తెలంగాణలో టీడీపీ పోటీ.. సస్పెన్స్ కు ఇకనైనా తెరపడేనా?

Publish Date:Oct 27, 2023

Advertisement

తెలంగాణలో ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి. ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంటే కేవలం ఇంకో 34 రోజుల సమయం మాత్రమే ఉంది. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది. కాంగ్రెస్, బీజేపీలు కూడా అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయగా.. ఏ క్షణమైనా ఈ రెండు పార్టీలు రెండో జాబితా విడుదల చేయాలని వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే, కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా చేయదా అనే అంశంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత అక్రమ అరెస్టుతో జైల్లో ఉండడంతో ఈసారి తెలంగాణ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంటుందనే ప్రచారం జరుగుతూ వచ్చిది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ దీన్ని ఖండిస్తూ వస్తున్నారు.  తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ కూడా పోటీ చేస్తుందని ఆయన విస్పష్టంగా చెబుతున్నారు. అటు జనసేన కూడా పోటీలో ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. కాసాని జ్ణానేశ్వర్ ఏపీలో తెలుగుదేశం పొత్తు ఎలా ఖరారైందో.. తెలంగాణలో కూడా అలాగే ఉంటుందనీ, ఇరు పార్టీలూ కలిసి 

మొత్తం 119 స్థానాల్లో  పోటీ చేస్తాయని చెబుతున్నారు. కానీ  బీజేపీ మాత్రం జనసేన ఎన్డీయేలో భాగస్వామి అని చెబుతోంది. బీజేపీ జనసేనలు కలిసి తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తాయనీ, సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై చర్చలు జరుగుతున్నాయనీ చెబుతోంది. తొలి దశలో బీజేపీ జనసేన మద్దతు ఇవ్వాలనీ, పోటీకి దూరంగా ఉండాలని చేసిన ప్రతిపాదనను జనసేనాని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చరు. ఆ నేపథ్యంలోనే అమిత్ షా ఆహ్వానం మేరకు జనసేనాని ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయి వచ్చారు. ఇది జరిగి మూడు రోజులు కావస్తున్నా అటు బీజేపీ కానీ ఇటు జనసేన కానీ ఆ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. అసలు అమిత్ షాతో భేటీ తరువాత ఇరు పార్టీలూ కూడా మీడియా ముందుకు వచ్చిందే లేదు. ఈ నేపథ్యంలోనే కాసాని మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏపీలో లాగే తెలంగాణలో కూడా రెండు పార్టీలో కలిసే ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాసాని నేడో రేపో రాజమహేంద్రవరం వెళి చంద్రబాబుతో ములాఖత్ ద్వారా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఆ భేటీ తరువాత పోటీపై స్పష్టత ఉంటుందని అంటున్నారు.  తెలంగాణలో టీడీపీ పోటీపై కొన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కాసాని అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం ఓటు బ్యాంకు నేటికీ చెక్కుచెదరకుండా ఉందనీ, ఏపీలో జగన్ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన తరువాత తటస్థులు కూడా చంద్రబాబుకు సంగీభావం ప్రకటించడం, స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగడం చూస్తుంటే..చంద్రబాబుపై ప్రజాభిమానం ఇనుమడించిందన్నది అవగతమౌతోందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తే.. నిర్ణయాత్మక పాత్ర పోషించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

By
en-us Political News

  
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.