Publish Date:May 27, 2026
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం (మే 27) హస్తినలో పర్యటించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత విజయ్ ఢిల్లీ వెళ్లడం ఇదే మొదటి సారి. విజయ్ హస్తిన పర్యటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అవుతాయి. విజయ్ ఢిల్లీ పర్యటేన కేవలం ఒక మర్యాదపూర్వకంగా మాత్రమే కాకుండా, తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా సాగనుందని సమాచారం
ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చిం చే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలపై నిర్మలాసీతారామన్ తో సీఎం విజయ్ చర్చించే అవకాశం ఉంది. బుధవారం ( మే 28) ఉదయమే చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న విజయ్.. వరుస భేటీలతో బిజీబిజీగా ఉన్నారు. ఇదే రోజు రాత్రి ఆయన తిరిగి చెన్నై చేరుకుంటారు. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పెద్దలతో జరుపుతున్న తొలి అధికారిక భేటీ కావడంతో, తమిళనాడు ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర హక్కుల సాధనలో విజయ్ ఎలాంటి ముద్ర వేయబోతున్నారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tamilnadu-cm-vijay-delhitour-39-220979.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!