గౌరవంగా మరణించే హక్కుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Publish Date:Mar 12, 2026

Advertisement

 

గౌరవంగా మరణించే హక్కుపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 13 సంవత్సరాలుగా స్పృహ లేకుండా జీవచ్ఛవంలా ఉన్న 32 ఏళ్ల హరీశ్‌ రాణాకు అందుతున్న వైద్య సహాయాన్ని నిలిపివేయడానికి అతని తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

13 సంవత్సరాల క్రితం భవనం పై నుంచి కిందపడటంతో హరీశ్‌ రాణా మెదడుకు తీవ్ర గాయాలు అయ్యాయి. అప్పటి నుంచి అతను స్పృహ లేకుండా పూర్తిగా ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నాడు. ఈ కేసును పరిశీలించిన ధర్మాసనం, ఇలాంటి పరిస్థితుల్లో చికిత్సను కొనసాగించడం రోగి ప్రయోజనాలకు మేలు చేస్తుందా లేదా అన్నదే కీలకమని వ్యాఖ్యానించింది.

చదువులో చురుకుగా ఉండే యువకుడు ఇలా జీవచ్ఛవంలా మారడం బాధాకరమని కోర్టు పేర్కొంది. 13 సంవత్సరాలుగా అతని ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి లేదని, కోలుకునే అవకాశం లేదని వైద్య నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో చికిత్స కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదని కోర్టు అభిప్రాయపడింది.

అదేవిధంగా పైపుల ద్వారా అందించే పోషకాహారం కూడా వైద్య చికిత్సలో భాగమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వైద్యుల బృందం రోగిని పరిశీలించి కోలుకునే అవకాశం లేదని నిర్ధారించిన పక్షంలో, లైఫ్ సపోర్ట్‌తో పాటు పోషకాహారాన్ని కూడా నిలిపివేయవచ్చని ఈ తీర్పుతో స్పష్టమైంది.

By
en-us Political News

  
పుష్ప సినిమాను తలపించే రీతిలో కంటైనర్ లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ ఛాంబర్‌లో గంజాయి
ఈ వివాదానికి కారణం కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలే. రాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతీయులని, వాళ్లు దక్షిణాదిపై దాడి చేశారంటూ ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుత తరుణంలో సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధీ పెవిలియ‌న్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు ఊహించని విధంగా భారీ చుక్కెదురైంది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజ నిల్వల్ని గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు, ఐఏఎస్ మంగళవారం డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఫుట్‌బాల్ ప్రపంచంలో ఫిఫా వరల్డ్ కప్ అనేది ఆటగాళ్ల జీవితంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కల.
రంగారెడ్డి జిల్లా జన్వాడలో చోటుచేసుకున్న సాయి–పద్మ దంపతుల ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటూ గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరి లొంగుబాటుతో సాయికృష్ణ అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీ బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆస్పత్రిలో చేరడానికి ముందు మహా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో భేటీ అయిన పవన్ కల్యాణ్ ఆయనను రాష్ట్రానికి రెండు ఆడపులలను ఇవ్వాలని కోరారు. అందుకు ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు.
హైదరాబాద్ నగరంలో మంగళవారం ఒక్కసారిగా సంభవించిన ఒక ఘోర ప్రమాదం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
ఇటీవల ఓ సందర్భంలో ప్రభుత్వ ప్రజారవాణా బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్.. ఆ బస్సు ప్రయాణం తరువాత రాష్ట్రంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం మేరకురాష్ట్ర ప్రభుత్వం ఇకపై కొనుగోలు చేసే బస్సులన్నీ ఏపీ సౌకర్యంతో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.