ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసిన తెలుగుదేశం

Publish Date:Sep 15, 2022

Advertisement

ఆంధ్ర ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు మొద‌టిరోజు గురువారం(సెప్టెంబర్15) విప‌క్షాల నినాదాల‌తో హోరెత్తింది. తొలి రోజే టీడీపీ స‌భ్యులు ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్  ప్రసంగాన్ని అడ్డకుకుంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్య   గవర్నర్ ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో  మార్షల్స్  రంగ ప్రవేశం చేసి   బీటెక్ రవితో పాటు మరో ఎమ్మెల్సీని బయటకు తీసు కెళ్లారు. దీంతో మార్షల్స్ తో తెలుగుదేశం సభ్యులు వాగ్వాదానికి దిగారు. చివరకు గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి టీడీపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

అంతకుముందు  గవర్నర్  గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సీఎం జగన్ తీవ్ర అస హనం వ్యక్తం చేశారు.  జాబ్‌క్యాలెండర్... జాబ్‌లెస్ క్యాలెండర్ అంటూ టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మా నాన్ని స్పీకర్  తిరస్కరించడంతో గొడవ మొదలైంది. వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. స్పీకర్‌ పోడియం దగ్గర దూసుకెళ్లి టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. జాబ్‌ ఎక్కడ జగన్‌ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నిరుద్యోగులను మోసం చేసిన జగన్‌  డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్ క్యాలెండర్‌గా మారిందని టీడీపీ నినాదాలు చేసింది. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాన్ని చేపడతామని స్పీకర్ చెప్పినప్పటికీ తెలుగుదేశం సభ్యులు వెనక్కి తగ్గలేదు. అసెంబ్లీ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. 

.టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల్లో టీడీపీ సభ్యుల ప్రశ్నలే ఉన్నాయన్నారు. ప్లకార్డులతో సభలోకి రావడం సరికాదని అన్నారు. టీడీపీ సభ్యులు కావాలనే ఆందోళన చేస్తున్నారని మంత్రి బుగ్గన  ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.  

By
en-us Political News

  
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.