విజయవాడ-హౌరా హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ప్రారంభం... ఒకేసారి 10 ప్రాజెక్టులు
Publish Date:Jun 15, 2017
Advertisement
విజయవాడ-హౌరా హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను కేంద్రమంత్రి సురేశ్ ప్రభు, వెంకయ్య నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేశ్ ప్రభు మాట్లాడుతూ... గత ప్రభుత్వంతో పోలిస్తే రైల్వేలో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నాం..రైల్వేపై మోడీ ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారని అన్నారు. ఏపీలో రైల్వేల పరంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని..ఒకేరోజు ఒక రాష్ట్రంలో ఇన్ని పనులు ఎప్పుడూ ప్రారంభించలేదని ఆయన అన్నారు. భారతదేశానికి విజయవాడ లాజిస్టిక్ హబ్‌గా మారుతోందని ఆయన అన్నారు. 40వేల కోచ్‌లను భద్రతాపరంగా ఆధునీకరిస్తున్నామని ఆయన అన్నారు. అమరావతి అనుసంధానం కోసం రైల్వే లైన్ సర్వే ఏర్పాటు చేస్తామన్నారు.హైదరాబాద్-విజయవాడ రైలుకు మంగళగిరిలో స్టాప్ ఏర్పాటు చేస్తామని.. అమరావతిలో రైల్వే క్లైమ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. ఇంకా చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఏం చెప్పారంటే... ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల రాకపోకలకు విజయవాడ జంక్షన్ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఏపీకి రైల్వేప్రాజెక్టుల విషయంలో సురేష్‌ప్రభు కృషి అభినందనీయమని ఆయన ప్రశంసించారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పూర్తికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని ఆయన తెలిపారు. విశాఖ-చెన్నై, విశాఖ-ఖరగ్‌పూర్, అమరావతి-హైదరాబాద్,బెంగళూరుకు హైస్పీడ్ రైళ్లు ఏర్పాటు చేయాలని కోరామన్నారు.విశాఖపట్నం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. విశాఖకు రైల్వేజోన్ కావాలని కోరుతున్నామన్నారు వెంకయ్యనాయుడు... ఏపీలో ఒకేసారి 10 ప్రాజెక్టులను ప్రారంభించడం శుభపరిణామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఏపీని కేంద్రం ప్రత్యేకంగా చూస్తోందనడానికి ఇదే నిదర్శనమని ఆయన అన్నారు. భూ కేటాయింపుల విషయంలో చంద్రబాబు చొరవ తీసుకోవడం ప్రశంసనీయమని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని ఆయన వివరించారు. మూడేళ్లు దాటినా కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి లేదని ఆయన అన్నారు. ఏపీకి కేంద్రం నుంచి అన్ని రకాల సాయం అందుతోందని ఆయన వివరించారు.
చంద్రబాబు..
http://www.teluguone.com/news/content/suresh-prabhu-39-75656.html





