దారీ తెన్ను లేనే లేక ఈ తీరాయెనా?.. అర్థంతరంగా ముగిసిన కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటన

Publish Date:May 23, 2022

Advertisement

ఎంతో ఆర్భాటంగగా మొదలైన కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటన అర్థంతరంగా ముగిసింది. ఆయన  తన పర్యటనను ముందుగానే ముగించుకుని వెనుదిరగడంపై రాజకీయ వర్గాలలో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. విపక్షాలు విమర్శలతో కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. కారణాలేమైతేనేం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన అర్ధంతరంగా ముగిసింది. వారం రోజులకు పైగా షెడ్యూల్ వేసుకుని దేశ వ్యాప్తంగా పర్యటించి జాతీయ రాజకీయాలలో గ్రాండ్ లా ల్యాండ్ అవ్వాలన్న వ్యూహంతో బయలు దేరిన కేసీఆర్ హఠాత్తుగా హైదరాబాద్ కు పీఛేముఢ్ అంటూ వెనుదిరిగి వచ్చేశారు.

ఇంతకీ ఆయన తన దేశ వ్యాప్త పర్యటనలో ఇంత వరకూ కలిసినదెవరంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లను మాత్రమే షెడ్యూల్ ప్రకారం పంజాబ్ , కర్నాటక తదిత రాష్ట్రాలలో కూడా పర్యటించాల్సి ఉన్నా, పంజాబ్ లో రైతులకు సాయం అందించడంతో తన పర్యటనను ముగించారు. దీనికి కారణాలేమిటన్నదానిపై భిన్న కథనాలు వెలువడుతున్నాయి.  పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉండటం, తానూ విదేశీ పర్యటనలో మరిన్ని రోజులు ఉంటే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారుతాయన్న భయంతో తిరిగి వచ్చేశారనీ, కేటీఆర్ దావోస్ పర్యటన ముగించుకుని తిరిగి రాగానే మళ్లీ దేశ వ్యాప్త పర్యటనను కొనసాగిస్తారనీ తెరాస వర్గాల కథనం.

 మరో వైపు దేశంలో ఏ పార్టీ అధినేత కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ తో భేటీకి పెద్దగా సుముఖత చూపడం లేదనీ, ఆ కారణంగానే దేశ వ్యాప్తంగా పర్యటించి ప్రయోజనం లేదన్న భావనతోనే కేసీఆర్ తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని వెనుదిరిగారనీ విపక్షాలు విమర్శల దాడి చేస్తున్నారు.

కేసీఆర్ జాతీయ అజెండా పేరుతో  రచించిన వ్యూహం ఏమిటన్నదానిపై స్పష్టత లేకపోవడం, ఆయన చెబుతున్నట్లుగా రాష్ట్రపతి ఎన్నికలో జరగబోయే సంచలనమేమిటన్నది అర్ధం కాకపోవడంతో రాజకీయ పార్టీల నేతలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలు ఆయనతో భేటీ వల్ల ఏం ఒరుగుతుందన్న భావనతోనే దూరంగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే కేసీఆర్ పర్యటన  అర్ధంతరంగా ముగించుకుని వెనుదిరిగారని వారు చెబుతున్నారు.  

By
en-us Political News

  
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.