Publish Date:Mar 23, 2023
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాథ జయకేతనం ఎగురవేశారు. మొత్తం ఏడు స్థానాలకు ఎన్నికలు జరగగా ఎనిమిది మంది పోటీలో నిలిచారు. ఈ ఎన్నికలలో వంద శాతం ఓటింగ్ జరిగింది. అంటే మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా అన్నీ ఓట్లూ చెల్లుబాటు అయ్యాయి.
ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలంటే పోటీలో ఉన్న అభ్యర్థులు ఒక్కొక్కరికీ 22 ఓట్లు అవసరం. ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులకు 22 చొప్పున ఓట్లు రాగా తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాథకు 23 ఓట్లు వచ్చాయి. వాస్తవంగా టీడీపీకి ఉన్న సంఖ్యాబలం 19 మంది ఎమ్మెల్యేలే అయినప్పటికీ ఆమెకు 23 ఓట్లు రావడం గమనార్హం.
వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, అనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీకే ఓటు వేశారని భావించినా, మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారని పంచుమర్తి అనూరాథ విజయం ద్వారా తేలిపోయింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించగా, వైసీపీ తరపున బొమ్మి ఇజ్రాయెల్, ఏసురత్నం, పోతుల సునీత, సూర్యనారాయణరాజు, మర్రి రాజశేఖర్ గెలుపొందారు. వైసీపీ ఇతర అభ్యర్థులు జయమంగళ వెంకటరమణ, కోలా గురువులుకు 21 ఓట్లు చొప్పున రావడంతో... రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఈ క్రమంలో వెంకటరమణ విజయం సాధించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-candidate-panchumarti-anuradha-win-25-152850.html
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.