ఆరా సర్వే అర్థ సత్యం.. ముక్కోణం ఖాయం

Publish Date:Jul 14, 2022

Advertisement

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పడు వస్తాయో తెలియదు? అప్పటికి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. జాతీయ రాజకీయాలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో తెలియదు. అన్నిటినీ మించి అప్పటికి ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియదు.

ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుందో అసలే తెలియదు. సో... ఇప్పటి కప్పుడు ఎన్నికలు జరిగితే, అంటూ మొదలయ్యే... ఎన్నికల సర్వేలు ఆ కాసేపు ఆనందానికి, కాదంటే, రాజకీయ  మేథోమధన చర్చలకు పనికోస్తాయే తప్ప, ఎప్పుడో జరిగే ఎన్నికల ఫలితాలను ఇప్పుడే పక్కా చేసేందుకు అంతగా ఉపకరించక పోవచ్చును.   అయితే, అంతమాత్రం చేత, సర్వ్ లన్నీ శుద్ధ దండగ అనికాదు.  సర్వేల ప్రయోజనం సర్వేలకు వుంది. ఉంటుంది. అందుకే రాజకీయ పార్టీలు, కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుని, వ్యూహాలను అల్లుకుంటాయి. ఆ విధంగా సర్వేల వలన ఎదో ప్రయోజనమా ఉంది కాబట్టే, ఎన్నికల వ్యూహాలను అమ్ముకునే రాజకీయ బేహారి ప్రశాంత్ కిశోర్ మొదలు అదే బాటలో అడుగులు వేస్తున్న ఆరా మస్తాన్ వరకు ఎవరికి వారు వారు ప్రతి రెండు మూడు నెలకోసారి వండి వారుస్తున్న సర్వేలు చర్చనీయాంశం అవుతున్నాయి.

అదుకే, రాజకీయ గీతచార్యులు. సర్వేలన్నీ సత్యం కాదు, అసత్యములును కాదు.. ఆంటారు. నిజం,సర్వే ఫలితాలు సత్యాలు కాకపోయినా, అసత్యాలు కూడా కాదు. ఒక , పాత రైల్వే గైడ్ లాగ .. ఒక  సూచికగా మాత్రం పనిచేస్తాయి.    అలా చూసినప్పుడు, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్’గా డిస్కస్ అవుతున్న ఆరా మస్తాన్ (ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్) సర్వే, నివేదిక, అక్షర సత్యం కాదు, కానీ, భవిష్యత్ రాజకీయ విశ్లేషణకు ఒక సూచికగా అయితే, కొంత వరకు ఉపకరిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  

ఆరా సర్వే చెప్పిన, ఓట్ల శాతం లెక్కలను పక్కన పెడితే, రాష్ట్రంలో ముక్కోణపు పోటీ ఉంటుందనేది, అందరికీ తెలిసిన విషయమే.కాదనడం కుదరదు. నిజానికి, 2019 ఎన్నికల్లోనే రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. అందుకే, సారు ... కారు .. పదహారు  బోల్తా కొట్టింది. కారు 16లో నాలుగు బీజేపీ, మూడు కాంగ్రెస్ పట్టుకు పోయాయి. మిగిలిన తొమ్మిది మాత్రమే తెరాసకు మిగిలాయి. ఆ తర్వాత దుబ్బాక, హుజురాబాద్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అధికార తెరాస సిట్టింగ్ స్థానాలను గెలుచుకుంది.

అదే విధంగా జీహెచ్ఎంసి ఎన్నికల్లోనూ బీజేపే నాలుగు నుంచి 48 స్థానాలకు చేరింది. కాంగ్రెస్ పార్టీ దుబ్బాక, హుజురాబాద్ తోపాటుగా, హుజూర్ నగర్ నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో ఓడి పోయింది. అందులో, హుజూర్ నగర్ అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి ఖాళీ చేసిన  కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. అలాగే, నాగర్జున సాగర్ లోనూ ఏడెనిమిది సార్లు, అదే స్థానం నుంచి గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి,  సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ఓడిపోయారు. దుబ్బాక, హుజురాబాద్ లలో కాంగ్రెస్ అభ్యర్ధులు డిపాజిట్ కోల్పోయారు. హుజురాబాద్’లో అయితే కాంగ్రస్ అభ్యర్ధికి కేవలం మూడు వేల పైచిలుకు ఒతులు మాత్రం పోలయ్యాయి. సర్వే లెక్కలు పక్కన పెట్టి, వాస్తవ ఫలితాల అధారంగా విశ్లేషణ చేసినా, గతంలో పోల్చితే తెలంగాణలో బీజేపీ బలపడిందన్నది నిజం.ఇంకా బలపడే ప్రయత్నం మరింత బలంగా  చేస్తోంది. అది కూడా నిజం.

జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించడమే కాకుండా,  కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, రాష్ట్రాల  పార్టీ అధ్యక్షులు ఇతర సీనియర్ నేతలు, ఒక్కొకరు ఒక్కొక నియోజక వర్గంలో మొత్తం 119 నియోజక వర్గాల్లో రెండు రోజుల పాటు పర్యటించి, పార్టీ క్యాడర్ తో కలిసి పనిచేయడం మాములు విషయం కాదు. తెలంగాణపై పార్టీ దృష్టి పెట్టింది అనేందుకు ఇదొక  నిదర్శనంగా పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి  పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సారథ్యంలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పరుగు లు తీస్తోంది. పార్టీ క్యాడర్లోనూ  జోష్ పెరిగిందన్నది నిజం.

అదీ గాక ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గ్రాస్ రూట్ లెవల్ నుంచి పై స్థాయి వరకు పటిష్ట యంత్రాంగం వుంది. సో.. ఎన్నికలు ఇప్పుడు జరిగినా, ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీ  తెరాసకు గట్టి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇక తెరాస విషయం అయితే చెప్పవలసిన అవసరమే లేదు. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. తెలంగాణ సెంటిమెంట్ చాల వరకు చల్లారింది. గతంలో లాగా బలంగా పని చేసే పరిస్థితి అయితే లేదు. అయినా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం అయితే నేమీ, మఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత ఇమేజ్, రాజకీయ ఎత్తుగడలు ఇతరత్రా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అన్నీ కలిపినా, తెరాసకు ఉండే అడ్వాన్ టేజీ ఉండనే ఉంటుంది. వుంది కూడా. తెరాస పనైపోయిదని అనుకోవడం, అనుకునేందుకు బాగుటుంది కానీ, అది పూర్తిగా వాస్తవం కాదు. సో.. ఆరా సర్వే  ఎందుకు చేసినా, ఎవరి కోసం  చేసినా, వండి వార్చిన వంటకమే అయిన, కొంచెం రుచిగానే  ఉందని అంటున్నారు. కొంచం కాస్త అటూ ఇటుగా వాస్తవ పరిస్థితికి అద్దం పట్టేలానే ఉందని, విశ్లేషకులు సైతం అంటున్నారు.

By
en-us Political News

  
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.