Publish Date:May 15, 2025
కడపలో తెలుగుదేశం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న పసుపు పండుగ మహానాడులో కీలక నిర్ణయాలు వెలువడుతాయన్న సంకేతాలు వినవస్తున్నాయి. వాటిలో ప్రధానంగా పార్టీలో లోకేష్ కు అత్యంత కీలక పదవిని కట్టబెట్టనున్నారని గట్టిగా వినవస్తున్నది. లోకేష్ కు ప్రమోషన్ కోసం పార్టీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనే కొత్త పదవిని సృష్టించి ఆ పదవిని లోకేష్ కు కట్టబెట్టనున్నట్లు పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. పార్టీలో అత్యంత నిర్మాణాత్మకమైన, నిర్ణయాత్మకమైన బాధ్యతలను లోకేష్ కు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే లోకేష్ ను పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక లోకేష్ ను పార్టీ ఎగ్జిక్యూటీవ్ ప్రెసిడెంట్ గా నియమించడంపై కడప మహానాడు వేదికగా ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. అంత వరకూ బానే ఉంది. పార్టీలో లోకేష్ ప్రమోషన్ సరే.. అయితే అటువంటి ప్రమోషనే లోకేష్ కు ప్రభుత్వంలో కూడా దక్కాల్సి ఉందని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. గతంలోనే లోకేష్ ను ఉపముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ పార్టీలో గట్టిగా వినిపించింది. అయితే సంకీర్ణ ధర్మాన్ని, కూటమి పరిమితులను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు అటువంటి డిమాండ్ లు చేయవద్దంటూ చంద్రబాబు గట్టిగా మందలించడంతో ఆ డిమాండ్ సద్దుమణిగింది.
అయితే ఇప్పుడు లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ ఖాయమైన నేపథ్యంలో పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా అత్యంత కీలకంగా, క్రియాశీలంగా వ్యవహరిస్తున్న లోకేష్ కు ప్రభుత్వంలో కూడా ప్రమోషన్ ఇవ్వాలన్న డిమాండ్ పార్టీలో జోరందుకుంటోంది. మిత్రధర్మం పేరిట లోకేష్ కు ప్రభుత్వంలో మూడో స్థానంలో ఉంచడం సరికాదన్నది పార్టీ శ్రేణుల అభిప్రాయంగా కనిపిస్తున్నది. వాస్తవానికి లోకేష్ కు ఇప్పుడు పార్టీలో ప్రమోషన్ ఇవ్వకున్నా ఆయన స్థాయికి కానీ, హోదాకు కానీ వచ్చిన నష్టమేదీ లేదు. వాస్తవానికి పార్టీ మొత్తం చంద్రబాబుకు సక్ససర్ లోకేషే అని మక్తకంఠంతో చెబుతోంది. అదే పరిస్థితి ప్రభుత్వంలోనూ ఉండాలనీ, దానిని అధికారికంగా ప్రకటించాలనీ క్యాడర్ కోరుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-cadre-demand-pramotion-to-lokesh-in-government-also-25-198129.html
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.