తుగ్లక్ నిర్ణయాలతో జగన్ సర్కార్ నవ్వుల పాలు... టీచర్లకు వేసవి సెలవులు ఎప్పుడంటే..?
Publish Date:Apr 25, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ నిర్ణయాలు నవ్వుల పాలౌతున్నాయి. తుగ్లక్ పాలనను స్ఫురింప చేస్తున్నాయి. అందుకు తాజా ఉదాహరణగా రాష్ట్రంలో టీచర్లకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చెప్పుకోవచ్చు. సమ్మర్ హాలీడేస్ ను వర్షాకాలానికి మార్చేసి జగన్ పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. రాష్ట్రంలో వచ్చే నెల 6 నుంచి జూలై 3 వరకూ ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. అంత వరకూ బానే ఉంది కానీ టీచర్లకు మాత్రం ఈ సెలవులు వర్తించవట. వీరంతా మే 20 వరకూ పాఠశాలలకు హాజరు కావాల్సిందేనట. రాష్ట్రంలో పరీక్షలన్నీ మే 7తో ముగుస్తున్నాయి. పరీక్షలు అయిపోయిన తరువాత విద్యార్థులకు సెలవులు ఇచ్చేసిన తరువాత టీచర్లు పాఠశాలలకు ఎందుకో అర్థం కాదు. సీపీఎస్ రద్దు కోసం డిమాండ్ చేస్తున్నారన్న కక్షతో ఏదో రకంగా వేధింపులకు గురి చేయడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ టీచర్లకు క్లాసులో విద్యార్థులకు పాఠాలు చెప్పడం కంటే ఇరత పనులే అధికమయ్యాయి. విద్యార్థుల అటెండెన్స్ నుంచి అన్నీ ప్రతి రోజూ వాట్సన్ ద్వారా విద్యాశాఖకు పంపాల్సిందే. ఇక ఇప్పుడు తాజాగా వేసవి సెలవులను మే 20 తరువాతే టీచర్లకు ఇవ్వాలన్న నిర్ణయం వెనుక కూడా టీచర్లకు ఆదాయంలో కోత పెట్టే ఉద్దేశమే కనిపిస్తున్నది. టీచర్లకు వేసవి సెలవులలో స్పీట్ వేల్యుయేషన్ విధులు ఉంటాయి. ఆ విధులకు హాజరైన వారికి ఆర్జిత సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. దానిని ఎగ్గొట్టేందుకే సర్కార్ వేసవిలో సెలవులను వర్షాకాలానికి మార్చేయడం లాంటి వింత పోకడలకు పోతున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ లేక...ఆర్థికంగా రాష్ట్రాన్ని కుదేలు చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు..టీచర్లకు న్యాయబద్ధంగా రావాల్సిన వేతనాలు అలవెన్సులు వంటి వాటిని చెల్లించలేక వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నదని టీచర్లు విమర్శిస్తున్నారు. ప్రశ్నించడమే నేరం అన్నట్లు సీపీఎస్ రద్దు కోసం చలో విజయవాడ వెళ్లిన టీచర్లను అరెస్టులు చేయడమే కాకుండా మొత్తం బెజవాడనే జైలుగా మార్చేశారంటే రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా? అన్న అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు. ఏది ఏమైనా వేసవి సెలవులను వర్షాకాలంలో ఇస్తామంటూ...జగన్ సర్కార్ వింత నిర్ణయం ప్రజలలో నవ్వుల పాలౌతున్నది.
http://www.teluguone.com/news/content/summer-holidays-in-rainy-season-to-teachers-39-134960.html





