విచారణలో ఉన్న కేసుపై న్యాయమూర్తి ఇంటర్వ్యూ.. సుప్రీం అసహనం

Publish Date:Apr 25, 2023

Advertisement

కొందరు న్యాయమూర్తులు వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణలో ఉన్న కేసులపై న్యాయమూర్తులు వార్తా సంస్థలకు ఇంటర్వ్యూ ఇవ్వడం ఏ విధంగా చూసినా సమర్థనీయం కాదని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ లో పాఠశాల ఉద్యోగాలను ముడుపులు తీసుకుని అమ్మేశారన్న ఆరోపణలపై నమోదైన కేసుకు సంబంధించి కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ఓ వార్తా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్టాడారంటూ పిటిషనర్, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అయిన అభిషేక్ బెనర్జీ సుప్రీం దృష్టి కి తీసుకువెళ్లారు.

 ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన కాపీని కూడా అందజేశారు. ఈ వ్యవహారాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ పి. ఎస్. నరసింహలతో కూడిన ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. జస్టిస్ గంగోపాధ్యాయ్ ఇంటర్వ్యూ ఇచ్చారో లేదో గురువారంలోగా తమకు తెలియజేయాలని కలకత్తా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.  తాజా ఆదేశాల వల్ల ఈ కేసులో సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ (ఈడీ)ల దర్యాప్తునకు అడ్డంకులు తలెత్తుతాయంటూ అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్. వి. రాజు లేవనెత్తిన అనుమానాలను ధర్మాసనం తోసిపుచ్చింది.

అవి దర్యాప్తును యధావిధిగా కొనసాగించొచ్చని స్పష్టం చేసింది. ఏక సభ్య ధర్మాసనం ఎదుట పెండింగ్ లో ఉన్న కేసుపై న్యాయమూర్తి ఇంటర్వ్యూ ఇవ్వడం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొ న్నారు. పిటిషనర్ గురించి ముఖాముఖిలో జడ్జి మాట్లాడిన సంగతి నిజమే అయితే.. కేసు విచారణ నుంచి ఆయన స్వయంగా తప్పుకొని ఉండాల్సిందని అన్నారు. వార్తా ఛానెల్ ఇంటర్వ్యూలో జస్టిస్ గంగోపాధ్యాయ్ తనకు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేసినట్లు పిటిషనర్ ఆరోపించారు.

కాగా హైకోర్టులలో కొందరు న్యాయమూర్తుల ఉత్తర్వులు, వ్యాఖ్యలపై సుప్రం కోర్టు ఇటీవల పలు సందర్భాలలో అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి విదితమే. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలుపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై కూడా సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ అన్ వారెంటెడ్ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.