టి.20 మహిళల ప్రపంచకప్ లో టీమ్ ఇండియా ఫైనల్ ఆశలు గల్లంతు

Publish Date:Feb 23, 2023

Advertisement

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టి20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా పోరు సెమీస్ తో ముగిసింది. సెమీస్ లో ఆస్ల్రేలియా చేతిలో ఐదుపరుగుల తేడాతో పరాజయం పాలైంది. విజయం ముంగిటకు వచ్చి కూడా చివరి నిముషంలో తడబడి ఓటమి మూటగట్టుకుంది. అయితే పోరాడి ఓడిన భారత అమ్మాయిలు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు.

మొత్తం మీద టైటిల్ ఆశలో వరల్డ్ కప్ టోర్నీలో అడుగుపెట్టిన టీమ్ ఇండియా మహిళల జట్టుకు ఆ ఆశ నెరవేరలేదు. కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ పోరులో భారత్ పోరాడి ఓడింది.  173 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 52 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. జెమీమా రోడ్రిగ్స్ 43 పరుగులు చేసింది. వీరిద్దరూ అవుటైన తర్వాత దీప్తి శర్మ (20 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది.

చివరి ఓవర్ లో 16 పరుగులు చేయాల్సిన దశలో భారత్ పది పరుగులు మాత్రమే సాధించగలిగింది. దీంతో 5 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది.  ఈ విజయంతో ఆస్ట్రేలియా ఫైనల్స్ కు చేరింది. అయితే సెమీస్ లో టీమ్ ఇండియా ఓటమికి దురదృష్టమే కారణమని చెప్పాలి. విజయం దిశగా జట్టును నడిపిస్తున్న హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్ అవ్వడంతోనే మ్యాచ్ స్వరూపం మారిపోయింది. 15వ ఓవర్లో తొలి రెండు బంతులను బౌండరీకి తరలించిన హర్మన్ ప్రీత్ కౌర్ నాలుగో బంతిని హర్మన్ మరో షాట్ కొట్టింది.

అయితే బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపిన ఫీల్డర్..బంతిని వేగంగా వికెట్ కీపర్ కు త్రో చేసింది. రెండో పరుగు తీస్తున్న హర్మన్ ప్రీత్ కౌర్ క్రీజ్ లోకి చేరేలోగా కీపర్ వికెట్ స్టంప్ చేశాడు. దీంతో హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్ అయ్యింది. ఆ ఔటే విజయం ముందు టీమ్ ఇండియా బోల్తాపడేలా చేసింది. జర్వంతోనే క్రీజ్ లోకి దిగిన స్కిప్పర్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుత బ్యాటింగ్ తో జట్టును దాదాపు విజయం అంచులకు చేర్చింది. అయితే దురదృష్టవశాత్తూ..ఆమె రనౌట్ టీమ్ కు విజయాన్ని దూరం చేసింది. 

By
en-us Political News

  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.