Publish Date:Nov 22, 2024
ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్ళుగా సాగిస్తున్న బుల్డోజింగ్ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదిగా భావించాలి. నిందితుడికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఒక అధికారి న్యాయమూర్తిగా వ్యవహరించి నిందితుడి ఆస్తిని నేలమట్టం చేయడం అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘించడమే అవుతుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఇది ఆర్టికల్ 19 ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది. నిందితుడి తప్పు వల్ల అతడి కుటుంబ సభ్యులను రోడ్డున పడేయడం దారుణం, దుర్మార్గం, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు విస్ఫష్టంగా పేర్కొంది. అవి అక్రమ నిర్మాణాలు అయితే కనీసం 15 రోజుల ముందు నోటీసు ఇచ్చి కూల్చివేయాలని, నిబంధనలను కచ్చితంగా పాటించి తీరాలని ఆదేశించింది.
ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే అధికారులే బాధ్యత వహించాలని, కూల్చిన కట్టడాలను సొంత ఖర్చులతో నిర్మించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పు బుల్డోజింగ్ పాలకులకు కనువిప్పు కలిగిస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే యోగి సర్కార్ ఇలా సుమారు నాలుగు లక్షల ఇళ్లు కూల్చివేశారు. ఈ నిరంకుశ న్యాయం మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాలకు వ్యాపించింది. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ విరుద్ధమైన ఈ బుల్డోజింగ్ న్యాయానికి వ్యతిరేకంగా గత కొంత కాలంగా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్లో వామపక్షాలు దీనిపై గట్టిగా గళమెత్తాయి. గత ఏడేళ్లుగా ఈ దారుణం యూపీలో జరుగుతుంటే అదొక ఘనకార్యం గా ఆ పార్టీ వర్గాలు చెప్పుకున్నాయి. మైనార్టీ వర్గాలపై బీజేపీ ప్రభుత్వం బుల్డోజింగ్ ప్రయోగిస్తున్నదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది.
తాజాగా ఇలాంటి కూల్చివేతలపై సుప్రీంకోర్టులో దాఖలైన ఈ కేసు విచారించిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. తెలంగాణలో కూడా బుల్డోజింగ్ తరహాను ఫాలో అవుతున్న హైడ్రా కూడా అక్రమ నిర్మాణాలు నిర్మించిన వారికి సమయం ఇవ్వాల్సిఉంది. హైడ్రా విధానం ప్రారంభంలో దూకుడుగా వెళ్లిన విషయం విదితమే. మూసినది చుట్టుపక్కల ఆక్రమణల పై కూడా ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఈ బుల్డోజింగ్ పై సుప్రీంకోర్టు లో విచారణ ప్రారంభమైనప్పటి నుంచి హైడ్రా దూకుడు ఒకింత తగ్గింది. మొత్తం మీద నిబంధనలను తుంగలోకి తొక్కి నిర్మాణాలను అక్రమంగా కూల్చివేయడం తగదంటూ సుప్రీం వెలువరించిన తీర్పు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/supreme-check-to-illegal-demolitions-39-188794.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.