తాయిలాలతో ప్రజలను ఏమార్చిన ఫలితం..!

Publish Date:Jun 5, 2022

Advertisement

కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక స్థితికి ఈ సామెత అతికినట్టు సరిపోతుంది. ఉత్పాదక అంశాలపై దృష్టి సారించకుండా.. ప్రజలకు అవసరమా కాదా అన్న విచక్షణ కూడా లేకుండా కులాలు, మతాల వారీగా నిధుల పందేరం జరిగేలా పథకాలు రూపొందించి అమలు చేసిన ఫలితమే ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి కారణమని రాజకీయ పరిశీలకులు విమర్శిస్తున్నారు.

తెలంగాణ ప్రస్తుత ఆర్థిక దుస్థితికి కేసీఆర్ పాలనా విధానాలే కారణం. ఆవిర్భావంతోనే మిగులు బడ్జెట్ రాష్ట్రమైన తెలంగాణ నేడు సకాలంలో ప్రభుత్వోద్యోగులకు జీతాలు ఇవ్వడానికి అప్పుల మీద ఆధారపడాల్సిన దుస్థితికి  చేరుకోవడానికి తాయిలాల పాలనే కారణం. తాయిలాల ప్రలోభంలో పడి జనం తమ ప్రగతికి, అభివృద్దికి, వికాసానికి హేతువుగా నిలిచే విద్య, ఉపాధి, నైపుణ్యం వంటి ప్రధానమైన విషయాలపై ప్రభుత్వాన్ని నిలదీయడం విస్మరించడమే కారణం. అధికారంలో ఉండి.. ఐదేళ్ల తరువాత మళ్లీ అధికారం అన్న లక్ష్యం వినా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచడం, ప్రజల భవిష్యత్ బంగారంలా ఉండేందుకు అత్యంత కీలకమైన వైద్య రంగాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలను పట్టించుకోని ప్రభుత్వమూ కారణం. అంటే మొత్తంగా తెలంగాణ ఆర్థిక సంక్షోభానికి పాలకులూ, ప్రజలూ కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంది. ఒక సదాశయంతో ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యమ సారథిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజయవంతం చేయగలిగారు.

అయితే అధకారం చేపట్టిన తరువాత ఉద్యమ ఆశయాలను నెరవేర్చడంలో మాత్రం విఫలమయ్యారు.  ఉద్యమ ఫలితాలను తెలంగాణ సమాజానికి అందించడంలో విఫలమయ్యారు. రాష్ట్రం సాకారమైతే జనం ఏవైతే తమకు లభిస్తాయని ఆశించారో అవి మాత్రం జనాలకు అందలేదు. అసలా దిశగా పాలన సాగింది లేదు. తెలంగాణ రాష్ట్ర సాకారానికి  జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించిన టీఆర్ఎస్ పార్టీయే గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆ ఉద్యమ సారథే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆవిర్భావమే మిగులు బడ్జెట్ తో ఆవిర్భవించిన తెలంగాణ నేడు లోటులో పీకలోతు మునిగిపోయింది.  చిన్న చిన్న బిల్లుల చెల్లింపు నుంచి ఉద్యోగుల వేతనాల వరకూ అప్పులే శరణ్యమనే పరిస్దితికి వచ్చింది. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికి సైతం అప్పలు తప్ప మరో గత్యంతరం లేని దుస్థితికి చేరుకుంది. కేవలం తాయిలాలకే సింహభాగం ఖర్చు చేస్తూ అత్యంత కీలకమైన, ప్రధానమైన రంగాలను విస్మరించడమే ఇందుకు కారణం.  

మిగులు బడ్జెట్ తో ఆవిర్భవించిన  తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కేవలం ఎనిమిది  సంవత్సరాలలో కనీస చెల్లింపులు చేయలేని పరిస్థితికి  ప్రాధాన్యం లేని, ఉత్పాదకతకు పనికిరాని వ్యయాలను విపరీతంగా పెంచుకుంటూ పోవడం, వాటికి నిధుల కేటాయింపు ఒక ప్రధాన కారణంగా చెప్పాల్సి ఉంటుంది. కులాలు మతాల వారీగా కేటాయింపులు కచ్చితంగా ఒక ప్రధాన కారణం.  ఓట్లను రాల్చే, ప్రజాకర్షక పథకాలే పాలనా విధానంగా మారిపోవడం మరో ముఖ్యమైన కారణం. దీని వల్ల  ఇప్పుడా పథకాలే ప్రభుత్వానికి గుదిబండగా మారిన సంగతి ప్రత్యక్షంగా కనిపిస్తోంది.  

 ప్రతి విషయాన్నీ కేంద్రం మీదకు నెట్టేసి రాజకీయ పబ్బం గడుపుకోవడంతోనే తెలంగాణ సర్కార్ దృష్టి పెట్టింది కానీ, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంగా చేయాల్సినది మాత్రం చేయడం లేదు. అందుకే ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నా కూడా రాజకీయ వేడి రగిల్చి ప్రజల దృష్టి మరల్చడానికే ఇప్పటికీ ప్రాధాన్యత ఇస్తున్నది. ఓట్లు రాల్చే పథకాలతో ఎల్లకాలం ప్రజాభిమానాన్ని చూరగొనడం సాధ్యం కాదనడానికి ఇప్పుడు రాష్ట్రంలో వ్యక్తమౌతున్న ప్రభుత్వ వ్యతిరేకతే నిదర్శనం

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.