టెక్కీ సక్సెస్ స్టోరీ..

Publish Date:Mar 14, 2026

Advertisement

ఐటీ రంగం అవకాశాల గని. కష్టపడి పని చేస్తే.. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుంటే.. స్వల్ప కాలంలోనే విజయాలు వెతుక్కుంటూ వస్తాయి. ఈ విషయం గతంలోనూ పలుమార్లు రుజువైంది. తాజాగా ఓ సాఫ్ట్ వేర్  ఇంజనీర్  కేవలం నాలుగేళ్ల కాలంలోనే  అద్భుత విజయాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ టెక్కీ కేవలం నాలుగేళ్లలోనే తన జీతాన్ని రూ.3.5 లక్షల వార్షిక ప్యాకేజీ నుంచి రూ.65 లక్షల వరకు పెంచుకున్నారు.  

వివరాలిలా ఉన్నాయి.  2021లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం పొందిన ఈ టెక్కీకి ఆరంభంలో వచ్చిన యాన్యువల్ ప్యాకేజీ 3.5 లక్షల రూపాయలు. కెరీర్ లో ఎదగాలన్న లక్ష్యంతో, పట్టుదలతో, సంకల్పంతో  ఆయన   కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టారు. అలాగే బెటర్ ఆపర్చ్యునిటీల కోసం.. గాలిస్తూ, పలు కంపెనీల ఇంటర్వ్యూలకు రెడీ అయ్యారు.

తన స్కిల్స్ ను పెంచుకోవడంతో ఆయనకు  మరింత మంచి ఉద్యోగ అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. దీంతో ఒక్కోసారి కంపెనీ మారుతూ తన జీతాన్ని క్రమంగా పెంచుకుంటూ వచ్చాడు. ఈ ప్రయాణంలో కొన్ని సందర్భాల్లో అతనికి 40 నుంచి 50 శాతం వరకు వేతన పెరుగుదల కూడా లభించింది.

చివరకు మరో ప్రముఖ ఐటీ సంస్థలో చేరిన తర్వాత అతని వార్షిక ప్యాకేజీ రూ.65 లక్షలకు చేరుకుంది. ఈ తన ప్రస్థానాన్ని ఆ టెక్కీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.  నెటిజన్లు ఆయన పట్టుదలను, కష్టపడి పని చేసే తత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.  ఈ టెక్కీ విజయగాధ ఐటీ రంగంలో ఎదగాలనుకునే యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.  

By
en-us Political News

  
అధికారిక గణాంకాల్లో జీడీపీ, రిటైల్ సేల్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇలా అన్ని రంగాలలో వృద్ధి చూపిస్తాయి. కానీ నేలమీద ప్రజలు చూస్తున్నది మాత్రం వేతనాలు అందకపోవడం, బ్యాంకుల్లో దాచుకున్నడబ్బు విత్ డ్రా చేసుకోవడానికి అడ్డంకులు, ఇబ్బందులు. మూతపడుతున్నఆస్పత్రులు, కట్టుదిట్టమైన ఆలయ నియంత్రణలు, రక్షణ నుంచి ఎక్స్ట్రాక్షన్ వైపు మార్పు.
రానున్న జనాభా గణనలో ప్రజల జీవనశైలితో పాటు, వారి ఆహారపు అలవాట్లపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
ప్రముఖ భారతీయ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తాజాగా న్యాయపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు.
పున‌ర్వికకు పున‌ర్జ‌న్మ‌ను ప్ర‌సాదించే చికిత్స‌కు సాయం అందించారు. విదేశాల నుంచి రూ.16 కోట్ల ఇంజెక్ష‌న్ రప్పించేందుకు స‌హ‌క‌రించారు. ఇంజెక్ష‌న్ వేసేట‌ప్పుడు చిన్నారి పున‌ర్విక చెంత‌నే ఉన్నారు. సాయం అందించిన‌ ల‌క్ష‌లాది మంది ప్రార్థ‌న‌లు ఫ‌లించాయి. పున‌ర్జ‌న్మ పొందిన పున‌ర్విక లోకేష్ చేతుల్లోంచి బోసిన‌వ్వులు చిందించింది.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
విచారణ పారదర్శ కంగా జరగాలనే ఉద్దేశంతో ప్రముఖ సంస్థలు డెల్లాయిట్, త్రిలిగల్ సహకారంతో విచారణ చేపట్టింది. ఈ కమిటీ పనితీరును టీసీసీ ప్రెసిడెంట్, సీఈవో క్రితివాసన్ పర్యవేక్షిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
తెలిసిన అబ్బా యికి తన కూతుర్ని ఇస్తే సంతోషంగా ఉంటుందని భావించిన తల్లిదండ్రులు 2024లో సంగీతకు నవీన్ తో ఘనం గా వివాహం జరిపించారు. ఆ సందర్భంగా ఆరు లక్షల కట్నంతో పాటు అన్ని లాంఛనాల ఇచ్చారు. కోటి ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టిన సంగీతకు వేధింపులు ఎదురయ్యాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎన్డీయే సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది.
ఇద్దరు దుండగులు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న షాప్ లపై రెక్కీ నిర్వహించారు. అనంతరం గురువారం అర్ధరాత్రి సమయంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుగుతూ.. హఫీజ్ పేట్ మార్తండ నగర్ లో హోల్సేల్ సిగరెట్ల షాప్ వద్ద ఆగి, ఇనుప రాడ్లతో దుకాణం తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి కొంత నగదు, విలువైన సిగరెట్ కార్టన్లు తీసుకొని దర్జాగా మళ్ళీ కారులో అక్కడి నుండి వెళ్ళిపోయారు.
ఇజ్రాయెల్–లెబనాన్ కాల్పుల విరమణ చిన్న కిటికీ మాత్రమే.. పెద్ద పరిష్కారం కాదు. ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దులో తాత్కాలిక కాల్పుల విరమణ ఒక సన్నని రాజకీయ కిటికీ తెరిచింది. అయితే ఇది ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య ఉన్న మూల భద్రతా సమస్యలను పరిష్కరించలేదు. హిజ్బుల్లా వద్ద ఉన్న రాకెట్, డ్రోన్ సామర్థ్యం, ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు భద్రతపై ఉన్న ఆందోళనలు, లెబనాన్లో హిజ్బుల్లా యొక్క ప్రభావం ఇందుకు కారణం.
ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దుల్లో అమలులోకి వచ్చిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒక ఆశావహ పరిస్థితిని ఆవిష్కరించినప్పటికీ, ఇది కేవలం ఒక చిన్న రాజకీయ అవకాశంగానే కనిపిస్తోంది తప్ప ఉద్రిక్తతలను చల్లార్చే శాశ్వత పరిష్కారంగా ఎంత మాత్రం స్థిరపడే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇరాన్ విషయంలో అమెరికా అంచనాలు తలకిందులవ్వడంతో ట్రంప్ సంయమనం కోల్పోయినట్లు కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.