Publish Date:Jul 11, 2022
కష్టాలు ఒకే సారి కట్టకట్టుకుని వస్తాయంటారు. ప్రస్తుతం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పరిస్థితి అలాగే ఉంది. ఒక వైపు మెజారిటీ ఎమ్మెల్యేలు షిండే శిబిరంలోకి చేరిపోవడం, శివసేన పార్టీ, గుర్తు కూడా తన నుంచి దూరమయ్యే ప్రమాదం వంటి కష్టాలలో కొనసాగుతున్న ఆయనకు సుప్రీంలో కూడా చుక్కెదురైంది.
షిండే వర్గంలోకి జంప్ అయిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రేకు అక్కడా చుక్కెదురైంది. అనర్హత పిటిషన్ పై అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీం అభిప్రాయపడింది. మహారాష్ట్రలో ప్రస్తుతం యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్న 16 మంది ఎమ్మెల్యేలపై ఇప్పటికిప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని సోలిసిట్ జనరల్ కు స్పష్టం చేసింది.
ఇదే విషయాన్ని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కు తెలియజేయాలని ఆయనను ఆదేశించింది. ఈ కేసు విచారణకు ధర్మాసనం ఏర్పాటు చేయాల్సి ఉందనీ, ధర్మాసనం ఏర్పాటుకు సమయం పడుతుందని సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ పేర్కొన్నారు. అంత వరకూ యథాతథ స్థితి కొనసాగించాలని సోమవారం ఈ కేసు విచారణ సందర్శంగా జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు నిర్ణయంతో షిండే వర్గానికి ఊరట లభించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/supreme-shock-to-uddhav-says-to-maintain-ststuc-co-in-maha-assembly-25-139476.html
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!