తెలంగాణలో టార్గెట్ రాజకీయాలు

Publish Date:Jul 11, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్ధ ప్రధాని అంటూ నేరుగా మోడీని టార్గెట్ చేస్తున్నారు. బీజేపీయేమో నియంత, అవినీతి, కుటుంబ పాలన అంటూ కేసీఆర్ ను టార్గెట్ చేస్తోంది. ఇక కాంగ్రెస్ కేసీఆర్ నూ, కేంద్రంలో బీజేపీ పాలననూ ఏక కాలంలో టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. దీంతో తెలంగాణలో రాజకీయ వేడి అంతకంతకూ పెరిగిపోతోంది.

రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడినా రాజకీయ ఉష్ణోగ్రతలు మాత్రం రోహిణీకార్తెను మించి పోతున్నాయి. ఏప్రిల్ లో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలతో మొదలైన ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల.. మేలో వరంగల్ లో జరిగిన రాహుల్ బహిరంగ సభతో మరింత పెరిగి.. తాజగా గత వారం హైదరాబాద్ వేదికగా జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాలతో తార స్థాయికి చేరుకున్నాయి. ఆ తరువాత కూడా రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోందే కానీ తగ్గే పరిస్థితే కనిపించడం లేదు. సభలు, సమావేశాలు,మీడియా సమావేశాల ద్వారా ప్రధాన రాజకీయ పార్టీలు మూడూ తమతమ బలప్రదర్శనలకు దిగుతుండటంతో రాజకీయ వేడి పరిమితుల్లేకుండా పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

గతానికి భిన్నంగా ఇప్పుడు తెలంగాణలో ‘టార్గెట్’ రాజకీయాలు జోరుమీద ఉన్నాయి.  టిఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల్లో దాదాపు 13 తీర్మానాలు చేసింది. వరంగల్ లో జరిగిన సభలో రాహుల్ గాంధీ తెలంగాణకు ఓ డిక్లరేషన్ ఇచ్చారు. బిజెపి సంకల్ప సభలో తెలంగాణ అభివృద్దికి కేంద్రం అందిస్తున్న సహాకారం, చేస్తున్న అభివృద్దిని వెల్లడించింది. ఇలా తెలంగాణ ప్రజల దృష్టిని తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలను మూడు ప్రధాన పార్టీలూ శక్తి వంచన లేకుండా చేశాయి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ తెలంగాణలో మరో భారీ బహిరంగ సభకు రెడీ అవుతున్నారు.

ఏప్రిల్ లో జరిగిన టిఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో కేంద్రంపై,  బిజెపి పాలనపై సిఎం కెసిఆర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అనంతరం వరంగల్ సభలో టిఆర్ఎస్ పై, సిఎం కెసిఆర్ పై రాహుల్ గాంధీ విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఆ తరువాత బిజెపి విజయ సంకల్ప సభలో తెలంగాణ ప్రభుత్వంపైనా, సిఎం కెసిఆర్ పైనా పలు రాజకీయ అస్త్రాలను సంధించారు. మోడీ మాత్రం తన ప్రసంగంలో తెలంగాణకు కేంద్రం అందించిన సహాయాన్ని ప్రస్తావించడానికే పరిమితమై వ్యూహాత్వకంగా వ్యవహరించారు.

ప్లీనరీ అనంతరం  మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సూటిగా సిఎం కెసిఆర్ ను టార్గెట్ చేస్తూ ఆయనపైనే పోటీ చేసి ఓడిస్తానని సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటనపై రాజకీయ చర్చోపచర్చలు సద్దుమణగక ముందే.. సిఎం కెసిఆర్ ఆదివారం మీడియా  సమావేశంలో   నేరుగా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ  అసమ్మర్థ పాలన అంటూ దుయ్యబట్టారు. ఇలా ఒకరి పార్టీ తరువాత మరో పార్టీ రాష్ట్రంలో రాజకీయ ఉష్ణోగ్రతలను పెంచేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

 తేదీ చెప్పండి అసెంబ్లీ రద్దుకు రెడీ అంటూ సీఎం సిఎం కెసిఆర్ బంతిని బీజేపీ కోర్టులో పడేయడంతో రాష్ట్రంలో గతంలో కంటే ఎక్కువగా  ముందస్తు ఎన్నికలు  చర్చ జోరందుకుంది. కేసీఆర్  పార్టీ సవాల్ ను బీజేపీ స్వీకరించి సై అంటూ కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అలా కాకుండా తానే ముందుగా ముందస్తు నగారా మోగిస్తే.. అసెంబ్లీ రద్దు వరకూ మౌనంగా ఉండి ఆ  తరువాత ముందస్తుకు కాకుండా బీజేపీ రాష్ట్రపతి పాలనకు మార్గంసుగమం చేస్తుందన్న అనుమానం  కేసీఆర్ దిఅని పరిశీలకులు చెబుతున్నారు. ముందస్తు వచ్చినా, రాకున్నా.. ప్రస్తుత రాజకీయ వేడి ఎన్నికల వరకూ కొనసాగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చే నెలలో మంత్రి కేటీఆర్ ఇలాకాలో రాహుల్ గాంధీ బహిరంగ సభ అనంతరం  రాజకీయ వేడి, విమర్శల దాడి మరింత పెచ్చరిల్లే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.