దర్యాప్తు చకచక.. వైసీపీ నేతలు గజగజ!

Publish Date:Oct 4, 2024

Advertisement

తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూ క‌ల్తీ వివాదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న‌చందంగా మారింది. సుప్రీంకోర్టు తీర్పుతో వైసీపీయుల గొంతులో క‌ల్తీల‌డ్డూ ప‌డి వారి పరిస్థితి కక్కాలేక మింగా లేక అన్నట్లుగా తయారైంది. ఒక‌ప‌క్క కోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నామ‌ని చెబుతున్న‌ప్ప‌టికీ,  వైసీపీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. స్వతంత్ర సిట్ ఎర్పాటు కాగానే తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు చకచక సాగుతుందన్న భయంతో వైసీపీయులు గజగజ వణికిపోతున్నారు. కోర్టు తీర్పు త‌రువాత మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీడియా స‌మావేశం చూసిన ఎవరికైనా ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది.  

 సుప్రీంకోర్టు తీర్పుకే వక్రభాష్యాలు చెప్పుకుని అసలు లడ్డూలో కల్తీనే జరగలేదని జ‌గ‌న్‌ తేల్చేశారు. ఇక ప్రత్యేక సిట్ కూడా అవసరం లేదనేశారు. . సుప్రీం కోర్టు సిట్ కూడా అవసరం లేదన్నట్లుగా ఆయన మాట్లాడారు.  దీంతో వైసీపీ వర్గాల్లోనే విస్మయం, ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో తిరుప‌తిలో అనేక అక్ర‌మాలు చోటు చేసుకున్నాయి. అందులో తిరుప‌తి ల‌డ్డూ వివాదం ఒక‌టి. అయితే, తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారం చాలా చిన్న‌ద‌ని.. అంత‌కంటే పెద్దెత్తున అవినీతికి వైసీపీ నేత‌లు పాల్ప‌డ్డార‌ని వారాహి స‌భ‌లో జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్న విష‌యం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో ల‌డ్డూ క‌ల్తీ విష‌యంలో అడ్డంగా దొర‌క‌డంతో పాటు,  కొండ‌పై ఐదేళ్లు సాగించిన  అవినీతి అక్ర‌మాలు కూడా బ‌య‌ట‌కు వ‌స్తాయ‌న్న ఆందోళ‌న జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లను వెంటాడుతోంది.

 వైసీపీ నేత‌,  టీటీడీ మాజీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, పొన్నంవోలు సుధాక‌ర్ రెడ్డి, సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి త‌దిత‌రులు తిరుప‌తిలో క‌ల్తీ ల‌డ్డు వివాదం విష‌యంలో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. క‌ల్తీ ల‌డ్డూ వ్య‌వ‌హారానికి సంబంధించి సీఎం చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయం చేశారు,  భ‌క్తుల మ‌నోభావాల‌తో ఆడుకున్నారు,  రాష్ర ప్ర‌భుత్వం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో విచార‌ణ కాకుండా,  సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో విచార‌ణ జ‌ర‌గాలి, సుప్రీంకోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఓ క‌మిటి విచార‌ణ చేయాల‌ని కోర్టును కోరారు. మొద‌టి రోజు విచార‌ణ‌లో భాగంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆధారం చేసుకొని వైసీపీ నేత‌లు వీరంగం చేశారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయింది. ఆధారం లేకుండా చంద్ర‌బాబు ల‌డ్డూ విష‌యంపై ఎలా మాట్లాడాడ‌ని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింద‌ని, చంద్ర‌బాబు దొరికిపోయారు,  శ్రీ‌వారి భ‌క్తుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ వైసీపీ సోష‌ల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు. మేము స‌త్యహ‌రిశ్చంద్రులం అన్న‌ట్లుగా త‌మ అనుకూల మీడియా ద్వారా ప్ర‌చారం చేశారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు వ్య‌తిరేకించ‌లేక, పూర్తి స్థాయిలో కోర్టు తీర్పును స్వాగ‌తించ‌లేక వైసీపీ నేత‌లు మల్లగుల్లాలు పడుతున్నారు. అంబ‌టి రాంబాబు వంటి నేత‌లు   సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నాం.. కానీ, విచార‌ణ బృందంలో చంద్ర‌బాబు నాయుడు మ‌నుషులు ఉండొద్ద‌ని అంటున్నారు. అంటే, రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఎవ‌రు విచార‌ణ బృందంలో ఉన్నా వారు చంద్ర‌బాబు మ‌నుషులే అని ముద్ర‌వేయ‌డంతో పాటు,  కేంద్రం తరఫునుంచి అంటే సీబీఐ నుంచి నుంచి విచార‌ణ బృందంలో ఉన్న‌వారిని కూడా చంద్ర‌బాబు మేనేజ్ చేస్తారు అనే త‌ప్పుడు వాద‌న‌ను ఇప్ప‌టి నుంచే ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేలా వైసీపీ నేత‌ల వ్యూహం ఉందన్న విషయం అంబటి మాటలతో తేటతెల్లమైపోయింది. తిరుమల శ్రీవారి లడ్డూ విష‌యంలో సుప్రీంకోర్టు తీర్పును ఓసారి ప‌రిశీలిస్తే.  ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలి. ఇందులో  సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలి. 

సరే కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా కోర్టు ఎదుట కీలక అంశాలు ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్‌ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని చెప్పారు. అయితే, తిరుమల శ్రీవారికి దేశ వ్యాప్తంగా భక్తులున్నారు. సీనియర్‌ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే విచార‌ణ‌పై మరింత విశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే.. రాజకీయ జోక్యం ఉండదు అని తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిష‌న్ దారుడు కోరిన‌ట్లు కమిటీని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షించడానికి ధర్మాసనం విముఖత చూపింది. అయితే, వైసీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలచుకోలేదని తీవ్ర స్థాయిలో మండిపడింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించింది. అయితే, వైసీపీ నేత‌లు మాత్రం ఈ వ్యాఖ్య‌ల‌న్నీ చంద్ర‌బాబును ఉద్దేశించిన‌వి అంటూ సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. సుప్రీంకోర్టు చంద్ర‌బాబుకు చివాట్లు పెట్టింద‌ని పోస్టులు పెడుతూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా ప్ర‌య‌త్నిస్తున్నారు. 

తిరుప‌తి ల‌డ్డూ త‌యారీలో క‌ల్తీ నెయ్యి వాడార‌నేది వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోపాటు వైసీపీ నేత‌ల‌కు కూడా తెలుసు. కానీ, త‌ప్పును ఒప్పుకోకుండా..  తాము త‌ప్పు చేయ‌లేదు, చంద్ర‌బాబు నాయుడు తిరుమ‌ల శ్రీ‌వారిని కూడా రాజ‌కీయాల‌కు వాడుకుంటున్నారు,  భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తున్నారంటూ ఎదురు దాడి చేస్తున్నారు. సిట్ విచార‌ణ చేసినా.. స్వ‌తంత్ర ద‌ర్యాప్తు బృందం ద్వారా విచార‌ణ చేయించినా త‌ప్పు చేశాం కాబ‌ట్టి త‌మ‌కు వ్య‌తిరేకంగానే ఫ‌లితం వ‌స్తుంద‌ని జ‌గ‌న్ ముందే ఫిక్స్ అయిపోయారనీ, అందుకే ఈ ఎదురుదాడి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు‌. విచార‌ణ‌లో క‌ల్తీ నెయ్యి వాడార‌ని తేలినా.. ఆ విచార‌ణ అంతా త‌ప్పుడు విచార‌ణ అని, చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే విచార‌ణ జ‌రిగింద‌ని చెప్పుకోవడానికి వీలుగా  వైసీపీ అధిష్టానం ప్లాన్ రెడీ చేసుకున్న‌ట్లు ఆ పార్టీ వ‌ర్గాలే చెబుతున్నాయి. ప‌దేప‌దే సోష‌ల్ మీడియా, త‌మ‌కు అనుకూల మీడియా ద్వారా మేము త‌ప్పుచేయ‌లేదు.. చంద్రబాబు ప్రోద్బ‌లంతోనే విచార‌ణ బృందం త‌ప్పుడు రిపోర్టులు ఇచ్చిందంటూ ప్ర‌చారం చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందే ప్ర‌య‌త్నాల‌ను వైసీపీ నేత‌లు ఇప్పటి నుంచే మొదలెట్టేశారని అంటున్నారు.  మొత్తానికి సుప్రీంకోర్టు తాజా తీర్పు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల్లో ఆందోళ‌న క‌లిగిస్తున్నా.. విచార‌ణ‌లో తిరుమల లడ్డూ ప్రసాదంలో క‌ల్తీ నెయ్యి క‌లిసింద‌ని తేలినా.. విచార‌ణ రిపోర్టు మొత్తం చంద్ర‌బాబు మాయ అంటూ ఎదురుదాడికి జగన్  ఇప్పటి నుంచే సిద్ధ‌మ‌వుతుండ‌టం ఆయనలోని భయాన్ని, తప్పు చేశామన్న అంగీకారాన్ని తెలియచెప్పుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి రెండు రోజుల పాటు వర్చువల్
భారతీయ రాజకీయాల్లో సాధారణంగా కనిపించే శత్రుత్వాలు,
ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంలో సుమారు 15 వేల‌ నుంచి 20 వేల‌ మంది వ‌ర‌కూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఒక‌ అంచనా. అయితే ఈ ప‌రిశ్ర‌మ ఇక్క‌డ స్థాపించ‌డంపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
కాంగ్రెస్ హైకమాండ్ కు, మరీ ముఖ్యంగా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన వీహెచ్ రాజ్యసభకు మూడు పర్యాయాలు ఎంపికయ్యారు. అయితే 2016 తర్వాత ఇంత వరకూ ఆయనకు పార్టీ పరంగా ఎటువంటి పదవీ దక్కలేదు.
కేరళం ప్ర‌జ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ, విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని అన్నారు.
ఎల్‌డీఎఫ్ హయాంలో వి.డి.సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళం కాంగ్రెస్ కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సీఎంగా సతీశన్ ను ఎంపిక చేసింది.
సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల పర్యటనల సమయంలో భద్రతా కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో వాహనాలు కాన్వాయ్‌లో ఉంటాయి. అయితే.. దీనివల్ల భారీగా ఇంధన వ్యయం అవ్వడమే కాకుండా.. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని భావించిన సీఎం, డిప్యూటీ సీఎం.. ఖజానాపై అనవసర భారం పడకూడదనే ఉద్దేశంతో, భద్రతకు విఘాతం కలగకుండానే వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.