ఎస్వీబీసీ లీలలు చూడతరమా? 

Publish Date:Nov 11, 2020

Advertisement

తిరుమల ‘కొండా’రెడ్లు ఏం చేస్తున్నారు?

 

ధర్మరాజు పాలనలో ఏమిటీ దారుణాలు దేవా?

 

తిరుమల వెంకన్న కార్యక్రమాలు ప్రసారం చేసేందుకు... 12 ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన ఎస్వీబీసీ చానెల్, ఇప్పుడు ధర్మరాజు లాంటి ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో, ‘అత్యంత విజయవంతంగా’ ‘మునుపెన్నడూ లేనంత సమర్థతతో సాగుతోంది. శ్రీవారి సేవలో తరించాల్సిన భక్తిచానెల్, పాలకుల పల్లకీలో తన జన్మ ధన్యం చేసుకునే పనిలో ‘శ్రమ’టోడ్చుతోందట. మరి పెద్ద పెద్ద సార్లు, పాలకుల పల్లకీ మోసే పనిలో క్షణం తీరిక లేకుండా ఉంటే.. కింద పనిచేసే చిన్న సార్వాడీలు మాత్రం తక్కువ తినరు కదా? వారూ తమకు తోచిన లీలలు కొనసాగిస్తున్నారు.

 

మొన్నామధ్య ‘శతమానం భవతి’ కార్యక్రమం కోసం.. ఎస్వీబీసీ ఉద్యోగికి ఒక భక్తుడు మెయిల్ పెట్టారట. దాన్ని చూసిన సదరు ఉద్యోగి, పోర్నుసైటు లింకు పెట్టి, పండగ చేసుకోమని చెప్పారట. దాన్ని చూసిన సదరు భక్తశిఖామణి అపచారమంటూ నెత్తికొట్టుకుని, ఆ విషయాన్ని ఎస్వీబీసీ చైర్మన్, టీటీడీ చైర్మన్, ఈవోకు చేరవేశారు. దానితో భక్తుడిపై కరుణించిన టీటీడీ పెద్దలు.. విజిలెన్స్, సైబర్ క్రైం పోలీసులను రంగంలోకి దింపారు. ఆఫీసులో కంప్యూటర్లు తనిఖీ చేస్తే, ఉద్యోగుల‘ రాసలీలాభిమానం’ ఏమిటో బయటపడిందట.

 

ఈ అరాచకం-అపచారంపై టీడీపీ-బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, ఎస్వీబీసీ అరాచాలను తూర్పారపట్టారు. హిందూధర్మ ప్రచారంపై, ఎస్వీబీసీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విరుచుకుపడ్డారు. అయోధ్య ప్రత్యక్ష ప్రసారం ఇవ్వని నిర్లక్ష్యాన్ని గుర్తు చేశారు. అవసరాలకు మించి ఉద్యోగుల నియామకాలు, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎండగట్టారు. దోషులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు సైతం, టీటీడీ పాలకుల తీరును దునుమాడారు. టీడీపీ కార్యకర్తలు, ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. మరి కొండమీదున్న ‘కొండారెడ్లు’ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి!

 

అయోధ్య శంకుస్థాపనను.. లైవ్ టెలికాస్ట్ కూడా ఇవ్వలేనంత బిజీగా, పాలకుల సేవలో తరిస్తున్న ఈ ఎస్వీబీసీ చానెల్‌కు, టీటీడీ ఏడాదికి ఇచ్చే బడ్జెట్ అక్షరాలా 25 కోట్లు. అందులో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 250 మంది. నిజానికి ప్రస్తుత అవసరాలకు సరిపోయే సిబ్బంది 100 మంది మాత్రమే. ఇప్పటిదాకా ఏఓ, అకౌంట్స్ ఆఫీసర్, చీఫ్ టెక్నికల్ ఆపీసర్, చీఫ్ ప్రోగ్రామింగ్ పోస్టులు భర్తీ చేయలేదు. టీటీడీ వ్యవహారాలపై, భక్తకోటి పక్షాన, నిరంతరం పోరాటం చేస్తున్న, రాయలసీమ పోరాట సమితి అధ్యక్షుడయిన నవీన్ అనే భక్తుడు.. ఎస్వీబీసీ చానెల్ అక్రమాలపై హైకోర్టుకెళ్లారు. కోర్టు ఆదేశాల ప్రకారం విజలెన్స్ అధికారులు విచారణ జరిపితే, అందులో 2 కోట్ల 30 లక్షల అవినీతి జరిగిందని తేలింది. దానితో నాటి సీఈఓను తొలగించేశారు. ఆ అవినీతి కథ అక్కడితో ముగిసింది. అసలు అవససం లేకుండానే ఉద్యోగులను 50 వేలు-70 వేలు ఇచ్చి ఎందుకు నియమించుకుంటున్నారో తెలియదు. టీటీడీ ఇప్పటిదాకా దాడులు చేసిన 30 మందిని ఎందుకు కొనసాగిస్తుందో పాలకమండలికే తెలియాలి.అంతేనా?.. కోట్లాదిరూపాయలు ఖర్చు పెట్టి తీసిన శ్రీవారి ‘టేప్’లు ఎక్కడున్నాయి? అసలు ఉన్నాయా? లేవా? గత 13 ఏళ్ల నుంచి ఎస్వీబీసీ చానెల్ , ఏ కార్యక్రమానికి ఎన్ని కోట్లు ఖర్చు చేసిందన్న లెక్కలున్నాయా? అన్న ప్రశ్నలకు ఎవరి నుంచీ జవాబు లేదు.

 

భక్తులిచ్చే విరాళాలతో నడుస్తూ, టీటీడీ నిర్విహంచే.. ఎస్వీబీసీ నిధులన్నీ పప్పుబెల్లాల మాదిరిగా పంచేస్తుంటే, కొండమీదున్న ‘కొండారెడ్లు’ ఎందుకు గమ్మునుంటున్నారు? ఒకరా.. ఇద్దరా.. కొండమీద ఎటు చూసినా అంతా రెడ్డిగార్లే. ఇటు చూస్తే చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి.. అటు చూస్తే ఈఓ జవహర్‌రెడ్డి.. మరోవైపు చూస్తే ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి. కొండపై కొలువుదీరిన ఈ ‘కొండారెడ్ల’ జమానాలో టీటీడీ ‘ఆరకంగా ముందుకెళుతోంది’ మరి! ఎస్వీబీసీ నిర్వహణపై శరపరంపరగా ఆరోపణలొస్తుంటే, ప్రక్షాళనకు ఎందుకు నడుం బిగించడం లేదు? వైఫల్యాలకు-ఆరోపణలకు కింది స్ధాయి వారినే ఎందుకు బలిచేస్తున్నారు? అందులో ‘కొండారెడ్ల’ నిర్వహణా వైఫల్యం లేదా? మరి ఆ లెక్కన వారిపైనా చర్యలు తీసుకోవాలి కదా? ఎస్వీబీసీకి బాసుగా ఉన్న వారిపై కదా, వేటు వేయాల్సింది?. ఈ ప్రశ్నలకు బదులిచ్చే దమ్ము, కొండమీదున్న స్వాములకు ఉందా?! 

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.