Publish Date:Mar 20, 2024
తెలంగాణలో మొత్తం 17 స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది. ఇప్పటికే 12 స్థానాలు కన్ఫర్మ్ అయ్యాయి. మరో ఐదు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఐదు స్థానాలకు విపరీత పోటీ కాంగ్రెస్ పార్టీలో ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మల్కాజ్ గిరి కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తనకు మల్కాజ్‌గిరి లేదా భువనగిరి టిక్కెట్ ఇచ్చిన పర్వాలేదని... ఆ సమయంలో అవసరమైతే అల్లు అర్జున్ తనకు మద్దతుగా ప్రచారం చేస్తారని స్టైలిష్ స్టార్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయనతో ఒక ఛానల్ మీడియా ప్రతినిధి ముఖాముఖి నిర్వహించారు. అల్లు అర్జున్ మీకు మద్దతుగా ప్రచారం చేస్తారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.
దానికి చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ... ఈ రోజు ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, అదే సమయంలో అల్లు అర్జున్ సహా తన కుటుంబం తనకు మద్దతుగా ఉంటుందన్నారు. ప్రజలే కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారన్నారు. ఆ సమయంలో (టిక్కెట్ ఇచ్చాక) పరిస్థితిని బట్టి అల్లు అర్జున్ ప్రచారానికి వచ్చే అవకాశముంటుందన్నారు. అయినప్పటికీ ఈ రోజు ఎవరు వచ్చినా... ఎవరు రాకపోయినా ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు.
మెగా ఫ్యామిలీ ఇంతకుముందు రాజకీయాల్లో ఉందని, పవన్ కల్యాణ్ పార్టీని నడిపిస్తున్నారని, కాబట్టి తాము కలిసినప్పుడు రాజకీయాలపై చర్చ సాగుతుందన్నారు. రాజకీయాలు అందరికీ అవసరమే అన్నారు. రేవంత్ రెడ్డి పాలనపై సినిమా పరిశ్రమ కూడా ప్రశంసలు కురిపిస్తోందన్నారు.
భువనగిరి ఇచ్చినా పోటీ చేస్తాను
తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సమయంలో మల్కాజ్‌గిరి టిక్కెట్ ఇస్తామని పార్టీ పెద్దలు చెప్పారని, అందుకే అక్కడ కొన్నిరోజులుగా పలు కార్యక్రమాలు చేపట్టానన్నారు. ఒకవేళ భువనగిరి ఇచ్చినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మల్కాజ్‌గిరి... భువనగిరిలో ఏ టిక్కెట్ ఇచ్చినా పోటీ చేస్తానని చెప్పారు. తనకు భువనగిరి టిక్కెట్ ఇస్తే కోమటిరెడ్డి సోదరుల సహకారం తనకు ఉంటుందన్నారు.
మల్కాజ్‌గిరి టిక్కెట్ సునీతా మహేందర్ రెడ్డికి వస్తుందనే ప్రచారం జరగడంతో తాను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిలను కలిశానన్నారు. అందుకే భువనగిరి టిక్కెట్ తనకు ఇస్తే కోమటిరెడ్డి సోదరులతో పాటు ఇతర ఎమ్మెల్యేల సహకారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనకు రెండింట్లో ఏ నియోజకవర్గాన్ని కేటాయించినా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-allu-arjun-uncle-chandra-shekhara-reddy-from-bhuvanagiri-25-172429.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.