మళ్లీ బిజెపిలో చేరిన తమిళ సై 

Publish Date:Mar 20, 2024

Advertisement

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ బుధవారం బీజేపీలో చేరారు. ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలై సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. తమిళిసై అంతకుముందు బీజేపీ నాయకురాలు. ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. ఆ తర్వాత 2019లో తెలంగాణ గవర్నర్‌గా వచ్చారు. అయితే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు ఆమె తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.

గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత తిరిగి బీజేపీలో చేరడంపై వామపక్ష పార్టీలు, డీఎంకే విమర్శలు గుప్పించాయి. వారి విమర్శలకు అన్నామలై గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉన్నత పదవులలో ఉండి... పదవీ విరమణ తర్వాత సాధారణ పౌరుడిలా ప్రజాసేవలో తరించడం కేవలం బీజేపీలో మాత్రమే సాధ్యమని చురక అంటించారు. ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నత పదవులు అస్సలు వదులుకోరని... ఎందుకంటే వారికి రాజకీయాలు అంటే కేవలం ఉన్నత పదవులు మాత్రమేనని విమర్శించారు. కానీ బీజేపీలో మాత్రం ప్రజాసేవ అన్నారు.

తమిళిసై సౌందర్యరాజన్ గవర్నర్‌గా బాగా పని చేశారని... ఆ పదవికి రాజీనామా చేసి తిరిగి రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకోవడం ఆమెకు ప్రజల మీద ఉన్న ప్రేమను తెలియజేస్తోందన్నారు. అదే సమయంలో ఆమె మళ్లీ బీజేపీలో చేరడం ద్వారా పార్టీ పట్ల ఆమె నిబద్ధతను తెలియజేస్తోందన్నారు. మోదీ మూడోసారి ప్రధానిగా అయ్యేందుకు దోహదపడాలని ఆమె భావిస్తున్నారన్నారు.

రాజకీయ కుటుంబంలో  పుట్టి పెరిగిన సౌందర్యరాజన్‌కు బాల్యం నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉంది.  ఆమె మద్రాసు మెడికల్ కాలేజీలో చదువుతున్న సమయంలో విద్యార్థి నాయకురాలిగా ఎన్నికయ్యారు . ఆమె తమిళనాడు రాష్ట్ర బిజెపి రాష్ట్ర శాఖకు  సేవలందించారు. 2019న తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2019 సెప్టెంబర్ 9న తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ గవర్నర్ నరసింహాన్ తర్వాత సౌందర్య రాజన్  బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో తీవ్ర అవమానాలకు గురయ్యారు. కెసీఆర్ ప్రభుత్వానికి  తమిళసైకి మధ్య ఒక దశలో విభేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి.  
సౌందర్యరాజన్ ఇప్పటి వరకు ఎంపీ లేదా ఎమ్మెల్యే కావడానికి చేసిన అన్ని ప్రయత్నాలలో ఓడిపోయారు , రెండు అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంటు ఎన్నికలలో విఫలమయ్యారు. 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో తూత్తుక్కుడి నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కుమార్తె కనిమొళి కరుణానిధిపై ఆమె ఓడిపోయారు . తాజాగా సౌందర్య రాజన్ మళ్లీ బిజెపిలో చేరి వార్తలలోకెక్కారు. 

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.