రాజీనామా చేయకుండా రాద్దాంతమేల?

Publish Date:Jul 22, 2015

Advertisement

 

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా వ్యవహారంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకి ఆయన చాలా ధీటుగానే బదులిచ్చారు. కానీ నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేసానని గొప్పగా చెప్పుకొంటున్న ఆయన వారడిగిన ప్రశ్నకు సూటిగా బదులీయకుండా తనను ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేయడం, అందరి బాగోతాలు బయటపెడతానని బెదిరించడం విస్మయం కలిగిస్తోంది. పైగా ఇటువంటి పొరపాటుని అన్ని రాజకీయపార్టీలు చేస్తున్నాయి కనుక తను చేయడం తప్పు కాదన్నట్లుంది ఆయన వాదన. అటువంటప్పుడు నైతిక విలువల గురించి చెప్పుకోవడం ఎందుకు?

 

స్పీకర్ కి ఇచ్చిన రాజీనామా లేఖను తను జేబులో పెట్టుకొని తిరుగుతున్నానని ఆయన చెపుతున్నారు. కానీ ఒకపక్క తను ఎప్పుడో రాజీనామా చేసానని చెప్పుకొంటూ దానిని 8 నెలలయినా ఆమోదింపజేసుకోనప్పుడు ఇక దానికి అర్ధం ఏముంటుంది? దానిని జేబులో పెట్టుకొని తిరగడం వలన ప్రయోజనం ఏముంటుంది? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నైతిక విలువలకి కట్టుబడి ఉన్నానని తలసాని ప్రకటించుకొన్నప్పుడు, తను ఇతరులకి ఆదర్శంగా ఉండాలి. కానీ అందరూ చేస్తున్న తప్పునే ఆయన చేయాలనుకొంటే ఇక నైతిక విలువల గురించి మాట్లాడటమే అనవసరం.

 

ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ చేతికి ఇచ్చేనని చెపుతుంటే, అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి తమకు ఆయన రాజీనామా చేరలేదని కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డికి లికిత పూర్వకంగా తెలియజేసారు. మరయితే ఆయన రాజీనామా లేఖ ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నట్లు? అని గండ్ర అడుగుతున్న ప్రశ్నకు స్పీకర్ ద్వారా జవాబు చెప్పించగలిగితే బాగుండేది. కానీ అలా చేస్తే అప్పుడు “ఇంతకాలం తలసాని రాజీనామా లేఖను ఎందుకు ఆమోదించలేదు?” అనే ప్రశ్నకు స్పీకర్ సంజాయిషీ చెప్పుకోవలసి వస్తుంది.

 

తను మళ్ళీ ఎమ్మేల్యేగా గెలవగలననే ధీమా ఉన్నందునే తను ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయలేదని తలసాని చెప్పుకొన్నారు. తెదేపా ఎమ్మేల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుని తనతో సనత్ నగర్ నియోజక వర్గం నుండి పోటీ చేసి గెలవమని, ఒకవేళ తను ఓడిపోతే రాజకీయల నుండి తప్పుకొంటానని తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాలు విసిరారు. కానీ అసలు ఇంతవరకు తన రాజీనామానే ఆమోదింపజేసుకోకుండా ఆయన తన ప్రత్యర్ధులకు ఇటువంటి సవాళ్ళు చేయడం అర్ధరహితమనే చెప్పక తప్పదు.

 

ఇక రెండు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన “రెండు రోజులు రాజకీయాలను కాదనుకొంటే...నాలుగు రోజులు ప్రభుత్వం లేదనుకొంటే నేనేమిటో చెపుతాను” అని మాట్లాడటం బాధ్యతారాహిత్యమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ ఆయన ఇవన్నీ మాట్లాడకుండా స్పీకర్ చేత తక్షణమే తన రాజీనామాను ఆమోదింపజేసుకొని ఉంటే ప్రతిపక్షాలకు గట్టి జవాబు చెప్పినట్లు ఉండేది. కానీ ఆ పని చేయకుండా ఈవిధంగా వాదోపవాదాలు చేయడం వలన ఆయనే స్వయంగా ప్రతిపక్షాలకు ఆయుధాలు అందిస్తున్నట్లవుతోంది. దాని వలన ఆయనకి, తెరాస ప్రభుత్వానికి మరింత అప్రదిష్ట కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
ఇటు జగన్ కు, ఆయన పార్టీ వైసీపీకీ, అలాగే అటు కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడం, మద్దతు పలకడం అత్యావశ్యకం. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏకంగా బీజేపీలో కలిసిపోవడం ఖాయం అన్న మాట వినిపిస్తోంది. మిగిలేది టీఆర్ఎస్ ప్రతిరూపంగా తెలంగాణ జాగృతి ఒక్కటేనని గత కొంత కాలంగా ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది.
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది.
పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు. జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది.
ప‌రామార్శ పేర బలప్రదర్శనలకు దిగడం జగన్ కు రివాజుగా మారిపోయిందంటున్నారు. బలప్రదర్శన పేర జరిగే ఈ నాటకాన్ని రక్తికట్టించేందుకు పేర్ని నాని వంటివారు జగన్ కు ఇతోధికంగా సహాయపడుతుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.