బాలినేనికి మళ్లీ పిలుపు.. ఏం జరుగుతోంది?.. ఏం జరుగుతుంది?

Publish Date:Oct 28, 2023

Advertisement

ఒంగోలు వైసీపి ఎమ్మెల్యే , మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మళ్ళీ తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. శనివారం(అక్టోబర్ 28) ఉదయం వైవీ సుబ్బారెడ్డితో కలిసి వచ్చి తనను కలవవలసిందిగా జగన్మోహన్‌ రెడ్డి ఆదేశించిన్నట్లు చెబుతున్నారు. బాలినేని, సుబ్బారెడ్డి మధ్య విభేదాల పరిష్కారానికే ఈ పిలుపు అని పార్టీ వర్గాలు చెబుతున్నా.. అంతకు మించిన కారణమే ఉందంటున్నారు పరిశీలకులు. బాలినేనికి మంత్రివర్గ విస్తరణ సమయంలో కేబినెట్ నుంచి తొలగించిన నాటి నుంచీ ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతూనే ఉన్నారు. పార్టీలోనే కాకుండా, నియోజకవర్గంలో కూడా తన మాట చెల్లుబాటు కావడం లేదన్న అసంతృప్తిని అవకాశం వచ్చిన  ప్రతి సందర్భంలోనూ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అలా వ్యక్తం చేసిన ప్రతి సారీ తాడేపల్లి  నుంచి పిలుపురావడం.. ఆయన ఇష్టంగానో, అయిష్టంగానో సర్దుకు పోవడం జరుగుతూనే ఉంది.

ఇంతకీ బాలినేని తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినా, పార్టీకి నష్టం కలిగే వ్యాఖ్యలు చేసినా ఇంత వరకూ ఆయనపై వేటుపడకపోవడానికి కారణం.. ఆయన సీఎం జగన్ కు బంధువు కావడమేనని అంటున్నారు. అయితే జగన్ లో బాలినేని తన  బంధువు అన్న సానుకూలత ఇసుమంతైనా లేకపోయినా.. ఆయన పార్టీ వీడి వెళ్లకుండా నిలువరించడం, అలాగే ఎంత అలకబూనినా బాలినేని తెగే వరకూ లాగకపోవడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే తల్లినీ, చెల్లినీ పార్టీ నుంచి బయటకు గెంటేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ ఇప్పుడు బాలినేనిని కూడా బయటకు పంపితే.. అది పార్టీ శ్రేణులకే కాకుండా.. ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలిస్తుందన్న  భావనతోనే బాలినేనిని తాను స్వయంగా  పొమ్మనడం లేదని చెబుతున్నారు. అలాగే బాలినేని కూడా ఎన్ని అవమానాలెదురైనా పార్టీనే పట్టకు వేలాడటానికి ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ వైసీపీ పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచీ  ఆయనతోనే ఉన్న బాలినేని.. ఇప్పుడు బయటకు వెళ్లాలని భావించినా.. ఆయనకు స్వాగతం పలికి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించే పార్టీ ఏదీ లేకపోవడంతో కేవలం తన రాజకీయ భవిష్యత్ ఏమౌతుందో అన్న ఆందోళనతోనే వైసీపీలో పొమ్మన లేక పొగబెడుతున్నా.. ఆ పొగకు ఉక్కిరిబిక్కిరై విలవిలలాడుతున్నారు కానీ.. స్వతంత్రించి, ధైర్యం చేసి బయటకు రావడం లేదని అంటున్నారు.

ఇక  బాలినేనికి వైసీపీతో బంధం తెగిపోయినట్లే అన్న  పరిస్థితి వచ్చిన  ప్రతిసారీ.. తాడేపల్లి నుంచి పిలుపు రావడం.. అక్కడ బుజ్జగింపులో.. బెదరింపులో తెలియదు కానీ బయటకు వచ్చి బాలినేని సర్దుకు పోవడం ఈ రెండేళ్లుగా రివాజుగా మారింది. ఇక బాలినేనికి పొసగని సుబ్బారెడ్డి  కూడా జగన్ కు సమీప బంధువే. ఈ నేపథ్యంలోనే సుబ్బారెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యం బాలినేనికి  జగన్ ఇవ్వడం లేదన్నది పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నారు. జగన్ బాలినేని పట్ల అనుసరిస్తున్న వైఖరి కారణంగానే పార్టీలో, అధికారులలో కూడా ఆయనకు మన్నన మర్యాదా లేవన్నది బహిరంగ రహస్యమే.  ఇటీవల తన అనుచరులను పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో మీడియా ముఖంగా వైసీపీ పెద్దలపై విరుచుకుపడిన బాలినేని.. తన వాళ్లపై సప్సెన్సన్ ఎత్తేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అల్టిమేటం జారీ చేశారు. గడువు సైతం విధించారు. కానీ ఆయన కోరుకున్నట్లుగా తన వారిపై సస్పెన్షన్ ఎత్తివేయకున్నా సర్దుకునిపోయారు. ఆ తర్వాత మరోసారి జిల్లాలో తన మాటకు విలువ లేకుండా చేశారని, పోలీసుల నుండి రెవెన్యూ అధికారుల వరకు ఎవరికీ తన మాట అంటే లెక్కలేకుండా పోయిందని ఆవేశాన్ని వెళ్లగక్కారు. ఆ తరువాతా షరామామూలే.

ఇవన్నీ పక్కన పెడితే.. ప్రకాశం జిల్లాలో  ఓ భూ ఆక్రమణల కుంభకోణం విషయంలో ఫైర్ అయి తన సెక్యూరిటీని సరెండర్ చేసిన బాలినేని.. ఆ చర్యతో అందరి దృష్టీ ప్రకాశం జిల్లాలో జరిగిన భూ కుంభకోణంపై పడేలా చేశారు. ఈ భూ కుంభకోణం వెనుక ఉన్నది వైసీపీ వారే కావడంతో జగన్ కు బాలినేని చర్య ఇబ్బందికరంగా మారింది. దీంతో  ఇక బాలినేని పనైపోయిందనే అంతా అనుకున్నారు. అయితే ఇటీవల జగన్ తల్లి వైఎస్సార్ తెలంగాణ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఒంగోలులో బాలినేనికి కలిశారు. ఆ సందర్భంగా బాలినేని తన గోడు వెళ్లబోసుకుంటే..తానేం చేయలేనని విజయమ్మ నిస్సహాయత వ్యక్తం చేశారని బాలినేని వర్గీయులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలినేనికి తాడేపల్లి నుంచి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పిలుపు రాజీ కోసం కాదనీ, బుజ్జగించేందుకు అసలు కాదనీ పరిశీలకులు అంటున్నారు. బాలినేని, సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని తెలిసి కూడా ఇద్దరినీ ఒకే సమయంలో కలవాలని జగన్ భావించడం వెనుక బాలినేని సుబ్బారెడ్డితో సమన్వయం లేకుంటే కుదరదు అన్న అల్టిమేటమ్ ఇవ్వడానికేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వైవీ సుబ్బారెడ్డితో చాలా ఇబ్బందులు ఎదుర్కొం టున్నానని బాలినేని ఇదివరకే జగన్‌కు ఫిర్యాదు చేసినందున ఈ భేటీలో కూడా  జగన్మోహన్‌ రెడ్డి  వైవీకే ప్రాధాన్యత ఇస్తే..  బాలినేని పార్టీ వీడడం ఖాయమని అంటున్నారు. 

By
en-us Political News

  
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.