కోవిడ్ విజృంభణ.. తస్మాత్ జాగ్రత్త.!
Publish Date:Jul 15, 2026
Advertisement
దేశంలో కోవిడ్ మహమ్మరి మళ్లీ విజృంభిస్తోంది. జలుబు, జ్వరం, ఒంటి నొప్పులను వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల వల్ల వచ్చే సాధారణ ఫ్లూ, సీజనల్ జ్వరాలుగా భావించి నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ బారినపడుతున్న బాధితుల్లో జ్వరం, నిరంతరాయంగా పీడించే పొడి దగ్గుతో పాటు విపరీతమైన ఒళ్లు నొప్పులు ప్రధానంగా కనిపిస్తున్నాయనీ, అలాగే అలసట, గొంతు నొప్పి, వాసన లేదా రుచి కోల్పోవడం వంటి ఇబ్బందుల కూడా ఉంటే.. క్షణం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి సకాలంలో స్పందించడం అవసరమని చెబుతున్నారు. ఏ మాత్రం కోవిడ్ లక్షణాలు కనిపించినా.. సెల్ఫ్ మెడికేషన్ జోలికి పోకుండా.. కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, అలాగే కోవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే.. ఐసోలేషన్‌లో ఉండాలని హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో పండుగలు, శుభకార్యాల వల్ల ప్రజల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ ముందస్తు నివారణ చర్యలపై అవగాహన పెంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే కోవిడ్ విస్తరణను సమర్థవంతంగా అడ్డుకోవడం సాధ్యమవుతుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. Rising COVID cases, COVID 19 symptoms, Covid fever and cough, Corona precautions, Mask and Sanitizer
http://www.teluguone.com/news/content/surge-in-covid-cases-36-226016.html





