పొంగులేటి, జూపల్లి చేరికపై వీడని మిస్టరీ

Publish Date:Jun 19, 2023

Advertisement

బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్ పార్టీలో చేరతారా అనేది వీడని సస్పెన్స్ గా  కొనసాగుతోంది. అసలు వాళ్లు పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారా? రాహుల్ గాంధీతో  జూమ్ మీటింగ్ లో పాల్గొన్నప్పటికీ ఏ విషయాన్ని ఎందుకు స్పష్టం చేయడం లేదనేది ఆసక్తి కలిగిస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన పార్లమెంట్ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత జనవరిలో అధికార భారత రాష్ట్ర సమితికి వ్యతిరేక స్వరం వినిపించారు. కెసిఆర్ పాలన మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క అధికార పార్టీ ఎమ్మెల్యే ని కూడా మళ్లీ అసెంబ్లీ గేటు తొక్కనివ్వనని స్పష్టం చేశారు. ఇది జరిగిపోయి దాదాపు ఆరు నెలలు అవుతుంది. ఆలు లేదు, చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా.. తను ఏ పార్టీలో చేరబోతున్నానో చెప్పకుండానే పొంగులేటి వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఈలోగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవడంతో తన రాజకీయ ప్రయాణాన్ని ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. అయితే అంతకుముందు ఆయన భారతీయ జనతా పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఈటెల రాజేందర్, మాధవనేని రఘునందన్ రావు ఆయనను బిజెపిలోకి ఆహ్వానించారు. కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.
రాహుల్ టీం కలిసింది
ఇక అప్పట్లో రాహుల్ గాంధీకి చెందిన ఒక టీం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసింది. పార్టీలోకి రావాలి అని ఆహ్వానించింది. దీనికి ఎస్ అని గాని నో అని గాని పొంగులేటి సమాధానం చెప్పలేదు. అయితే ఇదే సమయంలో ఆయన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలలో జూపల్లి కృష్ణారావుని కూడా భాగస్వామ్యం చేయడం కొంతమేర ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది జరుగుతుండగానే కర్ణాటక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో తన అడుగులు కాంగ్రెస్ వైపు వెళ్తున్నాయని అనుచరుల ద్వారా హింట్ ఇచ్చారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని తన నోటి ద్వారా ఎప్పుడూ చెప్పలేదు.. ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కూడా ఎటువంటి విషయాన్ని ఆయన నోరు విప్పలేదు. కార్యకర్తలను భారీగా పిలవడం,  వారితో సమావేశం నిర్వహించడం, ప్రభుత్వ విధానాలను ఎత్తిచూపడం వంటి వాటికి మాత్రమే పొంగులేటి పరిమితం అయిపోయారు. వాస్తవానికి ఒక నాయకుడిని నమ్ముకుని చాలామంది ఉంటారు. అతడి ప్రయాణం ఆధారంగా తమ రాజకీయ భవిష్యత్తును అంచనా వేసుకుంటారు. కానీ పొంగులేటి విషయంలో మాత్రం ఎందుకో తన రాజకీయ ప్రయాణం విచిత్రంగా మారినట్లు కనిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తుంటే, స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపు వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ రెంటి మధ్యలో ఎటువైపు వెళ్ళాలో నిర్ణయించుకోక పొంగులేటి ఒకింత గుంభనంగా వ్యవహరిస్తున్నారు.మీడియా చేస్తున్న ప్రచారం ప్రకారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం పక్కా. కానీ ఆ మాటే ఆయన నోటి వెంట రావడం లేదు.. పైగా ఇటీవల అమిత్ షా ఖమ్మం రావాల్సి ఉండేది. కానీ యాదృచ్ఛికంగా ఆయన పర్యటన వాయిదా పడింది. ఇదే సమయంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతానని, ప్రెస్ మీట్ పెట్టి చెబుతానని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఆయన ఎటువంటి ప్రెస్ మీట్ నిర్వహించలేదు.. దీనికి తోడు రేవంత్ రెడ్డి పొంగులేటి ఇంటికి వెళ్లారని ప్రచారం జరిగింది. తర్వాత అది గాలికి పోయిన పేలపిండి సామెతను గుర్తు చేసింది..ఇక అమిత్ షా ఖమ్మం పర్యటన రద్దు కావడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎటువంటి విలేకరుల సమావేశం నిర్వహించకపోవడం.. రెండు వేరువేరు ఘటనలు అయినప్పటికీ ఎందుకో సారూప్యత కనిపిస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే తెరవెనుక ఏదైనా జరుగుతోందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాలం గడిస్తే కానీ వీటికి సమాధానాలు దొరకడం కష్టం.
అసలు ఈ ఇరువురు నేతల తీరు.. చికాకు పెడుతోంది. ఇకనైనా వారు సస్పెన్స్ కు తెర దించుతారనేది వేచి చూడాల్సిందేనా..?

By
en-us Political News

  
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.