తమ్మినేని కుమారుడి ముందస్తు బెయిల్ కు హైకోర్టు నో.!

Publish Date:Jul 28, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్,  వైసీపీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం కుటుంబం భూకబ్జా కేసుకు సంబంధించి  ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిలు విషయంలో తీర్పు ఆ కుటుంబానికి పాక్షిక ఊరట మాత్రమే లభించింది.  ఈ కేసులో తమ్మినేని కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగ్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్  పిటిషన్  తోసిపుచ్చిన హైకోర్టు..  తమ్మినేని సీతారాం, ఆయన సతిమణి వాణిశ్రీలకు  ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 

 శ్రీకాకుళానికి చెందిన  కట్టా జయకిశోర్ అనే వ్యక్తికి చెందిన   4 కోట్ల రూపాయల విలువైన  భూమిని కబ్జా చేసేందుకు  ఆ స్థల యజమాని బతికి ఉండగానే..   మరణించినట్లు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారంటూ తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి, కుమారుడిపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో  అరెస్టును తప్పించుకునేందుకు తమ్మినేని సీతారాం కుమారుడితో సహా పరారయ్యారు. పరారీలో ఉండగానే వీరు యాంటిసిపేటరీ బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. 

 ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ వై. లక్ష్మణరావు నేతృత్వంలోని న్యాయస్థానం విచారణ జరిపి.. తమ్మినేని కుమారుడిపై  నమోదైన అభియోగాలు తీవ్రమైనవని  పేర్కొంటూ ముందస్తు బెయిలు నిరాకరించింది. కాగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న   తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిశ్రీ లకు మాత్రం  ముందస్తు బెయిల్ మంజూరుర చేసింది.  అయితే బెయిల్ మంజూరు చేసినప్పటికీ, తమ్మినేని సీతారాం మంగళవారం (జులై 29)  దర్యాప్తు అధికారి ముందు విచారణకు  హాజరుకావాలని ఆదేశించింది. పోలీసు దర్యాప్తునకు  సహకరించాలని, ఒకవేళ విచారణాధికారులకు సహకరించకపోతే మంజూరు చేసిన యాంటిసిపేటరీ బెయిల్‌ను  రద్దు చేస్తామని తీవ్ర హెచ్చరించింది.  ఈ కేసులో    దాఖలైన సాధారణ బెయిల్ పిటిషన్లపై తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల  17కి వాయిదా వేసింది.  

Tammineni Sitaram Land Case, Chiranjeevi Nag Bail Petition, AP High Court Verdict, Srikakulam Land Forgery Case, YSRCP Leaders Land Issue

By
en-us Political News

  
తాజాగా బాధితురాలి మెడపై గొంతు నులిమినట్లు గాయాల ఆనవాళ్లు..!
డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల అయ్యాయి.
రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం మరింత పెరగాలని....అనుకున్న సమయానికి ప్రతి ప్రాజెక్టు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
సోమేశ్ కుమార్‌పై 400 కంటెంప్ట్ కేసులప్పుడు బీఆర్‌ఎస్ మౌనం ఎందుకు..!
స్పందించని నాడీ వ్యవస్థ.. ఆరోగ్యం విషమం..!
హైదరాబాద్‌లోని గచ్చి బౌలి ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి..!
ఖనిజాల నిధిగా పిలిచే మన నేల పొట్టలో అపారమైన ప్రాకృతిక సంపద దాగి ఉంది.
హైడ్రా కమిషనర్ నియామకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
దేశంలో కరెన్సీ వ్యవస్థను మరింత ఆధునికీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భార్య ప్రాణాలు పోతుంటే వీడియో కాల్‌లో చూపించిన కసాయి భర్త..!
తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించాలని వినతి..!
జింబాబ్వేపై 3-0తో సాధించిన క్లీన్ స్వీప్ భారత క్రికెట్ అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ లాంటి డెబ్యూటెంట్లలో కాన్ఫిడెన్స్ నింపి, వారి నుంచి అద్భుత ప్రదర్శన రాబట్టిన వెరీ వెరీ స్పెషల్ వీవీవీఎస్ లక్ష్మణ్ ప్రశాంతత, విజన్ క్రికెట్ అభిమానుల మనస్సులను హత్తుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.