Publish Date:Oct 22, 2024
జగన్ హయాంలో అరాచకాలు సృష్టించిన వైసీపీ గూండాలకు, వారికి సహకరించిన ‘వైపీఎస్’ అధికారులకు,అయ్యాఎస్ అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తాము చేసిన తప్పిదాలకు రాజ్యాంగ ఉల్లంఘనలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. అటువంటి అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ నేతల తప్పులకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించి చర్యలు తీసుకునే దిశగా సీఎం చంద్రబాబు పోలీసులను నడిపిస్తున్నారు. ఫలితంగా వైసీపీ జమానాలో అడ్డగోలుగా రెచ్చిపోయి, ఇష్టారీతిగా వ్యవహరించిన వారిలో ఆందోళన, భయం వ్యక్తం అవుతున్నాయి. అలాగే వైసీపీ నేతలకు వంత పాడిన ఐపీఎస్ లు పోస్టింగుకు కూడా నోచుకోకుండా ఎప్పుడేం జరుగుతుందా అన్న భయంతో వణికి పోతున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో అప్పటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి సీఐడీ కార్యాలయంలో చిత్రహింసలకు గురిచేశారు. ఈ వ్యవహారంలో తనను వేధించి, హింసించిన ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్, వ్యూహరచన చేసిన పీఎస్ఆర్ ఆంజనేయులు, అమలు చేసిన అడిషనల్ ఎస్పీ విజయ్‌పాల్‌పై గుంటూరు ఎస్పీకి రఘురామ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ముగ్గురిపై కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులు హత్యాయత్నం సెక్షన్లు పెట్టారు.
అయితే నిందితులు సీనియర్ ఐపీఎ్‌సలు కావడం, అదనపు ఎస్పీ స్థాయిలో పనిచేసిన విజయ్‌పాల్ దర్యాప్తు అధికారికి సహకరించక పోవడంతో కేసు నీరుగారి పోతోందన్న భావన వ్యక్తమైంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించి కేసు దర్యాప్తు బాధ్యతలను ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న దామోదర్‌కు అప్పగించింది. దీంతో విజయ్‌పాల్ నోరు విప్పక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. పాల్ నోరు విప్పితే ఎవరెవరు కుట్ర చేశారు? ఎవరు అమలు చేశారు? తదితర విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tainted-officers-face-consequencies-25-187225.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.