కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్లు నరికివేయడంపై సుప్రీం కోర్టు స్టే

Publish Date:May 18, 2026

Advertisement

 

హైదరాబాదులోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో జరుగుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణం మరియు చెట్ల నరికివేత పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. హైదరాబాద్ నగరంలోని అత్యంత ముఖ్యమైన పచ్చదనం కలిగిన ప్రాంతా ల్లో ఒకటైన కేబీఆర్ పార్క్ చుట్టూ ఇప్పుడు మరోసారి పెద్ద చర్చ మొదలైంది. నగరంలో ట్రాఫిక్ సమ స్యలను తగ్గించ డానికి ప్రభుత్వం చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్ట్‌లో భాగంగా అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ నిర్మాణం కారణంగా చెట్ల నరికివేత జరుగుతుందన్న ఆందోళన పర్యావరణ కార్యకర్తలలో మొదలైంది. దీంతో వారంద రూ కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు తాత్కాలికంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాదులో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎస్ఆర్డీపీలో భాగంగా కేబీఆర్ పార్కు చెట్టు ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారం భించింది... అయితే కేబీఆర్ పార్కు చెట్టు ఉన్న పచ్చ దనం హైదరాబాద్ నగరానికి లంగ్స్ ఆఫ్ ది సిటీ ల పనిచేస్తుంది అలాంటి ప్రాంతంలో భారీ నిర్మాణం కారణంగా వందలాది చెట్లు తొలగించే ప్రమాదం ఉందని పర్యావరణ కార్యకర్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో వాద ప్రతి వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం ఎకో సెన్సిటివ్ జోన్ విస్తీర్ణతను తగ్గిస్తుందని, హైకోర్టు సెలవులను అదునుగా తీసుకుని చెట్లు నరికివేస్తుందని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కె. వివేక్ రెడ్డి సుప్రీంకోర్టుకు తెలిపారు.. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం అత్యున్నత న్యాయస్థానం తాత్కాలికంగా కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్కు 35 మీటర్ల పరిధిలోని చెట్లను నరకవద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచార ణను జులై 27 వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు 25 నుండి 30 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్లో చెట్లు నరకడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 

దీంతో ఆ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనులు కొన్ని భాగాల్లో తాత్కాలికంగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది.. కె.బీ.ఆర్ పార్క్ అనేది హైదరాబాద్ నగరానికి ఒక ముఖ్యమైన పర్యావరణ కవచంలా పనిచేస్తుంది. అక్కడి పచ్చదనం వాయు కాలు ష్యాన్ని తగ్గించడమే కాకుండా వేలాది మందికి ఉదయం వాకింగ్ జాగింగ్ కోసం  ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. అలాంటి ప్రాంతం చెట్టు భారీ ఫ్లై ఓవర్ నిర్మాణం జరగడం వల్ల చెట్లు నష్టపోతామని, వాతావరణ కాలుష్యం కూడా పెరిగిపోతుందని పర్యావరణ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
 

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.