సూపర్-8లో భారత్ తలపడే ప్రత్యర్థులు ఎవరంటే?

Publish Date:Feb 17, 2026

Advertisement

 

టీ20 ప్రపంచ కప్‌లోఇప్పటికే గ్రూప్ స్టేజి దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ఏడు జట్లు సూపర్- 8కి అర్హత సాధించాయి. ఎనిమిదో జట్టుగా పాకిస్థాన్ లేదా యూఎస్ఏ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. గ్రూప్ స్టేజిలోనే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది.  భారత్, జింబాబ్వే, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు సూపర్ 8కి క్వాలిఫై అయ్యాయి. 

ఈ నేపథ్యంలో సూపర్ 8లో టీమిండియాతో తలపడే జట్లు ఖారారయ్యాయి. సూపర్ 8లో భాగంగా భారత్‌తో పాటు జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు గ్రూప్ 1 లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరగనున్నాయి. న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంకతో పాటు మరో జట్టు గ్రూప్ 2లో ఉంటాయి. ఈ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరగనున్నాయి.

టీమిండియా తమ తొలి సూపర్ 8 మ్యాచ్‌ను ఫిబ్రవరి 22న సౌతాఫ్రికాతో ఆడనుంది. దీనికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. రెండో సూపర్ 8 మ్యాచ్ ఫిబ్రవరి 26న జరగనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జింబాబ్వేతో తలపడనుంది. భారత్ తమ మూడో సూపర్ 8 మ్యాచ్‌లో మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌ను ఢీకొట్టనుంది. 

కాగా ఈ మ్యాచ్‌లన్నీ సాయంత్రం ఏడింటికే మొదలవుతాయి. గ్రూప్ 1, గ్రూప్ 2లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్ మ్యాచ్‌లు మార్చి 4,5 తేదీల్లో జరగనున్నాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు మార్చి 8న జరిగే ఫైనల్‌లో తలపడతాయి.  సెమీస్, ఫైనల్ మ్యాచ్ వేదికలు ఖరారు కావాల్సిఉంది.

భారత సూపర్-8 మ్యాచ్‌ల షెడ్యూల్

ఫిబ్రవరి 22 (ఆదివారం) : భారత్ vs దక్షిణాఫ్రికా (నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్) 
ఫిబ్రవరి 26 (గురువారం) : భారత్ vs జింబాబ్వే (ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై) 
మార్చి 1 (ఆదివారం) : భారత్ vs వెస్టిండీస్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
 

By
en-us Political News

  
సీఎం చంద్రబాబు విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేసిందని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక మార్పు చోటుచేసుకుంది.
ఇండోనేషియా రాజధాని జాకర్తా శివార్లలో సోమవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది.
ముందుగా ఇరాక్ పార్లమెంటరీ కూటమి కోఆర్డినేషన్ ఫ్రేమ్‌వర్క్ మాజీ ప్రధాని నూరి అల్ మాలికిని ఆ పదవిలో కూర్చోబెట్టాలని భావించింది. అయితే, మాలికికి ఇరాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.
మాజీ సీఎం జగన్ మెప్పు కోసం సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టిన ఆయన మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదని.. ఒక కొత్త యుగానికి పునాదని అదానీ గ్రూప్‌ ఛైర్మన్ జీత్‌ అదానీ పేర్కొన్నారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓపీఎల్) ఏకపక్ష వైఖరి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డిజిల్ సంక్షోభం తలెత్తిందని తేలింది.
ములుగు అడవి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి పోలీసులు కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు.
హైదరాబాద్ నగరంలో మరోసారి అగ్నిప్రమాదం కలకలం రేపింది.
సెర్చ్ ఇంజిన్‌గా మొదలైన గూగుల్.. విశాఖలో ఏర్పాటు చేయబోతున్న సెంటర్ ద్వారా దేశానికే గ్రోత్ ఇంజిన్ కాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
అమరావతి నుంచి హైదరాబాద్‌, చెన్నైల మధ్య బుల్లెట్ ట్రైన్‌‌ను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.