విద్యార్థుల ఆత్మహత్యలన్నీ.. వ్యవస్థ చేస్తున్న హత్యలే!

Publish Date:Mar 14, 2023

Advertisement

చదువు పేరుతో కళాశాల యాజమాన్యం పెట్టే ఒత్తిడి భరించలేక, తక్కువ మార్కులు వస్తే తోటి విద్యార్థుల ముందు చేసే అవమానం భరించ లేక తరగతి గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడో ఇంటర్ విద్యార్థి.  సరిగా చదవలేకపోతున్నానన్న బాధతో, మార్కులు తక్కువ వస్తాయన్న భయంతో, పరీక్ష తప్పుతానేమోనన్నఅనుమానంతో ఒక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అంతకంటే ముందు సీనియర్ల వేధింపులు భరించ లేక మోడికో ప్రీతి తనువు చాలించింది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు. ప్రతి రోజూ ఆత్మహత్యల వార్తలు మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి.  దేశంలో ఆత్మహత్యల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా విద్యార్థులు, అందులోనూ టీనేజీ పిల్లల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.  నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో గణాంకాల ప్రకారం, దేశంలో చోటు చేసుకుంటున్న ప్రమాద మరణాలు, ఆత్మహత్యల్లో ఎనిమిది శాతానికిపైగా విద్యార్థులే కావడం విషాదం.  అయితే విద్యార్థుల బలవన్మరణాలన్నీ వ్యవస్థ చేసిన హత్యలుగానే భావించాల్సి ఉంటుంది.

స్వేచ్ఛగా, స్వచ్ఛంగా జరగాల్సిన విద్యాబోధన.. మార్కులు, ర్యాంకుల వేటగా మార్చేసి..పిల్లలను వాటి వెంట పరుగులెత్తిస్తుండటమే వారిలో ఆత్మవిశ్వాసం లోపించడానికి కారణంగా చెప్పాలి. ఇష్టాయిష్టాలు, శక్తి సామర్ధ్యాలను పరిగణనలోకి  తీసుకోకుండా ర్యాంకులు, మార్కులే జీవితం అంటూ అగమ్య పోటీతత్వాన్ని పెంచేసే విధానమే పిల్లలలో ఆత్మహత్యలు పెరగడానికి కారణమని మానసిక నిపుణులు చెబుతున్నారు. అసలు విద్యా సంస్థల్లో సంస్కరణల కోసం  ప్రభుత్వాలు తీసుకువచ్చిన చట్టాలు ఏ మేరకు అమలవుతున్నాయి? అసలు అమలు అవుతున్నాయా?  అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తమౌతున్నాయి.  ఈ పరిస్థితికి   విద్యాసంస్థలు, అధ్యాపకులు, నిబంధనల రూపకర్తలు,  సమాజం కూడా కారణమనే చెప్పాల్సి ఉంటుంది.

 విద్యను, విద్యాబోధనను సంస్కరించాలి. ఈ సంస్కరణల్లో   తల్లితండ్రులు, అధ్యాపకులు, అధికారులు భాగస్వాములు కావాలి.  ప్రధానంగా  విద్యా బోధనను, విద్యా సంస్థలను  వాణిజ్యమయం కాపాడాలి. అలాగే విద్యార్థుల మధ్య కుల, మత, లింగ  వివక్ష లేకుండా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ఇప్పటికీ ప్రభుత్వాలు ఒక నిర్దిష్ఠ కార్యాచరణను రూపొందించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోకుండా ముందు ముందు మరింత భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.  

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.