Publish Date:May 30, 2021
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై స్పందించారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. రెండేళ్లుగా ఏపీలో జరిగిన, జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్‌లో టీడీపీ మహానాడు నిర్వహణలో భాగంగా వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు చంద్రబాబు. రాజకీయ కక్ష కోసం తాను ఎన్నడూ ప్రయత్నాలు చేయలేదని చెప్పారు. అభివృద్ధి కోసమే నిరంతం తపించానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అరాచక పాలన సాగుతుందన్నారు. అభివృద్దినా గాలికొదేలిసి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ అప్పులమయం చేశారని ఆరోపించారు. ఆర్థిక అసమానతలను తొలగించుకుంటూ పోవాలి.. అంతేగానీ, ఇష్ట ప్రకారం చేసుకుంటూ పోతానంటే అభివృద్ధి జరగదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతున్నాయి.. అప్పులు చేసుకుంటూ పోతున్నారని అన్నారు. 'ఇలా చేసుకుంటూ పోతే భవిష్యత్తులో అప్పులు ఇచ్చే వారు కూడా కరవైపోతారు రాష్ట్రం దివాళా తీస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సంపద సృష్టించాలి. ఆ సంపదతో పథకాలను కొనసాగించాలి. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి పని చేయట్లేదు. అప్పులు చేసుకుంటూ వెళ్తోంది' అని చంద్రబాబు విమర్శల జల్లు కురిపించారు.
ఐటీని ప్రమోట్ చేయాలని ఆనాడు హైటెక్ సిటీకి రూపకల్పన చేశానని చెప్పారు చంద్రబాబు. అమెరికాలో తిరిగి భారత్‌కు రావాలని ఐటీ కంపెనీలను కోరాను.. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో మాట్లాడానని చంద్రబాబు తెలిపారు. భారత్ లో ఐటీ రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించి.. మైక్రోసాఫ్ట్ బ్రాంచ్‌ను హైదరాబాద్‌లో పెట్టాలని కోరానన్నారు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌కు వస్తే ప్రపంచంలోని అనేక ఐటీ కంపెనీలు అక్కడకు వస్తాయని భావించాను... అనంతరం అదే జరిగిందన్నారు చంద్రబాబు. అనేక ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయంటే గతంలో తాను చేసిన ప్రయత్నమే కారణమన్నారు.హైదరాబాద్‌లో అభివృద్ధిని ఎప్పుడు చూసినా తనకు చాలా సంతృప్తి కలుగుతుందన్నారు చంద్రబాబు. తన విజన్ వల్లే హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగాయని చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-chief-chandrababu-fire-on-jagan-two-years-rule-25-116567.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.