Publish Date:Feb 18, 2025
మహా శివరాత్రి తరువాత వేసవి మొదలౌతుంది. ఇది సాధారణం. శివరాత్రికి చలి శివశివా అంటూ పారిపోతుందన్నది ప్రతీతి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. మహా శివరాత్రికి ముందే వేసవి గాడ్పులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయ్. ఫిబ్రవరి రెండో వారం నుంచే ఏసీలు లేకుండా ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి వచ్చిందంటే ఎండల తీవ్రత ఏ విధంగా ఉండో అర్ధం చేసుకోవచ్చు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఉక్కపోత జనాలను ఊపిరాడనీయకుండా చేస్తున్నది.
ఇప్పుడే పగటి ఉష్ణోగ్రతలు 40 డీగ్రీలకు చేరువ కావడం ఆందోళణ కలిగిస్తోంది. ఇప్పుడే ఇలా ఉండే ఇక ఏప్రిల్, మే నాటికి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించిపోయినా ఆశ్చర్యం లేదు. సాధారణంగా మేనెలలో రోహిణి కార్తె లో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయని చెబుతారు.కాని ఇప్పుడు మార్చిలో నే రోళ్లు పగిలే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. గాలిలో తేమశాతంలో భారీగా మార్పులు కనిపిస్తున్నాయి. పగటిపూట గాలిలో తేమ శాతం గణనీయంగా పడిపోతున్నది. అంతే ముందు ముందు ఎండ తీవ్రత అసాధారణంగా ఉంటుందనడానికి వాతావరణ నిపుణులు దీనిని సంకేతంగా చూపుతున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్,మే,జూన్ నెలల్లో ఎండలుమండిపోతాయని,విపరీతమైన వేడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ విభాగం ఇప్పటికే ప్రకటించింది. దేశంలోని పలుప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలకన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ హిమాలయ ప్రాంతం,ఒడిసా ఉత్తర భాగంలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయనీ వాతావరణ శాఖ పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/summer-heat-in-febraury-25-193079.html
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.