హోం మంత్రా..? హోం మేకరా..? ఓనమాలు తెలియని హోంమంత్రి వనిత

Publish Date:May 4, 2022

Advertisement

‘కోతికి కొబ్బరికాయ ఇస్తే.. నెత్తిపై కొట్టుకుందట’ ఇది పాత నానుడి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి తానేటి వనిత తీరు అందుకు భిన్నంగా లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో మహిళలపై రోజురోజుకూ లైంగికదాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో హోంమంత్రిగా తాను నిర్వర్తించాల్సిన పని సక్రమంగా చేయడం లేదు సరికదా.. ఏదో ఇంట్లో కూర్చుని యధాలాపంగా మాట్లాడేసినట్లు ఆమె మాట్లాడుతుండడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఓనమాలు తెలియని వ్యక్తికి హోం శాఖ ఇస్తే ఇలాగే ఉంటుందని ప్రత్యర్థి పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

మహిళలపై లైంగికదాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో హోంమంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన తానేటి వనిత చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లోను, రాష్ట్ర ప్రజల్లోను, సోషల్ మీడియాలోనూ విమర్శల జడివాన కురుస్తోంది. విశాఖపట్నంలోని దిశ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సందర్భంగా హోంమంత్రి వనిత చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేశాయి. ఆపైన అందరికీ ఆగ్రహం తెప్పించాయి. ‘బిడ్డల సంరక్షణ బాధ్యత తల్లిదే. తల్లి పాత్ర సరిగా లేనప్పుడే అత్యాచారాలు లాంటివి జరుగుతుంటాయని ఆమె యధాలాపంగా.. ఇంట్లో మాట్లాడుకున్నట్లు అనేయడం అందరికీ ఆశ్చర్యం కలిగింది. పైగా తండ్రి పనిమీద బయటకు వెళ్లినప్పుడు బిడ్డల సంరక్షణ బాధ్యత తల్లి చూసుకుంటుందని, ఆమె కూడా ఉద్యోగం కోసమో, ఏదైనా పని కోసమో బయటకు వెళ్లినప్పుడు పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడే అఘాయిత్యాలు జరుగుతున్నాయని వనిత వ్యాఖ్యానించారు.

ఒక పక్కన ఏపీలో తరచూ మహిళలపై దాడుల సంఘటనలు వెలుగు చూస్తున్న వేళ ఆ తప్పంతా టీడీపీదే అనే ధోరణిలో హోంమంత్రి వనిత మాట్లాడడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. హత్యలు, అత్యాచార ఘటనల నిందితుల్లో టీడీపీ వారే ఎక్కువ ఉంటున్నారని ఆమె ఆరోపించడం గమనార్హం. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా సరైన దిశలో చర్యలు తీసుకోవడం హోం మంత్రిగా తానేటి వనిత బాధ్యత. అయితే.. ఏదో యధాలాపంగా టీడీపీ వాళ్లే నిందితులంటూ ఓ పనికిమాలిన వ్యాఖ్య చేసేసి చేతులు దులుపుకోవడం ఏంటనే ప్రశ్న వేస్తున్నారు. చేతిలో పోలీస్ పవర్ ఉంది.. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తన మీదే ఉంది. అయినా.. ఆ దిశగా ఆమె తీసుకుంటున్న చర్యలేమిటో ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు. టీడీపీ నేతల ప్రమేయంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ రేపల్లె రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన బాధితురాలిని పరామర్శించిన సందర్భంగా హోంమంత్రి వనిత ఈ స్టేట్ మెంట్ ఇవ్వడం ఆమే చేతకానితనానికి నిదర్శనం అంటున్నారు.

తాజాగా హోంమంత్రి తానేటి వనిత గుంటూరులో చేసిన వ్యాఖ్యలు కూడా దుమారాన్నే లేపుతున్నాయి. రేపల్లె ఘటనపై స్పందిస్తూ.. ‘దుండగులు ఆమెపై అత్యాచారం చేసే ఉద్దేశంతో రాలేదు. మద్యం మత్తులో ఉన్న దుండగులు డబ్బుల కోసం బాధితురాలి భర్తపై దాడి చేశారు. ఆ సమయంలో భర్తను రక్షించుకోడానికి బాధితురాలు వెళ్లింది. ఆ సందర్భంగా నిందితులు ఆమెను నెట్టేసే క్రమంలోనే ఆమె అత్యాచారానికి గురైంది’ అనడం హోంమంత్రి తన అసహాయతను బయటపెట్టుకున్నారంటున్నారు. ‘పేదరికం వల్లో, మానసిక పరిస్థితుల వల్లో అప్పటికప్పుడు అనుకోని రీతిలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఆమెపై జరిగిన లైంగిక దాడికి.. పోలీసు సిబ్బంది కొరతకు సంబంధమే లేదు’ అనడం హోంమంత్రి స్థాయికి తగదని పలువులు ఫైరవుతున్నారు.

గతంలో అధ్యాపకురాలిగా పనిచేసిన వనితమ్మ నాలుక ఇలాగేనా మాట్లాడేది..? ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలా చేసేది..? పబ్లిక్ లో మాట్లాడుతున్నామన్న ఇంగితజ్ఞానం ఆమెకు ఉండక్కర్లా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేసేది తక్కువ.. ప్రయోజనం లేని మాటలు ఎక్కువ చందంగా హోంమంత్రి వనిత తీరు ఉందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

By
en-us Political News

  
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.