ఎస్‌విఎం ఆదిత్య హోమ్స్ మోసం కేసు...రూ.15 కోట్లకు పైగా వసూళ్లు

Publish Date:May 27, 2026

Advertisement

 

రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్ పరిధిలోని పి.ఆర్.ఎల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో నమోదైన భారీ రియల్ ఎస్టేట్ మోసం కేసు సంచలనంగా మారింది. విల్లాలు నిర్మించి అప్పగిస్తామని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మెస్సర్స్ ఎస్‌విఎం ఆదిత్య హోమ్స్ సంస్థపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించిన ఫిర్యాదును ఖానామెట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బెడడం రామారావు మే 21న డీసీపీ క్రైమ్స్ అండ్ ఈఓడబ్ల్యూ, సైబరాబాద్ కార్యాలయంలో సమర్పించారు. ఫిర్యాదు ప్రకారం.. సంస్థ ప్రతినిధులు రంజిత, నితీష్ కుమార్‌లు 2023 అక్టోబర్‌లో తనను సంప్రదించి సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం కిస్తారెడ్డిపేటలో “టెక్ హోమ్స్” పేరుతో విల్లా ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు తెలిపారు.

సంస్థ మేనేజింగ్ పార్టనర్లు ఎన్. శ్రీనివాస బాబు, జులకంటి మధుసూదన్ రెడ్డి తదితరులు కలిసి సుమారు 9 ఎకరాల భూమిలో 200కు పైగా ఆధునిక విల్లాలను నిర్మిస్తున్నామని, హెచ్ఎండిఏ సహా అన్ని అనుమతులు ఉన్నాయని నమ్మబలికినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్కువ ధరకే విల్లాలు అందిస్తున్నామని ప్రచారం చేసి పలువురిని ఆకర్షించినట్లు వెల్లడైంది.

ఫిర్యాదుదారు రామారావు కొండాపూర్‌లోని సంస్థ కార్యాలయాన్ని సందర్శించి విల్లా నంబర్-92ను కొనుగోలు చేసేందుకు అంగీకరించారు. 183 చదరపు గజాల విస్తీర్ణంలో, 3043 చదరపు అడుగుల నిర్మాణంతో ఉండే ఆ విల్లా ధర రూ.1.79 కోట్లు కాగా, సౌకర్యాల పేరిట అదనంగా రూ.6 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు.

2023 నవంబర్ 27 నుంచి 2024 ఏప్రిల్ 6 వరకు వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా మొత్తం రూ.80 లక్షలను చెక్కులు, ఆర్టీజీఎస్ రూపంలో సంస్థ ఖాతాలకు బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మిగతా మొత్తాన్ని నిర్మాణ దశల వారీగా చెల్లించాలని ఒప్పందం కుదిరినట్లు తెలిపారు.

అయితే పూర్తి చెల్లింపులు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిన సంస్థ.. బాధితులకు కేవలం రూ.100 నాన్-జ్యుడీషియల్ స్టాంప్ పేపర్‌పై నమోదుకాని అవగాహన ఒప్పంద పత్రాలు మాత్రమే ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇదే ప్రాజెక్ట్ పేరుతో మరో 19 మంది వినియోగదారుల నుంచి కూడా భారీ మొత్తాలు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. బాధితుల జాబితాలో సయ్యద్, జగదీష్, చక్రధర్, పద్మజ, మాధవ్ తదితరులు ఉన్నారు. వీరి నుంచి కలిపి సుమారు రూ.14.30 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం.

తర్వాత భూమి సంస్థ పేరిట గానీ, నిందితుల పేరిట గానీ రిజిస్ట్రేషన్ కాలేదని, విక్రయించే హక్కు కూడా వారికి లేదని బాధితులు గుర్తించారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి నిర్మాణ పనులు జరగడం లేదని, లేఅవుట్ అభివృద్ధి కూడా నిలిచిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళికతో ప్రజలను మోసం చేసి వారి కష్టార్జితాన్ని దోచుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఈ మేరకు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్లు 318(4), 316(2), 3(5)తో పాటు టీఎస్‌పీడీఎఫ్‌ఈ చట్టం సెక్షన్-5 కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తును ఈఓడబ్ల్యూ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ హబీబుల్లా ఖాన్‌కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిందితుల ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు, భూమి పత్రాలు, ఒప్పందాలపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.
 

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.