కిషన్ రెడ్డి ఫస్ట్ టాస్క్ ఇదేనా?

Publish Date:Jul 6, 2023

Advertisement

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డి ఆ బాధ్యతలు చేపట్టేందుకు కొంత సమయం తీసుకుంకుంటున్నారు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన తరువాత మాత్రమే ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. ఇప్పటికే బండి సంజయ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేశారు. దీంతో మోడీ తెలంగాణ పర్యటన సమయంలో రాష్ట్ర పార్టీ నాయకుడులేని సైన్యంగా ఉండనుంది.

అయితే ఈ నెల 18న జరగనున్న ప్రధాని వరంగల్ సభను సక్సెస్ చేయడం తమ ముందున్న టాస్క్ అని కిషన్ రెడ్డి చెప్పారు.బాధ్యతలు ఇంకా చేపట్టకపోయినప్పటికీ ప్రధాని సభకు ముందునుంచీ పార్టీ చెబుతున్నవిధంగా పదిహేను లక్షల మందిని  సమీకరించి సభను గ్రాండ్ సక్సెస్ చేయడంపైనే కిషన్ రెడ్డి సక్సెస్ ఆధారపడి ఉంటుందని రాజకీయ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.  గత నాలుగేళ్లుగా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డికి రాష్ట్రంలో సభలు, సమావేశాల నిర్వహణలో భాగస్వామి కావాల్సిన అవసరం పెద్దగా లేకుండా పోయింది. అయితే బండి  పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా  బీజేపీ అధిష్ఠానం మెప్పు పొందేలా రాష్ట్రంలో బీజేపీ సభలను నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో బీజేపీ సభలను సక్సెస్ చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై అలుపెరుగని పోరాటం చేశారు. రాష్ట్రంలో విడతల వారీగా పాదయాత్ర చేసిన బండి సంజయ్ ఆయా సందర్భాలలో ఏర్పాటు చేసిన ముగింపు సభలకు పార్టీ జాతీయ నాయకులను రప్పించి వాటిని గ్రాండ్ సక్సెస్ చేశారు.

బండి సంజయ్ పని తీరును స్వయంగా మోడీ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో ప్రశంసించారు. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారాయి. అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో బండి తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ సభ సక్సెస్ కోసం ఆయన పూర్తి స్థాయిలో  పని చేస్తారన్న నమ్మకం లేదని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇక ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు ఏ మేరకు మోడీ సభ విజయవంతానికి పని చేస్తారన్న అనుమానాలూ ఉన్నాయి. మొత్తంగా బండి సంజయ్ మార్పుతో రాష్ట్ర బీజేపీలో ఒక్క సారిగా నిస్తేజ వాతావరణం ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి మోడీ సభ సక్సెస్ కోసం ఒక్కడిగా, ఒంటరిగా కష్టపడక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయంటున్నారు.

అందుకే కిషన్ రెడ్డి రెండు రోజుల పాటు వరంగల్ లోనే మకాం వేయనున్నారు. అధిష్టానం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించిన అనంతరం తొలి సభ కావడంతో ప్రధాని మోడీ గుడ్ లుక్స్ లో పడేందుకు ఈ సభ సక్సెస్ విషయంలో కిషన్ రెడ్డి శక్తికి మించి కృషి చేయాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ తెలంగాణ జిల్లాల అధ్యక్షుల నుంచి ఆశించిన విధంగా కిషన్ రెడ్డికి సహకారం అందే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయని చెబుతున్నారు.

  గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉన్నప్పటికీ.. ఏడేళ్లుగా కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉండటంతో జిల్లాల అధ్యక్షులతో అంతగా సంబంధాలు లేని పరిస్థితి ఉందని చెబుతున్నారు.  ఆ కారణంగానే సభ సక్సెస్ విషయంలో అనుమానాలు ఉండటం వల్లనే కిషన్ రెడ్డి మోడీ సభ అనంతరం మాత్రమే పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపడతానని అంటున్నారని పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది. 

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.