Publish Date:Mar 20, 2025
వైసీపీ నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఒకవైపు పార్టీ నుంచి ఒత్తిడులు, ఉద్యమాలు ఆందోళనలు చేయాలని పిలుపులు, పురమాయింపులు జారీ అవుతున్నాయి! మరొకవైపు ఏదైనా ఆందోళన చేద్దాం అనుకుంటే ప్రజల నుంచి స్పందన కరువు! ఏం చేయాలనుకున్నా కూడా నలుగురు జనాన్ని పోగేయాలంటే వేలు, లక్షలలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి.
Publish Date:Mar 20, 2025
మాజీ ఐ అండ్ పి ఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి ఎసిబి నోటీసులు
ఎపి ఐ అండ్ పీఆర్ మాజీ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. వైకాపా హయాంలో ఆయన జగన్ మీడియా, వైసీపీ అనుకూల మీడియా సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు దోచి పెట్టారు.
Publish Date:Mar 20, 2025
వైసీపీ చేసేవన్నీ దొంగ రాజకీయాలే. ఒక్క విషయంలో కూడా చెప్పినది చెప్పినట్లు చేసిన దాఖలాలు కనిపించవు. విపక్షంలో ఉన్న సమయంలో అమరావతి రాజధానికి బేషరతు మద్దతు అంటూ ప్రకటించి.. 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించింది. మూడు రాజధానులంటూ మూడుముక్కలాటతో దొంగ రాజకీయాలు నెరపింది.
Publish Date:Mar 20, 2025
మాజీ సీఎం కేసీఆర్‌కు తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు షాకిచ్చాయి. గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బీజేపీ నాయకులు బుధవారం (మార్చి 19) టులెట్ బోర్డు పెట్టారు. గజ్వేల్ ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి రాకపోవడంపై వాంటెడ్ ఎమ్మెల్యే అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచి 15 నెలలైనా కేసీఆర్ ఒక్కసారి కూడా గజ్వేల్ వైపు చూడలేదని బీజేపీ శ్రేణులు ఈ సందర్భంగా అన్నారు.
Publish Date:Mar 20, 2025
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కేసులో టీవీ యాంకర్ విష్ణుప్రియ గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తన న్యాయవాది తో కలిసి ఉదయం పది గంటల పిఎస్ మంగళవారం సాయంత్రం విచారణకు రావాల్సిందగా పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ ఆమె హాజరు కాలేదు.
Publish Date:Mar 20, 2025
ఏపీలో గత వైసీపీ గత పాలనకు, ప్రస్తుత కూటమి పాలనకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఐదేళ్ల జగన్ హయాంలో రాష్ట్రం అన్ని విధాలుగా భ్రష్టుపట్టిపోయింది. పాలన అంటే దోచుకో, దాచుకో, వ్యతిరేకులపై దౌర్జన్యాలూ, దాడులు, అరెస్టులు, అక్రమ కేసులే అన్నట్లుగా జగన్ హయం సాగింది. జగన్ హయాంలో జనం నిత్యం భయంభయంగా బతికే పరిస్థితి ఉంది. ఏం మాట్లాడితే ఏ కేసు పెడతారో అన్న ఆందోళన అన్ని వర్గాలలో నెలకొంది.
Publish Date:Mar 20, 2025
ప్రముఖ యాంకర్, వైసీపీ అధికార ప్రతినిథి శ్యామలకు ఉచ్చు బిగుస్తున్నదా? అన్న ప్రశ్నకు ఔననే సమాధానం వస్తున్నది. నిబంధనలకు తిలోదకాలిచ్చి, చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన 11 మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
Publish Date:Mar 20, 2025
బడ్జెట్ గురించి చర్చ వచ్చినప్పుడు, బడ్జెట్ అంటే కేవలం అంకెల కుప్ప కాదు. బడ్జెట్ అంటే మన విలువలు, మన ఆశలు, ఆశయాల ప్రకటన. అలాగే, ఒక మంచి బడ్జెట్ నాణేనికి ఒక వైపు నుంచి మాత్రమే కాదు, రెండు వైపుల నుంచీ, (బొమ్మ బొరుసు) రెండూ చూపిస్తుంది అంటారు బడ్జెట్ విలువ తెలిసిన పెద్దలు.
Publish Date:Mar 19, 2025
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదనే సంగతి ఆ పార్టీలోని నాయకులు అందరికీ అర్థం అవుతోంది. భవిష్యత్ లేని పార్టీలో ఉండడం కంటే.. రాజకీయాలు మానుకోవడమే బెటర్ అని కొందరు రాజీనామా చేస్తున్నారు. వెళ్లిపోయిన వారు పార్టీ మీద నిందలు వేయడం.. వెళ్లిపోయిన వారు ద్రోహులని పార్టీ నింద వేయడం చాలా మామూలు సంగతి. వైసీపీ నుంచి వెళ్లిపోయిన వారందరి గురించి జగన్ కూడా ఇలాగే మాట్లాడుతూ వచ్చారు.
Publish Date:Mar 19, 2025
సునీతా విలియమ్స్ 9 నెలల సుదీర్ఘ కాలం అంతరిక్షంలో చక్కుకుపోయి ఎట్టకేలకు భువికి చేరుకున్నారు. అయితే అంత కాలం అంతరిక్షంలో ఉన్న ఆమె ఇక్కడ భూమి మీద సాధారణ జీవితం గడపడం అంత సులభం కాదు. ఆమె కొంత కాలం ఐసోలేషన్ లో ఉండాల్సిందే.
Publish Date:Mar 19, 2025
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (మార్చి 19) శ్రీవారికి హుండీ ద్వారా భక్తులు సమర్పించిన కానుకలు 3 కోట్ల 97 లక్షల రూపాయలు.
Publish Date:Mar 19, 2025
కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది . వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వచ్చిన ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పటికే టీడీపీ పాగా వేసింది. 2024 ఎన్నికలలో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏడింటిని కైవసం చేసుకున్న కూటమి జగన్‌కు షాక్ ఇచ్చింది.
Publish Date:Mar 19, 2025
భగవంతుడా ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు! ఎదిగిన బిడ్డ చదువుకుంటోంది, మంచి భవిష్యత్తు ఉంటుందని, కలలు కన్నతల్లితండ్రులకు ... ఆ బిడ్డ విహారానికి వెళ్లి సముద్ర తీరం లో గల్లంతైయితే ,పది రోజులు గడుస్తున్నా పోలీసులు కోస్ట్ గార్డ్ సిబ్బంది వెతికినా ఆచూకీ లేకపోతే ... తమ కుమార్తె బతికే ఉంది అన్న ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి లో... ఊరు కానీ ఊరిలో, సాగర తీరం లో వారు అనుభవిస్తున్న క్షోభ వర్ణనాతీతం.