కట్టలు తెంచుకున్న తెలుగుదేశం శ్రేణుల ఆగ్రహం.. వైసీపీకే కాదు.. టీడీపీకీ హెచ్చరికే!

Publish Date:Feb 2, 2026

Advertisement

 

భారతదేశంలో  అత్యంత ప్రజాదరణ ఉన్న పార్టీలలో తెలుగుదేశం పార్టీ ఒకటి అన్నది నిస్సందేహంగా చెప్పవచ్చు.  పార్టీ కార్యకర్తల క్రమశిక్షణ విషయంలో తెలుగుదేశం పార్టీ  వామపక్షాలు, బీజేపీ వంటి పార్టీలకు దీటుగా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తారు. ఎన్ని సంక్షోభాలు ఎదుర్కొన్నా, ఎన్ని దాడులకు గురైనా, ఆ పార్టీ నేతలు ఎన్నడూ కట్టుదాటి ప్రవర్తించిన దాఖలాలు కనిపించవు.

తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. అన్ని సంక్షోభాలనూ కూడా శాంతియుత ఆందోళనలు, పోరాటాల ద్వారానే అధిగమించింది. ముఖ్యంగా 1984లో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అత్యంత అప్రజాస్వామికంగా కూల్చివేసిన సమయంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నభూతో అన్నచందంగా చరిత్రలో నిలబడిపోతుంది. ఇక గత జగన్ హయాంలో అంటే 2019 నుంచి  2024 వరకూ  తెలుగుదేశం రాజకీయ మనుగడ లేకుండా చేయాలన్నలక్ష్యంతో జరిగిన కుట్రలకు లెక్కే లేదు. స్కిల్ కేసు అంటూ అక్రమంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్టు చేసి 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో నిర్బంధించిన సందర్భంలో కూడా ఎక్కడా గీత దాటకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగానే తెలుగుదేశం శ్రేణులు ఉద్యమించాయి. అయితే  శనివారం (జనవరి 31)న తెలుగుదేశం శ్రేణులు అంబటి రాంబాబు నివాసాన్ని ముట్టడించి విధ్వంసం సృష్టించారు. తెలుగుదేశం చరిత్రలో ఈ రీతిగా కార్యకర్తలు రెచ్చిపోవడం ఇదే మొదటి సారని పరిశీలకులు సైతం చెబుతున్నారు.  

అయితే తెలుగుదేశం కార్యకర్తలు, నేతలలో ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి కారణం వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో దూషించడమే కారణం అంటున్నారు.   అదే సమయంలో మరో మాజీ మంత్రి జోగు రమేష్ కూడా మంత్రి నారా లోకేష్ పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా తెలుగుదేశం శ్రేణులు ఫైర్ అయ్యాయి.   ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసాన్ని తెలుగుదేశం కార్యకర్తలు ముట్టడించారు.  ఇలా ఒక రోజు వ్యవధిలోనే తెలుగుదేశం కార్యకర్తలు ఇద్దరు వైసీపీ నేతల ఇళ్ల ముట్టడి.. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించురకుంది.

గతంలో అంటే వైసీపీ హయాంలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఈ స్థాయిలో తెలుగుదేశం కార్యకర్తల నుంచి ఆగ్రహం వ్యక్తం కాలేదు. అయితే ఇప్పుడుఈ స్థాయిలో తెలుగుదేశం శ్రేణులు భగ్గుమనడం విశేషం. అధినేతను దూషించినా, అనుచితంగా వ్యవహరించినా ఇక ఊరుకునేది లేదన్న స్పష్టమైన సందేశాన్ని తెలుగుదేశం శ్రేణులు ఈ ఘటనల ద్వారా   వైసీపీకి, ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న వైసీపీయులపై చర్యల విషయంలో ఉదాశీనంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికీ  ఈ సంఘటనలు ఒక హెచ్చరికగా భావించవచ్చన్న చర్చ రాజకీయవర్గాలలో జరుగుతోంది.  

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.