తమిళిసై.. ఇది మీకు తగునా..!

Publish Date:Nov 7, 2022

Advertisement

పక్కింటివాళ్లతో గొడవలు పడగూడదు. అందునా, వారితో ఇంకా సంబంధం ఉన్పప్పుడు. మా ఇంటావిడ మహా చిరాకు మనిషి అంటూ అద్దకి ఉన్న ఇల్లాలు గోడ కబుర్లలో పక్కింటావిడకి మాట చేరవేయ కూడదు. ఇక్కడే ఉంటూ ఇక్కడి భాషని, మనుషులను ఇష్టం లేనట్టుగా వ్యాఖ్యానించి తెలంగాణా గవర్నర్ తమిళిసై లేని తలనొప్పిని చుట్టుకున్నారు. తమిళనాడు వెళ్లి తమిళుల పత్రికలో వచ్చిన వ్యాసానికి హెచ్చరికలు చేయడంలో తప్పు లేదు. కానీ  తెలుగు రాష్ట్రానికి గవర్న్ గా ఉంటూ తెలుగు వారిని తక్కువచేసి మాట్లాడటమే అసలు గొడవ. తమిళులయినంత మాత్రాన తెలుగువారిని అవ హేళన చేయడమో, అవమానించడమో, కించపరచడాన్నో తెలుగువారు ఎలా భరిస్తారు. 

ఎవరికి వారి ప్రాంతాలు, భాష ఇష్టం. రాజకీయపరంగా ఆలోచించినా వేరు రాష్ట్రాల్లో పనిచేసేవారు ఆయా ప్రాంతాల భాష, మనుషులను గౌరవించి ఎంతో కొంత కొత్త అంశాన్ని తెలుసుకుంటారు. కానీ అంటీ అంటనట్టుగా వ్యవహరించే గవర్నర్ గా తమిళిసై నే రాజీకీయ విమర్శకులు పేర్కొన్నారు. కారణం ఆమె పూర్తిగా తమిళనాడు మనిషినని, కేవలం గవర్నర్ గిరీ లో తెలుగు రాష్ట్రంలో ఉండవలసి వస్తోందన్న ధోరణనినే ప్రదర్శిస్తున్నారు. దీనికి తోడు బీజేపీ మనిషి అన్న ముద్ర ఉండనే ఉంది.  తెలుగువారు శాంతస్వభావులు గొడవలకు దిగే మనస్తత్వం లేనివారు గనుక పెనుప్రమాదమేమీ ముంచుకురాదు. కానీ అదే తమిళులను ఆమె అవమానించి ఉంటే పరిస్థితులు వేరేగా  ఉండే వేమో. అయినా అందరినీ సమానంగా చూడాల్సిన ఉన్నత పదవిలో ఉన్నవారు తక్కవు స్థాయిలో వ్యవహరించడం, ఇతర భాషను కించపరచడమేమిటి? కేవలం తెలుగు మీద అయిష్టతనే తమిళిసై తీరు ప్రదర్శిస్తుంది. తమిళనాడు లో ఉంటున్న,అనాదిగా అక్కడ ఉంటున్న తెలుగు వారెవరూ తమిళులను, తమిళ భాషను అగౌరవంగా చూసిన దాఖలాలు లేవు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉండే తమిళులు తెలుగు పట్ల తెలుగువారి పట్ల అంటీఅంటనట్టుగా నే ఉంటున్నారు. తమిళనాడు ఒక గ్రామంలో ఒక తెలుగు బడిని మూసివేయాలని అక్కడి తమిళులు పట్టబట్టడం గమనార్హం. ఈ ధోరణిని ఉన్నతపదవుల్లో ఉన్నవారు కూడా ప్రదర్శిం చడమే ఊహించని అంశం. 

తమిళనాడులు తమిళులుగా నటించేవారున్నారని, వారు వాస్తవానికి తమిళులు కాకున్నా బయట ఎక్కువగా తమిళం మాట్లాడుతూ, ఇంట్లో తెలుగు మాట్లాడుతూ కాలం గడిపేస్తుంటారన్న అభిప్రాయం తమిళిసై వ్యక్తం చేయడంలో ఆంతర్యమేమిటి అన్నది విశ్లేషకులు అడుగుతున్నారు. ఆమె తమిళురాలే కావచ్చు, కానీ ఒక ఉన్నత హోదాలో ఉన్నపుడు పనిచేస్తున్న ప్రాంతీయ భాషను, ప్రాంతీయులను కూడా అంతే స్థాయిలో చూడాలి, గౌరవిం చాలి. కానీ తెలంగాణ గవర్నర్ గా వచ్చినప్పటి నుంచి ప్రభుత్వంతో విభేదాలతోనే కాలం గడుస్తోంది.  ముఖ్యమంత్రి చేసే అన్ని సిఫార్సులను గవర్నర్ ఆమో దించాలని లేదని ఆమె గతంలో అన్నారు. రాజ్యాంగ పరిధి కి లోబడే గవర్నర్ విధులు ఉంటాయని, దేన్నయినా విభేదిస్తే ప్రభుత్వం వివాదం చేయడం సరికాదన్నారు. పైగా అన్నింటినీ వ్యక్తి గత వ్యవహారాలకు ఆపాదించరాదనీ తమిళిసై అన్నారు. గవర్నర్ ను ఒక పార్టీకి కట్టుబడి ఉన్నారంటూ ఆఫాదించడం సమంజసం కాదని, ప్రత్యేక ఆహ్వానాలు తిరస్కరించడం అవమానించడమే అవుతుం దని  తమిళిసై తెలం గాణా సర్కార్ తీరుపై వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, ఆమెకు అసలు తెలుగువారి మీదనే పెద్దగా గౌరవం లేదన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. 

డీఎంకే నేతలంతా వారి పూర్వీకులు తెలుగువారన్న విషయాన్ని మరుగునపరచి తమిళ భాషాభిమానుల వేషంతో ప్రజలను మోసం చేస్తున్నారని, తాను తెలంగాణా గవర్నర్‌గా అక్కడి శాసనసభలో తిరుక్కురళ్‌ను తమిళంలో పఠించి అసలు సిసలైన తమిళ ఆడపడుచుగా వ్యవహరిస్తున్నానని అన్నారు. ఎక్కడుంటే అక్కడి సంప్రదాయా లను, ఎంతో కొంత ఆ భాషాభిమానాన్ని ప్రదర్శించడంలో తప్పు లేదు. కానీ అది తమిళిసై దృష్టిలో నటన  అయి పోయింది. అనాదిగా తమిళనాడులో ఉంటున్న తెలుగు వారు తాము క్రమేపీ తమిళులమే అంటున్నారు. పైగా ఇప్పటి తరం వారు తమిళులమనే అంటున్నారు. వారితో కలిసిపోయారు. తాము తెలుగు వారమన్న ఆలోచనే మర్చిపోయారు. అలాంటి వారి మధ్య విభేదాలు సృష్టించేలా గవర్నర్ కామెంట్ చేయడం దారుణం. తెలుగువారిని తక్కువ చేయడమే అవుతుందని విశ్లేషకుల మాట. 

మనసులో తెలుగు పట్ల, తెలుగువారి పట్ల ఏమాత్రం గౌరవం లేనివిధంగా వ్యవహరిస్తున్నవారే తెలుగు పట్ల వీరాభిమానం ఉన్నట్టు నటించడం జరుగుతోంది. తనకు తెలుగు పట్ల, సంప్రదాయాలు, పండుగల పట్ల ఎంతో గౌరవం ఉందని, తనకూ ఎంతో తెలుసునని తెలంగాణా గవర్నర్ గతంలో అన్నారు. కానీ రాజకీయాల దృష్టితోనే చూడడం తో ఆమె అభిప్రాయాల్లోనూ రాజకీయ కోణమే కనపడుతోంది. ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రం అనగానే తెలుగువారితో కలిసిన తమిళులు జీవిస్తున్న సమైక్య మద్రాసు రాష్ట్రమే. కానీ కాలక్రమంలో భాషాప్రాంతాలుగా విడిపోయిన సమ యంలో ఆంధ్రప్రదేశ్ అవతరించి ప్రత్యేకతలు చాటుతోంది. కానీ గవర్నర్ గిరీలో వచ్చినవారెవ్వరూ సమైక్యఆంధ్రా గాని, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తెలంగాణా ప్రాంతాన్నిగాని తక్కువగా చూడలేదు. తమిళిసై గవర్నర్ గా వచ్చిన క్షణం నుంచే తెలం గాణా ప్రభుత్వంతో విభేదాలు చోటుచేసుకున్నాయి. ఆమె గవర్నర్గా కంటే బీజేపీ మనిషిలా వ్యవహ రిస్తోందన్న ఆరోపణలే ఎక్కువగా వినపడ్డాయి. కేంద్రం మాట మాత్రమే శిరోధార్యం అంటూనే ఇక్కడి ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా లేకపోవడం పరిస్థితులు మరింత విభేదాలకు దారితీయడం అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. భాష కంటే రాజకీయ కోణంలోనే ఆమె వ్యవహార శైలి వ్యాఖ్యానిస్తోందని అంద రూ గుర్తించారు. 

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.