చంద్రుడి కోసం కాంతితో క్రాంతి!

Publish Date:Oct 7, 2023

Advertisement

వెన్నెల చిన్నబోయింది. చందమామ భవిలో తన వెలుగులను మరపించేలా ఆ దీపాలేంటని నివ్వెరపోయింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పిలుపుమేరకు శనివారం(అక్టోబర్ 7)  రాత్రి 7 నుంచి 7.05 గంటల వరకూ జరిగిన కాంతితో క్రాంతి నిరసన కార్యక్రమంలో జనం స్వచ్ఛందంగా పాల్గొన్నారు. బాబు అరెస్టుకు నిరసనలు చేపట్టాలంటే ఏపీకి పోయి చేసుకోండి.. తెలంగాణలో మాత్రం కుదరదు అన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాటలను ఖాతరు చేయకుండా బీఆర్ఎస్ నేతలూ మంత్రులూ కూడా చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు.

నారా చంద్రబాబుకు మద్దతుగా వెలుగుల నిరసనలో రాజకీయ, ప్రాంతీయ భేదాలు లేకుండా అన్ని వర్గాల వారూ పాల్గొన్నారు. చంద్రబాబును వైసీపీ సర్కార్ అక్రమంగా  అరెస్టు చేసిందని జనం విశ్వసిస్తున్నారు. ఈ అరెస్టు క్షక్ష పూరితం, కుట్ర పూరితం అని నమ్ముతున్నారు. అందుకే ఆయన అరెస్టై నెల రోజులు కావస్తున్నా.. తెలుగురాష్ట్రాల్లోనే కాదు దేశ,విదేశాల్లోనూ ఆగకుండా, తగ్గకుండా జనం స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నిరసన తెలిపేందుకూ వెనుకాడటం లేదు.   చంద్రబాబుది అక్రమ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం నిత్యం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే కాంతితో క్రాంతి పేర శనివారం (అక్టోబర్ 7) రాత్రి  7 గంటల నుంచి 7.05 వరకు ఇళ్లల్లో లైట్లు ఆఫ్ చేసి దీపాలు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలలో కాంతితో క్రాంతి నిరసన కార్యక్రమంలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొన్నారు.  రాజమండ్రిలో నారా భువనేశ్వరి, ఢిల్లీలో నారా లోకేశ్ దీపాలు వెలిగించిన నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ అభిమానులు సైతం కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లతో తమ నిరసన తెలిపారు.

 మంగళగిరి ఎన్టీఆర్ భవన్ వద్ద దీపాలు వెలిగించి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిరసన వ్యక్తం చేశారు. ఇక ఏపీలో చంద్రబాబును అరెస్టు చేస్తే తెలంగాణలో ఆందోళనలు ఏమిటి అంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అసహనం వ్యక్తం చేసినా తెలంగాణ వ్యాప్తంగా కాంతితో క్రాంతి కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. పార్టీలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులూ, మంత్రులూ కూడా కాంతితో క్రాంతి కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించారు.  మణికొండ చౌరస్తా నుంచి ల్యాంకోహిల్స్ వరకు తెలుగుదేశం అభిమానులు ర్యాలీ నిర్వహించారు. అంతేకాదు   అలాగే బెంగళూరు, చెన్నైలోనూ లైట్లు ఆపి దీపాలు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.   హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనను తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ప్రారంభించారు. నందమూరి రామకృష్ణ, అమరావతి ఉద్యమనేత కొలికపూడి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, జ్యోత్స్న, శ్రీపతి సతీశ్‌, మురహరిగౌడ్‌, బంటు వెంకటేశ్వర్లు, కొత్తపల్లి మధుసూదన్‌రావు పాల్గొన్నారు. సినీ దర్శకుడు బోయపాటి శ్రీను హైదరాబాద్‌లో తన బృందంతో కలిసి కొవ్వొత్తులు వెలిగించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ అభివృద్ధికి పునాదులు వేసిన నాయకుడు చంద్రబాబునాయుడు అని ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్‌ కూడలి నుంచి చైతన్యపురి శివాజీ విగ్రహం వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. తెలుగుదేశంఉపాధ్యక్షురాలు సుహాసిని, పొలిట్‌బ్యూరో సభ్యుడు అరివింద్‌కుమార్‌గౌడ్‌ తదితరులు నిరసనల్లో పాల్గొన్నారు. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీలోని పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. సిరిసిల్లలో సంఘీభావ ర్యాలీ చేపట్టడంతో పాటు ఏపీ సీఎం జగన్‌కు సద్బుద్ధి ప్రసాదించాలంటూ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కరీంనగర్‌, వనపర్తి, ఖమ్మంలలో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు.

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలంగాణ సెటిలర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో త్వరలో  మిలియన్‌ మార్చ్‌ నిర్వహించనున్నట్లు ప్రసూన తెలిపారు. సనత్‌నగర్‌   కాలనీలో ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష శిబిరానికి అనుమతి లేదని   పోలీసులు శనివారం ఉదయం నిర్వాహకులను స్టేషన్‌కు పిలిచారు. విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పోలీసులకు ఫోన్‌ చేసి నచ్చజెప్పారు. దీక్షా శిబిరానికి చేరుకుని తన మద్దతు ప్రకటించారు.

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23న పిచ్చయ్య, వెంకాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌లోని దోసేపూడి గ్రామంలో జన్మించారు.
తమిళనాడులో ఎన్డీయేకు పట్టం కట్టండి.. చెన్నైలో సీఎం చంద్రబాబు పిలుపు
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.