకుండా టీడీపీ ఫస్ట్ లిస్ట్ ప్రకటిస్తే జనసేన, బీజేపీలపై ఒత్తిడి పెరగడం ఖాయంగా కనిపిస్తున్నది.  

By
en-us Political News

  
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.