కాన్ఫరెన్సులతో కాలక్షేపం, ఏమి సాధించారు... బాబు పై సీనియర్ల విసుర్లు
Publish Date:Jun 14, 2019
Advertisement
గడచిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం చవి చూసిన టిడిపి ఓటమికి గల కారణాలను అన్వేషించే పనిలో పడింది. దీని కోసమే ఈ రోజు విజయవాడ లో జరుగుతున్న విస్తృత స్థాయి సమావేశంలో నేతలు తమ తమ అభిప్రాయాలూ నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు పార్టీ అధినేత బాబు తీరు పై తన అసహనాన్ని వ్యక్తం చేసారు. ఎన్నికల సమయం లో బాబు చేసిన టెలి కాన్ఫరెన్సుల వల్ల ఎటువంటి ఫలితం లేదని కొన్ని వేల మంది పాల్గొన్న ఆ కాన్ఫరెన్సుల లో కొన్ని వాస్తవాలను తెలియ చేసే అవకాశం లేకుండా పోయిందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. టిడిపిలో మానవ సంబంధాలు తగ్గిపోయాయని, పార్టీ కార్యకర్తలకు నేతలకు చంద్రబాబు దూరమయ్యారని, మరో టిడిపి నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. ప్రజల అభిప్రాయం కోసం ఆర్టీజిఎస్ నివేదికల పై ఆధారపడటం, అలాగే అధికారులతో ఎక్కువ సేపు గడపటం ఇవి పార్టీకి హాని చేశాయని ఎమ్మెల్సీ శ్రీనివాసులు తెలిపారు. కోడెల కుటుంబ అక్రమాలపై ఎన్నికల వేళ ప్రజలు ప్రస్తావించారని అలాగే గ్రామాల్లో పార్టీ నేతల అవినీతిపై చంద్రబాబుకు తెలియజేసే అవకాశమే లేకుండా పోయిందని, చంద్రబాబు చుట్టూ ఉన్న కోటరీ వాస్తవ పరిస్థితులు అధినేత దృష్టికి వెళ్లకుండా అడ్డుపడిందని మరో నేత దివ్యవాణి కుండ బద్దలు కొట్టారు.
http://www.teluguone.com/news/content/tdp-extensive-meeting-on-poll-debacle-in-ap-assembly-elections-39-87381.html





