తమిళనాట మళ్లీ జయలలిత!

Publish Date:Mar 2, 2016

Advertisement

 

తమిళనాడులో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల తేదీలు ప్రకటించడమే ఆలస్యం, హామీలతో మోత మోగించేందుకు పార్టీలన్నీ సిద్ధంగా ఉన్నాయి. తమిళ ప్రజలు చాలా ఉదారులు! డి.ఎం.కె, అన్నా డి.ఎం.కె... ఈ రెండు పార్టీలకీ వాళ్లు సరిసమానంగా అవకాశాలు ఇస్తూ ఉంటారు. అందుకే ఒక దఫా డి.ఎం.కె అధికారంలో ఉంటే, మరో దఫా అన్నా డి.ఎం.కె చెన్నై పీఠాన్ని చేజిక్కించుకుంటుంది. ఐదేళ్లపాటు ఓ పార్టీని నెత్తినెక్కించుకున్న ఓటర్లు, మళ్లీ ఎన్నికలు రాగానే అదే పార్టీని నేలకేసి కొడుతూ ఉంటారు. కానీ పరిస్థితులు చూస్తుంటే ఈసారి ఆ సంప్రదాయం మారేట్లు కనిపిస్తోంది.

 

డి.ఎం.కే కురువృద్ధుడు కరుణానిధికి ఇప్పుడు 91 సంవత్సరాలు. గత పదేళ్లుగా ఆయన కుర్చీకే అంకితమై ఉన్నారు. చెప్పుకోవడానికి నలుగురు కొడుకులు ఉన్నా వారిలో స్టాలిన్‌, అళగిరులకు తప్ప మిగతావారికి అంతగా రాజకీయ చతురత లేదు. మధురైలో తిరుగులేని నేతగా ఉన్న అళగిరి దాతృత్వానికంటే, దాష్టీకానికే ఎక్కువ ప్రసిద్ధి. అందుకే కరుణానిధి అళగిరికంటే చిన్నవాడైన స్టాలిన్‌కే అధిక ప్రాధాన్యతని ఇచ్చేవారు. గత ప్రభుత్వ హయాంలో స్టాలిన్‌ను ఉపముఖ్యమంత్రిగా కూడా నియమించారు. ఇక కరుణానిధి వారసుడు స్టాలినే అంటూ వార్తలు గుప్పుమనడంతో, అళగిరి తనదైన శైలిలో ఆందోళనలను నిర్వహించారు. దాంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి కరుణానిధి మళ్లీ ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరించే పరిస్థితుల్లో లేరు కాబట్టి, డిఎంకే తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్టాలిన్‌ను ప్రజలు ఏమాత్రం అంగీకరిస్తారన్నది చూడాలి.

 

మరోపక్క 2011 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకేకు తోడుగా ఉండి, ఆ తరువాత విడాకులు పుచ్చుకున్న విజయ్‌కాంత్‌ పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదు. 2005లో డిఎండీకే పేరుతో పార్టీని ప్రజలు తనని ఆదరించేందుకు ఓపికగా ఎదురుచూసిన విజయ్‌కాంత్‌, తరువాతి కాలంలో తన అసహనాన్ని కూడా జనానికి రుచి చూపించడం మొదలుపెట్టారు. మీడియా మీదా, కార్యకర్తల మీదా, ఆఖరికి పార్టీ సహచరుల మీదా విజయ్‌కాంత్ తరచూ నోరు పారేసుకుంటూ ఉంటారని ఓ అపవాదు. మైకంలో వింతగా ప్రవర్తిస్తున్నట్లు కనిపించే ఆయన వీడియోలు కూడా యూట్యూబ్లో హల్‌చల్‌ చేస్తూ ఉంటాయి. కారణమేదైతేనేం, 2011 ఎన్నికలలో 29 మంది ఎమ్మెల్యేలను సాధించిన ఆ పార్టీ నుంచి ఏకంగా ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో, డిఎండికెకు ఒక్కసారిగా గాలితీసినట్లు అయిపోయింది.

 

ఇక మిగిలిందల్లా అన్నాడిఎంకె! 2011లో ల్యాప్‌టాప్‌లు మొదలుకొని మిక్సీల దాకా ఉచితంగా అందిస్తామని హామీలు గుప్పిస్తూ అధికారంలోకి వచ్చిన అమ్మ, ఎలాగొలా ఈ ఐదేళ్లు లాగించేసిందన్న వాదన వినిపిస్తోంది. పార్టీ సహచరులు ఆమె పట్ల చూపించే వీర విధేయతా, వరదల్లో అందించే ఆహారపొట్లాల మీద సైతం అమ్మ బొమ్మని ముద్రించే వీరభక్తిని చూసి సోషల్ మీడియాలో జనం తెగ నవ్వుకున్నా... తమిళనాట ఇప్పటికీ తిరుగులేని మహిళానేత జయలలితేనన్నది వాస్తవం.

 

పైగా ప్రస్తుత పార్లమెంటు సమావేశాలని గమనిస్తుంటే, ఎన్నికల నేపథ్యంలో అన్నాడిఎంకే చాలా తెలివిగా పావులు కదుపుతున్న విషయం అర్థమవుతుంది. 2011 ఎన్నికలలో డిఎంకె ఘోర పరాజయం కావడానికి ఒకానొక కారణమైన 2G స్కాంను తిరిగి అన్నాడిఎంకె లేవనెత్తుతోంది. కరుణానిధి ముద్దుల కుమార్తె కనిమొళి రాజకీయ జీవితానికి ఇంచుమించు ఫుల్‌స్టాప్‌ పెట్టిన ఆ కుంభకోణాన్ని ఇప్పుడు మళ్లీ తవ్వుతోంది. కాకపోతే ఈసారి చిదంబరం పాత్రని కూడా ఇందులో రుజువు చేసేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా డిఎంకేను, రానున్న ఎన్నికలలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోనున్న కాంగ్రెస్‌నూ ఒకేసారి ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు జయలలితను ఉక్కిరిబిక్కిరి చేసిన అక్రమార్జన కేసులు కూడా ప్రస్తుతం నిద్రాణంగా ఉన్నాయి. కాబట్టి ఎటు చూసిన జయ విజయానికి శుభసంకేతాలే కనిపిస్తున్నాయి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.