తెలంగాణలో అంతటా ఇప్పుడు మునుగోడు చర్చే. మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం అని తేలిపోయింది. బీజేపీ అభ్యర్థిగా తాజా మాజీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఖరారయ్యారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? తెరాస తరఫున ఎవరు నిలబడతారు అన్న విషయంలో స్పష్టత లేదు. మునుగోడులో త్రిముఖ పోరు మాత్రం తథ్యం అనడంలో ఎలాంటి సందేహాలకూ తావులేకపోయినా.. అసలు అభ్యర్థులు ఎవరు? అన్నది తేలకుండానే గెలుపు ఓటములపై చర్చోపచర్చలు జోరుగా సాగుతున్నాయి.
మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. మునుగోడు ఉప ఎ ఎన్నికలను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమిఫైనల్స్ గా రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి. మునుగోడులో విజయం సాధిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తిరుగుండదని బీజేపీ సహా కాంగ్రెస్, టీఆర్ఎస్ లు కూడా భావిస్తున్నాయి. దీంతో తెలంగాణలో ప్రధాన పక్షాలైన మూడు పార్టీలూ కూడా మునుగోడుపై ప్రత్యేక దృష్టిసారించాయి.
అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు ఆయా పార్టీల అధినేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, టిఆర్ఎస్ లు సమర్ధ అభ్యర్థుల కోసం గాలిస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తు అయితే ఇప్పటి నుంచే మునుగోడులో సర్వేలు హడావుడి ప్రారంభమైంది. మునుగోడు ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలుపొందుతుంది. ప్రజల మొగ్గు ఏ పార్టీ వైపు ఉంది అన్న అంశంపై ‘సర్వే’జనం విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి రాజగోపాలరెడ్డే అన్నది ఇప్పటికే స్పష్టమైన నేపథ్యంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ల అభ్యర్థులు ఎవరన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది.
ఆ రెండు పార్టీలూ కూడా టికెట్ ఆశావహుల వివరాలు సేకరిస్తూ వారిలో బలమైన అభ్యర్థి ఎవరన్న దానిపై అంచనాలు వేసుకుంటున్నాయి. ఇక సామాజికవర్గాల వారీగా కూడా నివేదికలు రూపొందిస్తున్నాయి. ఏ సమాజిక వర్గం వారికి టికెట్ ఇస్తే విజయావకాశాలు మెరుగౌతాయి అన్న దానిపై కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్ లు అంతర్గతంగా సర్వేలు నిర్వహిస్తున్నాయని ఆయా పార్టీల శ్రేణులే చెబుతున్నాయి.
మునుగోడులో నిలబెట్టే అభ్యర్థి పార్టీ బలంపైనే కాక పార్టీకి బలంగా ఉండాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఉన్నాయి. అభ్యర్థి ఎంపిక విషయంలో ఆ లక్ష్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందుకే ముందుగా మునుగో డు నియోజకవర్గంలో సామాజిక సమీకరణాల పరిశలన అనంతరమే అభ్యర్థికి ఖరారు చేయాలనే వ్యూహంలోనే టీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/surveys-halchal-in-munugodu-39-141481.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.