పన్నులు తెలంగాణకు.. సమస్యల తలనొప్పులు ఏపీకీనా?

Publish Date:Aug 11, 2025

Advertisement

తెలుగు చిత్రపరిశ్రమ తీరు పట్ల ఏపీలో ఆగ్రహం

 మీ ఇంటికొస్తే ఏమిస్తావ్.. మాయింటి కొస్తే ఏం తెస్తావ్ అన్నట్లుగా ఉంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దల తీరు. ఔను తెలుగు సినీ పరిశ్రమ తీరు అడ్డగోలుగా ఉంది. పన్నులన్నీ తెలంగాణ ప్రభుత్వానికి కడతాం.. మా సమస్యలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరించాలంటూ దబాయిస్తున్నట్లుగా కనిపిస్తోంది.  . ఉండేది తెలంగాణ రాజధానిలో ... టాక్స్ లు  కట్టేది అక్కడి ప్రభుత్వానికి, ఎనభై శాతం షూటింగ్ లు జరిపేది కూడా అక్కడే.  పనిచేసే కార్మికులు కూడా80 శాతం మంది తెలంగాణ వారే.  అక్కడ కార్మికులకు కడుపు కాలి ధర్నాలు చేస్తే.. ఏపీ సర్కార్ చర్చలు జరిపి పరిష్కరించాలని కోరుకుంటున్నారు.  అసలు తెలంగాణలో సినీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఏపీకి సండంధం ఏమిటి; ఆ తలనొప్పి ఏపీ ప్రభుత్వానికి ఎందుకు అంట గట్టాలని చూస్తున్నారు? అన్నది అర్థం కాని పరిస్థితి.  

వాస్తవంలోకి వెళ్తే సినీ పరిశ్రమ మొత్తం హైదరాబాద్ లోనే ఉంది. సినిమా వాళ్ళంతా ఉండేది ,జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్, మణికొండ తదితర ప్రాంతాల్లోనే.  నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు ,క్యారెక్టర్ ఆర్టిస్టులు  మొత్తం హైదరాబాద్ లోనే మకాం వేసి ఉన్నారు. కట్టే టాక్స్ లు కూడా ఎనభై శాతానికి పైగా  తెలంగాణ ప్రభుత్వానికే కడతారు. కానీ ఏదైనా సమస్య వస్తే మాత్రం పరిష్కారం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైపు చూస్తారు. అక్కడి సినీ పరిశ్రమకు కష్టం వస్తే..  హైదరాబాదులో సినీ కార్మికులు ధర్నాలు చేస్తుంటే..  ఏపీ ఈ వ్యవహారం పై  ఏపీ ప్రభుత్వం ఒకసారి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.  తాజాగా  సినీ పరిశ్రమంలో సంక్షోభాన్ని ఏపీ ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అంతా బాగున్నప్పుడు తెలంగాణలో  మకాం వేసి ఉంటారు?  ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం ,ఏపీలోకి వచ్చి  హడావుడి చేసి వెళ్ళిపోతుంటారు.  ఇలాంటి వ్యవహార శైలి ఇటీవల కాలంలో సినీ పరిశ్రమ పెద్దలకు ఎక్కువైపోయింది. తాజాగా ఏపీ ప్రభుత్వం దగ్గరకు నిర్మాతల బృందం వచ్చింది. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కావాలి..   మా సమస్యలు మొత్తం ఏకరువు పెట్టి తెలంగాణలో వచ్చిన సమస్య పరిష్కరించమని  కోరుకుంటామంటూ ఏపీ సినీమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ ను కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.  తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తలెత్తిన సమస్య గురించి సీఎం దృష్టికీ, డిప్యూటీ సీఎం దృష్టికీ తీసుకువెడతానని హామీ ఇచ్చారు. అయితే అసలు ఎక్కడో హైదరాబాదులో జరుగుతున్న ధర్నాలు,సమ్మెల వ్యవహారానికి ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తారు? అసలు ఏదైనా సరే ఎందుకు చేయాలి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అసలు తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడో ఒక సారి వారి అవసరాల కోసం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రాంతాలలో షూటింగ్ లు జరుపుకుని వెళ్లిపోడం వినా.. ఇక్కడ మకాం వేయడం కానీ, ఇక్కడ స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు ఏమైనా నిర్మించడానికి కనీసం ప్రతిపాదలైనా చేశారా? అగ్ర హీరోల దగ్గర నుండి ,నిర్మాతల వరకూ మొత్తం హైదరాబాద్ లోనే..  సినిమా రీలీజుల సమయంలో మాత్రం  టికెట్ల రేట్లు పెంచి..  ఏపీ ప్రేక్షకుల జేబులకు చిల్లు పెడతాం అనుమతించండి అంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరడం వినా, వీరు ఏపీకి చేసిందేమిటి?  తమ నివాసాల దగ్గర నుంచి సినీమా వ్యవహారాలు, వ్యాపారాలూ అన్ని హైదరాబాద్ లో చేసుకుంటూ.. టాక్సులు కూడా అక్కడి ప్రభుత్వానికే కడుతూ.. మస్య రాగానే ఏపీ సర్కార్ వద్దకు పరుగులెత్తుకుంటూ వస్తారు.  సమస్య రాగానే ఏపీ, ఏపీ ముఖ్యమంత్రి గుర్తుకు వస్తారు.  . అటువంటి వారి పట్ల ఏపీ ప్రభుత్వం ఎందుకు సానుకూలతతో, సానుభూతితో ఉండాలి? ఎందుకు బాధ్యత తీసుకోవాలి అన్నదే ఇప్పుడు సగటు ఆంధ్రుడి ప్రశ్న. ఏదన్నా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు విరాళాలు ప్రకటించి... మొత్తం ఆంధ్రప్రదేశ్ ను ఆదుకున్నట్లు బిల్డప్ లు ఇవ్వడం తప్ప,  తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకూ ఏపీకి నయాపైసా ప్రయోజనం ఏముందని సగటు ఆంధ్రుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.   ఇలాంటి పరిస్థితుల్లో.. ఇప్పుడు సినీ పరిశ్రమలో తలెత్తిన సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకునే విషయంలో  ఏపీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాలి.    , సినీ పరిశ్రమ ఏపీకి  వచ్చే విధంగా,  ఏపీలో స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు నెలకొల్పే విధంగా షరతు విధించాలి. అలా కాకుండా పన్నులు కట్టేది తెలంగాణలో.. సమస్యలు పరిష్కారం అయ్యేది ఆంధ్రప్రదేశ్ లో అన్నట్లుగా వ్యవహరిస్తామంటే మాత్రం పరిశ్రమ సమస్యల విషయంలో ఏపీ ప్రభుత్వం  జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

By
en-us Political News

  
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.