Publish Date:Jul 16, 2022
రెడ్డొచ్చె మొదలాడు అన్న సామెతలాగే ఉంది జగన్ సర్కార్ తీరు. మూడేళ్లుగా ఆ పార్టీ ఘనంగా చెప్పుకుంటున్న సంక్షేమ ఫథకాలపై ఆ పార్టీ అధినేతకే అంటే సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ కే అనుమానం కలిగిందా అన్న అనుమానాలు ఆ పార్టీలోనే వ్యక్తమౌతున్నాయి. గత మూడేళ్లుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా.. సర్కార్ పై ఇంతటి వ్యతిరేకత ఏమిటన్నది జగన్ కు అంతుబట్టడం లేదంటున్నారు.
తాజాగా విడుదలైన ఒక జాతీయ స్థాయి సర్వేలోనే ముఖ్యమంత్రి జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని వెల్లడి కావడంతో జగన్ లో అంతర్మథనం మొదలైందని అంటున్నారు. ఇటీవల వాహన మిత్ర లబ్ధిదారులకు సొమ్ము పందేరం చేసిన కార్యక్రమంలో ఆయన తన భుజాలను తానే చరుచుకుంటూ.. అద్భుతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది జగనన్న ప్రభుత్వమేనని తనకు తానే కితాబిచ్చుకున్నారు. అంతలో ఏమైందో ఏమో.. సంక్షేమ పథకాలపై లబ్ధిదారులు సైతం సంతృప్తి వ్యక్తం చేయకపోవడానికి తన మానస పుత్రికగా జగనే చెప్పుకుంటున్న సచివాలయ వ్యవస్థేకారణమన్న అనుమానం ఆయనకు కలిగిందా అని వైసీపీ శ్రేణులు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. అందుకే జగన్ సచివాలయాలలో ఆకస్మిత తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారని అంటున్నాయి. సంక్షేమ పథకాల లబ్దిదారులు ఏమనుకుంటున్నారు,
సచివాలయాల్లో వారికి అందుతున్న సేవలు ఎలా ఉన్నాయి ? లోటుపాట్లు ఏమిటి అన్న విషయాలు తెలుసుకునేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని జగన్ నిర్ణయించారు. తెలుసుకునేందుకు ప్రభుత్వం ఆకస్మిక తనిఖీలు చేపడుతోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంఘనంగా ప్రారంభించిన గ్రామ,వార్డు సచివాలయాలకే ప్రతీ సంక్షేమ పథకాన్నీ లింక్ చేసిన ప్రభుత్వం. ఇప్పుడు అలా చేసి తప్పు చేశామా అని మధన పడుతున్నట్లు పార్టీ శ్రేణులు అంటున్నాయి. అందుకే సచివాలయాల పని తీరు ఎలా ఉంది? సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా జరుగుతోంది.
వాటిపై ప్రజల గ్రామ,వార్డు సచివాలయాలల్లో తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లుకు ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. ఈ తనిఖీల కోసం ప్రభుత్వం ముగ్గురు అధికారులకు బాధ్యతలు అప్పగించింది. తహసీల్దార్ మునిసిపల్ కమిషనర్, మూడు జాయింట్ కలెక్టర లకు ఈ తనిఖీల బాధ్యతలు అప్పగించింది.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో చేపడుతున్న తనిఖీల్లో ఏయే అంశాల్ని పరిశీలించాలన్నది కూడా కలెక్టర్లకు నిర్దేశించినట్లు తెలుస్తోంది. ఇందులో సచివాలయాల్లో ప్రతి రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ప్రజలకు ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు...!!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sudden-inspections-village-25-139863.html
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.