రాజకీయాల్లోకి రావడం అంత వీజీకాదు!

Publish Date:Oct 25, 2024

Advertisement

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ఓ సినిమాలో సీతతో అంత వీజీ కాదు అన్న డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. అదే స్టైల్ లో తాజాగా సాయిధరమ్ తేజ్ రాజకీయాలలోకి రావడం అంత వీజీ కాదను అని కామెంట్ చేశారు. మెగా స్టార్ చిరంజీవి పోలికలు కొట్టొచ్చినట్లు కనిపించే సాయిధరమ్ తేజ్ ఇటీవలి ఎన్నికలలో జనసేన తరఫున ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా పిఠాపురంలో మకాం వేసి తన మేనమామ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. దాంతో సాయిధరమ్ తేజ్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారన్న  చర్చ మోగాభిమానుల్లో జోరుగా సాగింది. అయితే ఈ చర్చకు తాజాగా సాయిధరమ్ తేజ్ ఫుల్ స్టాప్ పెట్టేశారు.  

ఇటీవల ఒక వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటరవ్యూలో ఆయన తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు. రాజకీయ ప్రవేశం అంత ఈజీ కాదనీ, పలు అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలని అన్నారు. అయినా తనకు ఇప్పుడు రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశం లేశమాత్రంగానైనా లేదనీ, ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే ఉందనీ కుండబద్దలు కొట్టేశారు.

ఈ ఇంటర్వ్యూలోనే గతంలో తాను ప్రమాదానికి గురైన సంఘటనపైనా మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తాను దాదాపు రెండు వారాలపాటు కోమాలో ఉన్నట్లు చెప్పిన ఆయన తానీ రోజు ప్రాణాలతో ఉండటానికి హెల్మెట్ ధరించడమే కారణమన్నారు. ద్విచక్రవాహనదారులు అందరూ తప్పని సరిగా హెల్మెట్ ధరించాలన్నారు.  ఇవాళ ప్రాణాల‌తో ఉండ‌టానికి కార‌ణం హెల్మెటేన‌ని తెలిపారు.  

By
en-us Political News

  
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.