ఢిల్లీ వీధుల్లో తమిళ రైతు… జయలలిత బతికుంటే ఇలా జరిగేదా?

Publish Date:Apr 13, 2017

Advertisement

రాజు లేని రాజ్యం అరాచకానికి నెలవు. ఈ విషయం ఇప్పుడు మాట్లాడుకుంటోన్నది కాదు. రామాయణ కాలంలో కూడా దశరథుడు మరణిస్తే… రాముడు అరణ్యంలో వుంటే… భరతుడికి పెద్దలు అదే మాట చెబుతారు. రాజు లేని రాజ్యం అతలాకుతలం అవుతుందని! అయితే, కేవలం రాజుంటే సరిపోదు. సమర్థుడైన రాజు కూడా వుండాలి. ఇప్పుడు అదే విషయం నిరూపిస్తోంది తమిళనాడు!

 

తమిళనాడులో జయ అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరితే బోలెడు హడావిడి జరిగింది. తరువాత ఆమె మరణం కూడా బ్రేకింగ్ న్యూస్ ల పరంపరకు దారి తీసింది. ఇక ఆ తరవాత శశికళ వ్యవహారం, ఆమె సీఎం అవ్వలేకపోవటం, జైలుకెళ్లటం … ఇవన్నీ అయితే నానా గందరగోళానికి దారి తీశాయి. దేశం మొత్తం అదే చర్చ జరిగింది! కాని, విచిత్రంగా ఇప్పుడు అదే తమిళనాడుకు సంబంధించిన నిజమైన సమస్య ఎక్కడా చర్చకు రావటం లేదు. వచ్చిన మీడియాలో బ్రేకింగ్ న్యూస్ ల స్థాయికి రావటం లేదు. అక్కడా, ఇక్కడా అప్పుడూ ఇప్పుడు మాత్రమే కథనాలు వస్తున్నాయి! ఢిల్లీ వీధుల్లో తమిళ రైతులు అంటున్నారే తప్ప… జయలలిత, శశికళ గురించి ఊదరగొట్టినంతగా ఎవరూ మాట్లాడటం లేదు!

 

అసలు తమిళ రైతులకి ఏమైంది? వారు ఢిల్లీలో ఎందుకు నిరసనలకి దిగారు? ఈ ప్రశ్నలకి సమాధానం చాలా మందికి క్లియర్ గా తెలియదు. వారు రుణామాఫీ కోసం రోడ్డెక్కలేదు. వారి డిమాండ్లలో అది కూడా ఒకటైనా అసలు సమస్య కరువు! గత శతాబ్ద కాలంలో ఎప్పుడూ లేని వికృతమైన కరువు ఈసారి తమిళనాడుని తాకింది. జయ బ్రతికి వుండగానే తుఫాన్ వచ్చి చెన్నై మునిగినా… చాలా ప్రాంతాలు మాత్రం కరువుకి చిక్కాయి. పంటలు పండలేదు. రైతులు నిండా మునిగిపోయారు. బ్యాంక్ లకు ఋణాలు చెల్లించలేక విలవిలలాడుతున్నారు! అందుకే, ఢిల్లీ వీధుల్లో కేంద్రాన్ని నిలదీస్తున్నారు!

 

తమిళనాడు రైతులు రాజధానికి వచ్చి నగ్నంగా కూడా నిరసనలు తెలుపుతుంటే మోదీ సర్కార్ పట్టించుకోకపోవటం నిజంగా విషాదమే! ఒకవైపు ఉత్తర్ ప్రదేశ్ కి భారీ రైతు ఋణమాఫీ ప్రకటించి ఇంకో వైపు తమిళ రైతుల్ని మాత్రం ఎర్రటి ఎండకి నిర్ధాక్షిణ్యంగా వదిలేయటం దుర్మార్గం. కాని, ప్రాక్టికల్ గా మాట్లాడుకున్నప్పుడు కేంద్రం తప్పుతో పాటూ మనం తమిళనాడు రాష్ట్రంలో జరుగుతోన్నది కూడా చర్చించాలి! జయలలిత మరణం తరువాత అక్కడ స్థిరమైన ప్రభుత్వమే లేదు. పన్నీర్ సెల్వం నుంచి పళని స్వామీ దాకా జరిగిన పరిణామాల్లో నానా రచ్చ జరిగిపోయింది. ఈ క్రమంలో రైతుల్ని పట్టించుకున్న నాథుడే లేడు చెన్నైలో! అదే ఢిల్లీ చేరిన తమిళ రైతుల పాలిట శాపంగా మారింది!

 

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో కోట్లు పంచి పెట్టి చిన్నమ్మ మేనల్లుడు దినకరన్ని గెలిపించుకునే పనిలో వున్న సీఎం బక్కచిక్కిన రైతుల్ని పట్టించుకునే ఉద్దేశ్యంలో లేడు! అసలు ఆయన వారి తరుఫున కేంద్ర ప్రభుత్వంతో ఒక్క మాటన్నా మాట్లాడలేదు ఇప్పటి వరకూ. ఇలాంటి పరిస్థితి జయలలిత బతికి వుంటే మనం ఊహించగలమా? ఇక్కడే అసలు సమస్యంతా వుంది. తమిళనాడుకి సీఎం అయితే వున్నాడు కాని... అతడికి రైతుల్ని పట్టించుకునేంత తీరిక, స్వేచ్ఛా, పెద్ద మనసు… ఏవీ లేవు! అందుకే, తమిళ అన్నదాత ఢిల్లీ వీధుల్లో మలమల మాడిపోతున్నాడు! జయలలిత నిష్క్రమణతో ఏర్పడ్డ ఈ దారుణమైన పరిపాలనా కరువు… తమిళులకి ఎప్పుడు తీరుతుందో ఏమో!

By
en-us Political News

  
ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా గాడిన పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే, కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల పనితీరు ప్రస్తుత రాజకీయాల్లో సరికొత్త స్ఫూర్తిని నింపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.