గోవిందా.. ఏంటీ దారుణాలు! ఎస్వీబీసీని బజారున పడేశారా?

Publish Date:Nov 13, 2020

Advertisement

మహిళా ఉద్యోగులకు లైంగిక వేధింపులు.. పోర్న్ సైట్ లింకులు.. నిధుల్లో అక్రమాలు. ఇవి తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా నడిచే భక్తి చానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ లో వెలుగు చూస్తున్న వ్యవహారాలు. వరుసగా జరుగుతున్న ఘటనలతో శ్రీవారి చానెల్ అప్రదిష్ట పాలవుతుంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎస్వీబీసీ పూర్తిగా గాడి తప్పినట్లుగా మారిపోయింది. మాజీ చైర్మన్‌ వ్యవహారాలు, బోర్డు గందరగోళ నిర్ణయాలతో ప్రతిష్టాత్మక ఛానెల్‌ పరువు నవ్వులపాలైంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ఇష్టారాజ్యంతోనే భక్తి చానెల్ బజారున పడే పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి. శ్రీవారి చానెల్ లో జరుగుతున్న పరువు పోయే పరిణామాలతో వెంకన్న భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

 

ఎస్వీబీసీలో తాజాగా వెలుగుచూసిన పోర్న్ సైట్ లింక్ వ్యవహారం టీటీడీకి తలనొప్పిగా మారింది.ఈ ఘటనలో విచారణ జరిపేకొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎస్వీబీసీ ఛానెల్ లో పనిచేసే ఉద్యోగుల్లో కొంతమంది పనిమానేసి పోర్న్ సైట్స్ చూడటానికి ఆఫీస్ సిస్టమ్స్ ఉపయోగిస్తున్నట్టు తేలింది. ఎస్వీబీసీలో పనిచేసే ఉద్యోగి పోర్న్‌ లింక్‌లు పంపటం నిజమేనని టీటీడీ విజిలెన్స్‌ విచారణలోనూ తేలింది. దీంతో పోర్న్‌ వీడియో పంపిన ఉద్యోగితోపాటు పోర్న్‌ సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంది ఎస్వీబీసీ యంత్రాంగం.

 

శతమానం భవతి కార్యక్రమం కోసం ఒక భక్తుడు మెయిల్ చేయగా తిరిగి భక్తుడికి ఎస్విబిసి ఉద్యోగి ఓ అశ్లీల సైట్ లింక్ పంపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తుడు టిటిడి చైర్మన్ కు ,ఈవో కు దీనిపై ఫిర్యాదు చేశారు.  పోర్న్ సైట్స్ వ్యవహారం భక్తుడి ఫిర్యాదు ద్వారా వెలుగులోకి రావడంతో.. టీటీడీ  ఉలిక్కి పడింది. వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టిందిఎస్వీబీసీ. సైబర్ క్రైమ్ పోలీస్ బృందం రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తోంది.  82 కంప్యూటర్లను, సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. మిగతా కంప్యూటర్లలో కూడా పోర్న్ సైట్స్ చూసినట్టు ఆధారాలున్నాయని, బ్రౌజర్ హిస్టరీలో అన్ని విషయాలు బైటపడ్డాయని తెలిసింది. అయితే ఆ సమయంలో కంప్యూటర్లను ఎవరు వినియోగించారు, ఎవరు పోర్న్ సైట్స్ చూశారనే విషయాన్ని నిర్థారించుకునేందుకు సీసీ టీవీ ఫుటేజ్, అటెండెటన్స్ ను పరిశీలిస్తున్నారు.

 

వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాకా  ఎస్వీబీసీ చానెల్ లో భక్తుల మనోభావలకు భంగం కలిగే పరిణామాలే వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఎస్వీబీసీ బోర్డుకు  జగన్ సర్కార్ నియమించిన చైర్మెన్ వ్యక్తే లైంగిక వేధింపులు చేస్తూ దొరికిపోవడం తీవ్ర దుమారం రేపింది. ప్రతిష్టాత్మక శ్రీవారి భక్తి చానెల్ చైర్మెన్ గా కమెడియన్ కమ్ యాక్టర్ పృథ్వీని నియమించింది. ఆయన పదవి చేపట్టిన కొన్ని రోజులకే గత జనవరిలో మహిళా ఉద్యోగులను వేధిస్తున్న ఘటన వెలుగు చూసింది. మహిళా ఉద్యోగితో పృధ్విరాజ్  మాట్లాడిన ఆడియో లీక్ అవడం పెద్ద సంచలనమే సృష్టించింది. ఆ ఆడియో కారణంగా పృథ్వీపై ఆరోపణలు రావడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. తర్వాత కూడా పలు ఆరోపణలు వచ్చాయి. ఎస్వీబీసీ నిధుల్లోనూ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.  

 

ధార్మిక ప్రచారం కోసం 2008లో శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్‌ను ప్రారంభించింది  తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి ఆలయం లోపల, వెలుపల జరిగే కార్యక్రమాలతో పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు ఈ చానల్‌ను ప్రారంభించింది టీటీడీ. చానల్ పరిపాలన వ్యవహారాలను చూసుకోవడానికి ప్రత్యేకంగా బోర్డ్ ని...చైర్మన్ ని కూడా నియమించింది . ఇలా గొప్పగా ప్రారంభించిన ఛానల్  వివాదాలకు చిరునామాగా మారడం భక్తులను కలవరపరుస్తోంది. నియామకాలు..కొనుగోలు,  కార్యక్రమాలు నిర్వహణ వరకు అంతటా అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గత చైర్మన్ పృథ్విరాజ్ వ్యవహరించిన తీరు ఛానల్ ప్రతిష్టతో పాటు టీటీడీ పరువును బజారు కీడ్చినట్లయింది.

 

ఎస్వీబీసీలో జరుగుతున్న ఘటనలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.  ఇప్పటికే బీజేపీ కార్యకర్తలు నిరసనలు చేస్తుండగా.. ఏపీ రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ దీయోధర్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఛానల్‌లో అసాంఘిక ఘటనలు జరగడం బాధాకరమన్నారు సునీల్ దీయోధర్. అయోధ్య భూమి పూజను కూడా ఎస్వీబీసీ ప్రసారం చేయలేదని విమర్శించారు. తప్పులు చేయడం.. తర్వాత క్షమాపణలు చెప్పి సరిద్దిదుకోవడం టీటీడీకి సర్వసాధారణంగా మారిందన్నారు. ఇకనైనా ఇలాంటి ఘటనలు జరగకుండా టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. టీటీడీ ఆస్తులు, నిధులను ప్రభుత్వం కాపాడాలని సునీల్ దీయోధర్ అన్నారు. 

 

ఎస్వీబీసీ టీవీ ఛానల్ లో వెలుగు చూసిన అశ్లీల సైట్ లింక్ ఘటనతో పాటు గత ఏడాది కాలంగా వరుసుగా జరుగుతున్న ఘటనలతో శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు తిరుమల శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో టీటీడీ ఏర్పాటు చేసిన ఎస్వీ భక్తి ఛానల్‌కు  రాజకీయ గ్రహణం పట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. ధర్మ ప్రచారానికి నిర్వహించే ఛానల్ లో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడటం దురదృష్టకరమని మండిపడుతున్నారు. ఎస్విబిసి పవిత్రతను కాపాడాలంటూ హిందూ సంఘాలు ఆందోళనలు కూడా చేస్తున్నాయి. టీటీడీ పవిత్రత కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటున్నారు భక్తులు.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.