ఏపీ సర్కార్ నెత్తిన కొత్త మొట్టికాయ..రుషి కొండ తవ్వకాలపై సుప్రీం ఆగ్రహం

Publish Date:Jun 1, 2022

Advertisement

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుంది జగన్ సర్కార్ తీరు. ఎన్నిసార్లు కోర్టుల్లో అక్షింతలు పడ్డా ప్రభుత్వం తీరు ఏ మాత్రం మారడం లేదు.  ప్రతిసారీ ఏదో ఒక పనికిమాలిన పని చేయడం.. ఆపై కోర్టులు మొట్టికాయలు వేయడం, బుర్ర బొప్పి కట్టడం వైసీపీ సర్కార్ కు ఒక ఆనవాయితీగా మారిపోయింది. తాజాగా సుప్రీం కోర్టులో వైసీపీకి మరో మొట్టికాయ పడింది. విశాఖపట్నంలోని రుషికొండ వద్ద కొత్తగా తవ్విన చోట నిర్మాణాలు వద్దంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వైసీపీ సర్కార్ ను ఆదేశించింది. రుషికొండలో 62 ఎకరాల స్థలం ఉంది. రుషికొండలో గతంలో రిసార్టు ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే నిర్మాణాలు చేయాలని ఆదేశించింది. అంతకు మించి ఒక్క ఇంచు కూడా అధికంగా నిర్మాణాలు చేయొద్దని ఆదేశించింది. రుషికొండను పునరుద్ధరించేందుకు కూడా అవకాశం లేకుండా మొత్తం తొలి చేయడం గమనార్హం. రుషికొండ అభివృద్ధి నెపంతో అక్కడ ఉన్న పచ్చదనం మొత్తం మాయం చేయడం ఏంటని సుప్రీం ధర్మాసనం నిలదీసింది. భవనాల నిర్మాణం వేరు.. కొండను తొలిచేయడం వేరు అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

 అంతకు ముందు కూడా  ఆంధ్రప్రదేశ్ జన రాజధాని అమరావతిని కాదని, మూడు రాజధానులంటూ  దూకుడుగా వ్యవహరించి, ఆనక కోర్టు మొట్టికాయలతో వెనక్కి తగ్గింది. మూడు రాజధానులంటే మాడు పగిలేలా ఉందని భావించిన వైసీపీ సర్కార్ ‘తేలు కుట్టిన దొంగ’ మాదిరి సైలెంట్ అయిపోయింది. దాంతో పాటు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసిన సీఆర్ డీఏను కోర్టు మొట్టికాయలతో మళ్లీ పునరుద్ధరించింది.

సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏవో వంకలు పెట్టి   ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. రెండేళ్లు అలాగే ఆయనను సస్పెన్షన్ లో ఉంచేసింది. చివరికి సుప్రీంకోర్టుతో మొట్టికాయలు వేయించి మరీ ఏబీవీ మళ్లీ ఉద్యోగంలో చేరడంతో చేసేదేమీ లేక అన్నీ మూసుకుని కూర్చుంది. అలాగే వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చీ రాగానే టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేన్నయినా నామరూపాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకుని మొండిగా కదిలింది. ఆ క్రమంలోనే   2023 వరకు కొనసాగేందుకు అవకాశం ఉన్న వక్ఫ్ బోర్డును 2019 జూలైలోనే రద్దు చేసేసింది. దీంతో కొందరు వక్ఫ్ బోర్డు సభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో వక్ఫ్ బోర్డు రద్దు జీఓను హైకోర్టు రద్దు చేసింది. ఏపీలోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ లాంటి కోర్సులకు అంతకు ముందు నిర్ణయించిన ఫీజులే కొనసాగాలని వైసీపీ సర్కార్ జారీ చేసిన జీఓ 38 అమలును హైకోర్టు నిలిపివేసింది. బార్ లైసెన్సుల ఉపసంహరణ విషయంలో కూడా జగన్ సర్కార్ కు హైకోర్టులో చుక్కుదురైంది.

పంచాయతీ, ప్రభుత్వ భవనాలకు వేసిన వైసీపీ పతాకాన్ని పోలిన రంగుల్ని తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. అమరావతి నుంచి వివిధ కార్యాలయాలను తరలించేందుకు వైసీపీ సర్కార్ యత్నించినప్పడు కూడా హైకోర్టు అడ్డుకట్ట వేసింది. తమ ఆదేశాలు ధిక్కరిస్తే పర్యవసానాలు తప్పవని హైకోర్టు హెచ్చరించే దాకా వైసీపీ సర్కార్ తెచ్చుకుంది. ఇక సీఎం జగన్ బాబాయ్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు వైసీపీ సర్కార్ విముఖత చూపింది. అయితే.. హైకోర్టు మాత్రం వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చెంపదెబ్బ తిన్నట్లయింది. పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు విషయంలో కూడా జగన్ ప్రభుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బే తగిలింది. గతంలో జరిగిన ఒప్పందాన్ని రద్దుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే రివర్స్ టెండరింగ్ కు వెళ్లవద్దని వైసీపీ సర్కార్ ను, ఏపీ జెన్కోను ఆదేశించింది. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్ని ఇళ్ల స్థలాలుగా మార్చి వేరేవారికి ఇచ్చే అధికారం వైసీపీ ప్రభుత్వానికి ఎక్కడుందని హైకోర్టు నిలదీసింది. వన్ సైడ్ గేమ్ ఆడతానంటే సహించేది లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. 

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.