నాలుగు స్తంభాలాట.. ఏపీలో వారసుల వార్!

Publish Date:Jul 6, 2023

Advertisement

ఏపీలో రాజకీయాలు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం ఉండగానే దాదాపుగా అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులు మొదలు పెట్టాయి. దాదాపుగా అన్ని పార్టీలకు రాబోయే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమే కానున్నాయి. అధికార పార్టీ వైసీపీ  జగన్ పాలనకు రెఫరెండంగా వచ్చే ఎన్నికలను భావిస్తుంటే,  టీడీపీ  చంద్రబాబు దార్శనికతపై ప్రజలలో ఉన్న నమ్మకానికి ఈ ఎన్నికలు గీటురాయిగా భావిస్తోంది.  ఇక, జనసేనకు సైతం ఈ ఎన్నికలే ప్రజలలో  పవన్ పై ఏ మేరకు విశ్వాసం ఉందన్న విషయానికి పరీక్షగా మారాయి.  కాగా  ఏపీలో  ఈసారి ఎన్నికలలో  మరో  ఆసక్తికర అంశం కనిపిస్తుంది. అదే వారసుల మధ్య పోరు.

ఏపీలో ఇప్పుడు నలుగురు వారసుల మధ్య ఆసక్తికర పోరు కనిపిస్తుంది. ఇప్పటికే నలుగురూ రాజకీయాలలో కీలకంగా ఉన్నా రానున్న ఎన్నికలలో ఈ నలుగురి మధ్య జరగనున్న పోరు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. వారెవరో కాదు.. మాజీ సీఎం రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కుమార్తె వైఎస్ షర్మిల, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్, మాజీ సీఎం నందమూరి తారక రామారావు కుమార్తె పురంధేశ్వరి. ఈ నలుగురు మాజీ ముఖ్యమంత్రుల వారసులే కాగా ఇప్పుడు ఈ నలుగురి మధ్యా జరుగుతున్న రాజకీయ పోరు అత్యంత ఆసక్తికరంగా మారింది.  

ముందుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీసుకుంటే ఆయనకు  ప్రధాన పోటీ లోకేష్. టీడీపీ నుండి సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడే అయినా.. రానున్న ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపించే విషయంలో కర్త, ఖర్మ, క్రియ అన్నీ లోకేషే కానున్నారు. వైఎస్ఆర్, చంద్రబాబు సమకాలికులు కాగా ఇప్పుడు తదననుగుణంగానే వారసుల మధ్య పోటీ అనివార్యమైంది. ఇప్పటికే టీడీపీ ఐకాన్ గా లోకేష్ పాదయాత్రలో ఉన్నారు.  సంపూర్ణ ఆరోగ్యంగా చంద్రబాబు యువకులతో పోటీపడుతున్నా..తండ్రిని మించిన తనయుడిగా రుజువు చేసుకునే క్రమంలో లోకేష్ రాటుదేలుతున్నారు.  ఔనన్నా కాదన్నా జగన్ మోహన్ రెడ్డికి ఎటు చూసినా లోకేషే పోటీ. లోకేష్ కు కూడా జగన్ మోహన్ రెడ్డినే పోటీ. తండ్రి చంద్రబాబు జగన్ తండ్రి వైఎస్ఆర్ తో తలపడితే ఇప్పుడు ఆయన కుమారుడిని లోకేష్ ఢీ కొట్టాల్సిన పరిస్థితి అనివారమైంది.

మరోవైపు వైఎస్ఆర్ కుమార్తె షర్మిలతో కూడా వైఎస్ఆర్ కుమారుడు జగన్ పోటీకి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. షర్మిల తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనుందనే ప్రచారం తెలిసిందే కాగా.. అదే జరిగితే కాంగ్రెస్ నుండి షర్మిల.. వైసీపీ నుండి జగన్ తలపడాల్సి వస్తుంది. ఇప్పటికే పులివెందుల నుంచి షర్మిల బరిలోకి దిగుతుందా అన్న చర్చ అయితే మొదలైంది. అదే సమయంలో షర్మిలతో మాజీ సీఎంలు చంద్రబాబు కుమారుడు లోకేష్, బీజేపీ అధ్యక్షురాలిగా ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి కూడా  పోటీకి దిగాల్సి వస్తుంది. అదే సమయంలో పురంధేశ్వరికి జగన్ తో కూడా వార్ తప్పదు. అలాగే బీజేపీతో టీడీపీ పొత్తు కుదరకపోతే పురంధేశ్వరి చంద్రబాబు,  లోకేష్ తో కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది.

మొత్తంగా చూస్తే రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ వర్సెస్ చంద్రబాబు కుమారుడు లోకేష్,  వైఎస్ఆర్ కుమార్తె షర్మిల, ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి.. చంద్రబాబు కుమారుడు లోకేష్ వర్సెస్ వైఎస్ఆర్ కుమారుడు జగన్, కుమార్తె షర్మిల.. వైఎస్ఆర్ కుమార్తె షర్మిల వర్సెస్ కుమారుడు జగన్, చంద్రబాబు కుమారుడు లోకేష్, ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి.. ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి వర్సెస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల, కుమారుడు జగన్ ఇలా నువ్వా నేనా అన్నట్లు వారసుల మధ్య ఆసక్తికర రాజకీయ పోటీ కనిపిస్తుంది. మరి ఈ పోటీలో ఈసారి నెగ్గేదెవరో తగ్గేదెవరో చూడాలి. ఈ నలుగురూ ఎన్నికల బరిలో ముఖాముఖి తలపడే పరిస్థితి ఉండకపోయినా వారు ప్రాతినిథ్యం వహించే పార్టీలను విజయ పథంలో నడిపించే విషయంలో మాత్రం తీవ్రంగా పోటీ పడక తప్పని పరిస్థితులు ఉన్నాయి.

By
en-us Political News

  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.